అన్వేషించండి

iQoo Z6 Lite 5G: పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చే స్మార్ట్ ఫోన్ - సెప్టెంబర్ 14వ తేదీన లాంచ్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ కొత్త ఫోన్ మనదేశంలో సెప్టెంబర్ 14వ తేదీన లాంచ్ కానుంది. అదే ఐకూ జెడ్6 లైట్ 5జీ.

ఐకూ జెడ్6 లైట్ 5జీ మనదేశంలో సెప్టెంబర్ 14వ తేదీన లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన మైక్రో సైట్ కూడా అమెజాన్ వెబ్ సైట్లో ప్రత్యక్షం అయింది. ఇందులో ఫోన్‌కు సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లు కూడా రివీల్ అయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్‌లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ ఉండనుంది. పేరు తెలియని క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ ఇందులో ఉండనుంది. దీని స్పెసిఫికేషన్లను కంపెనీ సెప్టెంబర్ 8వ తేదీన రివీల్ చేయనుంది. దీనికి ‘ఫుల్లీ లోడెడ్ ఎంటర్‌టైన్‌మెంట్’ అని ట్యాగ్‌ను కూడా ఇచ్చారు.

ఐకూ జెడ్6 లైట్ 5జీ మైక్రోసైట్ అమెజాన్‌లో కనిపించింది. సెప్టెంబర్ 14వ తేదీన ఈ ఫోన్ మార్కెట్లో లాంచ్ కానుంది. లాంచ్ తేదీ మినహా మిగతా వివరాలేవీ తెలియరాలేదు. డ్యూయల్ 5జీ ఎక్స్‌పీరియన్స్ అని ఐకూ తన మైక్రో సైట్‌లో పేర్కొంది. అంటే దీన్ని బట్టి రెండు సిమ్ స్లాట్‌ల్లోనూ 5జీ వేయవచ్చన్న మాట.

దీనికి సంబంధించిన రెండర్లను బట్టి చూస్తే ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. దీంతోపాటు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా ఉండనుంది. ముందువైపు వాటర్ డ్రాప్ తరహా నాచ్ ఉంది. సెల్ఫీ కెమెరాను అందులో అందించనున్నారు. ఈ ఫోన్ మనదేశంలో ఎంత ధరలో లాంచ్ అవుతుందో తెలియరాలేదు.

ఐకూ కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఇటీవలే చైనాలో లాంచ్ అయింది. అదే ఐకూ యూ5ఈ. ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,399 యువాన్లుగా (సుమారు రూ.16,000) నిర్ణయించారు. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,499 యువాన్లుగా (సుమారు రూ.18,000) ఉంది. 

ఇందులో 6.51 అంగుళాల ఎల్సీడీ స్క్రీన్‌ను అందించారు. ఆక్టాకోర్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4 ర్యామ్, 128 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.1 స్టోరేజ్ కూడా ఇందులో ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ 5జీని కూడా సపోర్ట్ చేయనుంది.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫ్లాష్ చార్జ్ టెక్నాలజీని ఇది సపోర్ట్ చేయనుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆరిజిన్ఓఎస్ ఓషన్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు.

ఇక కెమెరాల విషయానికి వస్తే... వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఈ ఫోన్ మందం 0.82 సెంటీమీటర్లు కాగా... బరువు 193 గ్రాములుగా ఉంది.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

టాప్ హెడ్ లైన్స్

Dharmendra Pradhan Resignation: విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
CSK-MI Trade War: హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dharmendra Pradhan Resignation: విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
విద్యార్థుల ఆందోళన తొలిరోజే రాజీనామాకు సిద్ధపడిన ధర్మేంద్ర ప్రధాన్, కానీ!: విజయ్‌ వర్గీయా
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
CSK-MI Trade War: హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ కు బ‌దులుగా MI మైండ్ బ్లాకింగ్ డిమాండ్.. ఆ ప్లేయ‌ర్ ను ఇవ్వలేమన్న CSK, ఐపీఎల్ 2027 ట్రేడ్ డీల్ లో ఊరించే ట్విస్ట్!
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - యాక్సిలరేషన్‌ టెస్ట్‌లో ఏ కారు గెలిచింది?
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - రియల్‌ రోడ్‌ టెస్ట్‌లో ఏ కారు పికప్‌ చూపించింది?
Chennai Love Story Collections: చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
చెన్నై లవ్ స్టోరీ రెండు రోజుల కలెక్షన్లు... టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Breaking News: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సర్జరీ.. వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడి
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు సర్జరీ.. వేగంగా కోలుకుంటున్నట్లు వెల్లడి
కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు
కాక్రోచ్ వ్యాఖ్యతో ప్రారంభం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ముగిసింది.. CJP Protest లో కీలక ఘట్టాలు
Embed widget