అన్వేషించండి

Nokia C22: రూ.8 వేలలోపే నోకియా కొత్త ఫోన్ లాంచ్ - మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నోకియా మనదేశంలో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే నోకియా సీ22.

Nokia C22: నోకియా సీ22 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ మొబైల్ గ్లోబల్‌గా ఇప్పటికే లాంచ్ అయింది. రెండు స్టోరేజ్ వేరియంట్లు, మూడు కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఐపీ52 రేటింగ్, 2.5డీ డిస్‌ప్లే గ్లాస్, బలమైన మెటల్ ఛాసిస్‌తో ఈ ఫోన్ లాంచ్ అయింది.

నోకియా సీ22 ధర
ఈ ఫోర్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో 2 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.7,999గా నిర్ణయించారు. ఇక 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.8,499గా నిర్ణయించారు. చార్‌కోల్, పర్పుల్, శాండ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

నోకియా సీ22 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.5 అంగుళాల ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఆక్టాకోర్ యూనిసోక్ ఎస్సీ9863ఏ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 4 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకోవచ్చు.

ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టంపై నోకియా సీ22 పని చేయనుంది. దీని బ్యాటరీ గురించి కంపెనీ ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. అయితే 10W ఛార్జింగ్ సపోర్ట్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను ఈ ఫోన్ అందించనుందని తెలుస్తోంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా, దీంతో పాటు మరో 2 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉంది. ఎల్ఈడీ ఫ్లాష్‌ను కూడా ఈ ఫోన్‌లో అందించారు. ముందు వైపు ఉన్న 8 మెగాపిక్సెల్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్‌కు ఉపయోగపడనుంది.

సెక్యూరిటీ కోసం ఫోన్ వెనక వైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండనుంది. ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. రెండు సంవత్సరాల పాటు త్రైమాసిక సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనున్నారు. కానీ ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్స్ మాత్రం రావు. అంటే ఆండ్రాయిడ్ 13తోనే ఈ ఫోన్ వాడుకోవాలన్న మాట.

నోకియా సీ12 ప్రో స్మార్ట్ ఫోన్ కూడా ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. ఈ ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 2 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.6,999గా నిర్ణయించారు. 3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,499గా ఉంది. 2 జీబీ వరకు వర్చువల్ ర్యామ్ పెంచుకోవచ్చు. లైట్ మింట్, చార్ కోల్, డార్క్ సియాన్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

ఈ ఫోన్‌లో 6.3 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఆండ్రాయిడ్ 12 (గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టంను ఇందులో అందించారు. రెండు సంవత్సరాల పాటు రెగ్యులర్ సెక్యూరిటీ ప్యాచెస్‌ను కంపెనీ ఇవ్వనుంది. 12 నెలల పాటు రీప్లేస్‌మెంట్ గ్యారంటీ కూడా లభించనుంది.

Also Read: నా నెత్తి మీద గన్ పెట్టినా మీ మెసేజ్‌లు చూడలేను - వాట్సాప్‌కు పోటీగా ట్విట్టర్‌ను తయారు చేస్తానంటున్న మస్క్!

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ సెన్సార్ అందించారు. దీనికి సంబంధించిన మిగతా ఫీచర్లను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

Also Read: రూ.500లోపు పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల కోసం చూస్తున్నారా? - ఎయిర్‌టెల్, జియోల్లో బెస్ట్ ఇవే!

టాప్ హెడ్ లైన్స్

KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Embed widget