అన్వేషించండి

Realme 11X 5G: రూ.15 వేలలోపే 5జీ ఫోన్ లాంచ్ చేసిన రియల్‌మీ - 16 జీబీ వరకు ర్యామ్, భారీ డిస్‌ప్లే కూడా!

రియల్‌మీ 11ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.15 వేలలోపే ఉంది.

Realme 11X 5G Features: రియల్‌మీ తన కొత్త బడ్జెట్ 5జీ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే రియల్‌మీ 11ఎక్స్ 5జీ. రూ.15 వేలలోపు ధరతోనే ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంను ఈ ఫోన్‌లో అందించారు. ఇందులో 64 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.

రియల్‌మీ 11ఎక్స్ 5జీ ధర
ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999గా నిర్ణయించారు. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999గా ఉంది. మిడ్‌నైట్ బ్లాక్, పర్పుల్ డాన్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఆగస్టు 30వ తేదీ నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ, కొన్ని లీడింగ్ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డులతో ఈ ఫోన్ కొనుగోలు చేస్తే ప్రారంభ ఆఫర్ కింద రూ.1,500 తగ్గింపు లభించనుంది.

రియల్‌మీ 11ఎక్స్ 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌మీ యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టంపై రియల్‌మీ 11ఎక్స్ 5జీ పని చేయనుంది. ఈ ఫోన్‌లో 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ శాంసంగ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 240 హెర్ట్జ్‌గా ఉంది.

రియల్‌మీ 11ఎక్స్ 5జీలో 8 జీబీ ర్యామ్ అందుబాటులో ఉంది. డైనమిక్ ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ద్వారా ర్యామ్‌ను మరింత పెంచుకునే అవకాశం ఈ ఫోన్‌లో కూడా ఉంది. ఈ ఫీచర్ ద్వారా ర్యామ్‌ను 16 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఆక్టాకోర్ 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్‌ పని చేయనుంది.

ఈ ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ అందుబాటులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.

రియల్‌మీ 11ఎక్స్ 5జీలో 128 జీబీ వరకు స్టోరేజ్ అందుబాటులో ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను మొబైల్ పక్కభాగంలో అందించారు. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, ఏ-జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఈ మొబైల్ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.78 సెంటీమీటర్లు కాగా, బరువు 190 గ్రాములుగా ఉంది. రియల్‌మీ 11ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్‌తో పాటు రియల్‌మీ 11 5జీ మొబైల్ కూడా లాంచ్ అయింది.

Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Abhijeet Dipke: జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Embed widget