అన్వేషించండి

రూ.15 వేలలోనే వన్‌ప్లస్ ఫోన్ - లాంచ్ చేసిన కంపెనీ!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన అత్యంత చవకైన ఫోన్ లాంచ్ చేసింది. అదే వన్‌ప్లస్ నార్డ్ ఎన్20 ఎస్ఈ.

వన్‌ప్లస్ నార్డ్ ఎన్20 ఎస్ఈ స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ చైనాలో లాంచ్ చేసింది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు.

వన్‌ప్లస్ నార్డ్ ఎన్20 ఎస్ఈ ధర
ఈ స్మార్ట్ ఫోన్ ధరను 199 డాలర్లుగా (సుమారు రూ.15,800) నిర్ణయించారు. బ్లూ ఒయాసిస్, సెలస్టియల్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన సేల్ చైనా ఆగస్టు 8వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మనదేశంలో కూడా ఈ ఫోన్ త్వరలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

వన్‌ప్లస్ నార్డ్ ఎన్20 ఎస్ఈ స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై వన్‌ప్లస్ నార్డ్ ఎన్20 ఎస్ఈ పని చేయనుంది. ఇందులో 6.56 అంగుళాల డిస్‌ప్లేను అందించారు. 2డీ స్లిమ్ బాడీతో ఈ ఫోన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు కూడా కెమెరాను అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 33W సూపర్‌వూక్ వైర్డ్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. ఈ ఫోన్ 50 శాతం చార్జ్ అవ్వడానికి కేవలం 30 నిమిషాల సమయం మాత్రమే పట్టనుందని కంపెనీ తెలిపింది. గతంలో లాంచ్ అయిన ఒప్పో ఏ57 4జీకి రీబ్రాండెడ్ వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయినట్లు తెలుస్తోంది.

ఇటీవలే వన్‌ప్లస్ 10టీ కూడా మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.46,999 నుంచి ప్రారంభం కానుంది. ఆగస్టు 6వ తేదీ నుంచి అమెజాన్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. క్వాల్‌కాం లేటెస్ట్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. అలాగే ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, వెనకవైపు మూడు కెమెరాలు కూడా ఉన్నాయి.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

టాప్ హెడ్ లైన్స్

Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
Embed widget