అన్వేషించండి

Lava Storm: బడ్జెట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? త్వరలో సూపర్ 5జీ ఫోన్ లాంచ్ చేయనున్న లావా!

లావా కొత్త ఫోన్ మనదేశంలో లాంచ్ కానుంది. అదే లావా స్టార్మ్, స్టార్మ్ ప్రో 5జీ.

లావా స్టార్మ్, లావా స్టార్మ్ ప్రో 5జీ స్మార్ట్ ఫోన్లను కంపెనీ రూపొందిస్తుంది. ఇది త్వరలో మనదేశంలో కూడా లాంచ్ కానుంది. మీడియాటెక్ హీలియో చిప్‌సెట్లతో ఈ ఫోన్లు రానున్నాయి. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్లు కూడా లీకయ్యాయి. లావా బ్లేజ్ 5జీ స్మార్ట్ ఫోన్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌ను ఈ ఫోన్‌లో అందించారు. దీని ధర రూ.10 వేలలోనే ఉండే అవకాశం ఉంది.

లావా స్టార్మ్, లావా స్టార్మ్ ప్రో 5జీ స్పెసిఫికేషన్లు (అంచనా)
ప్రైస్ బాబా కథనం ప్రకారం లావా స్టార్మ్, లావా స్టార్మ్ ప్రో 5జీ స్మార్ట్ ఫోన్లు నవంబర్, డిసెంబర్‌లో లాంచ్ కానున్నాయి. వీటిలో లావా స్టార్మ్ 4జీ మొబైల్ కాగా, లావా స్టార్మ్ ప్రో అనేది 5జీ స్మార్ట్ ఫోన్. మీడియాటెక్ హీలియో చిప్‌సెట్లతోనే ఈ రెండు ఫోన్లూ రానున్నాయి. ఇందులో 50 మెగాపిక్సెల్ కెమెరా ఉండనుంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. లావా స్టార్మ్ ప్రో 5జీలో 33W ఫాస్ట్ చార్జింగ్‌ను అందించనున్నారు.

లావా బ్లేజ్ 5జీ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. దీని ధరను లావా ఇంతవరకు వెల్లడించలేదు. అయితే రూ.10 వేలకు కాస్త అటూఇటుగా ఉంటుందని లావా ప్రెస్ నోట్ ద్వారా తెలిపింది. కాబట్టి దేశంలో అత్యంత చవకైన 5జీ ఫోన్ ఇదే కానుంది. దీనికి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు దీపావళి నుంచి ప్రారంభం కానున్నాయి.

లావా బ్లేజ్ 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.51 అంగుళాల హెచ్‌డీ+  ఐపీఎస్ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. వైడ్‌వైన్ ఎల్1 సపోర్ట్ కూడా ఈ ఫోన్‌లో ఉంది. 4 జీబీ ర్యామ్‌ను ఇందులో అందించారు. వర్చువల్ ర్యామ్ ఆప్షన్ ద్వారా మరో 3 జీబీని స్టోరేజ్ నుంచి ర్యామ్‌గా మార్చుకోవచ్చు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... లావా బ్లేజ్ 5జీ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు రెండు ఏఐ లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 128 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉండనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.

Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lava Mobiles (@lava_mobiles)

టాప్ హెడ్ లైన్స్

iPhone 3 Whats App Accounts: ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
Apple iPhone 18 Pro Sales EMI: ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ సేల్స్ షురూ.. EMI, క్యాష్‌బ్యాక్ వివరాలు ఇవే!
ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ సేల్స్ షురూ.. EMI, క్యాష్‌బ్యాక్ వివరాలు ఇవే!
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Politics: జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
KTR Janwada Farmhouse: నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
CM Chandrababu In Vizag: పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
Dorothy Trailer: మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
MS Subbulakshmi: భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
iPhone 3 Whats App Accounts: ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
Viral Video: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
Romantic Comedy OTT : సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
Embed widget