iPhone 12 Amazon Offer: ఐఫోన్ 12పై అమెజాన్‌లో బంపర్ ఆఫర్ - ఈ రేటు చూస్తే కొనకుండా ఉండలేరు!
ఐఫోన్ 12పై అమెజాన్‌లో బంపర్ ఆఫర్‌ను అందించనున్నారు. రూ.40 వేలలోపే దీన్ని కొనుగోలు చేయవచ్చు.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 23వ తేదీన ప్రారంభం కానుంది. ప్రైమ్ సభ్యులు మాత్రం సెప్టెంబర్ 22వ తేదీ నుంచి దీన్ని యాక్సెస్ చేయవచ్చు. ఈ సేల్‌కు ముందు యాపిల్ ఐఫోన్ 12పై ఉన్న డీల్‌ను అమెజాన్ రివీల్ చేసింది. ఐఫోన్ 12 ప్రస్తుతం మూడు స్టోరేజ్ వేరియంట్లు, నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
అమెజాన్ సేల్‌లో ఐఫోన్ 12 డీల్ ధర
ఐఫోన్ 12 స్మార్ట్ ఫోన్‌ను రూ.40 వేల కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం వినిపిస్తున్న వివరాల ప్రకారం రూ.36 వేల నుంచి రూ.40 వేల మధ్యలోనే దీని ధర ఉండనుంది. అయితే కార్డు ఆఫర్లను కూడా దీనిపై అందించనున్నారు. అంటే నిర్దేశించిన కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే మరింత తగ్గనుందన్న మాట.
ప్రస్తుతం అమెజాన్‌లో ఐఫోన్ 12 రూ.52,900 ధరలో అందుబాటులో ఉంది. ఇది బేస్ వేరియంట్ అయిన 64 జీబీ మోడల్ ధర. ఇక టాప్ ఎండ్ మోడల్ అయిన 256 జీబీ వేరియంట్ ధర రూ.64,900గా నిర్ణయించారు. 128 జీబీ మోడల్ ధర రూ.57,900గా ఉంది. బ్లాక్, గ్రీన్, పర్పుల్, రెడ్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. 2020లో ఐఫోన్ 12 సిరీస్ రూ.79,900 ధరతో లాంచ్ అయింది. లాంచ్ అయినప్పుడు 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.84,900గానూ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.94,900గానూ ఉంది.
ఐఫోన్ 12 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఐఫోన్ 12లో యాపిల్ ఏ14 బయోనిక్ చిప్ అందించారు. ఇందులో సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. యాపిల్ సెరామిక్ షీల్డ్ గ్లాస్‌ను ఇందులో అందించారు. ఐఫోన్ 12లో 6.1 అంగుళాల స్క్రీన్‌ను అందించారు. వీటిలో చార్జర్ రాదు. మీరు ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇందులో వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 12 మెగాపిక్సెల్ కాగా.. దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఇందులో ఉన్నాయి.
ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఐఫోన్ 13పై భారీ ఆఫర్‌ను అందించనున్నారు. ఈ సేల్‌లో ఐఫోన్ 13 ఫోన్‌ను రూ.49,990కే విక్రయిస్తున్నారు. బ్యాంక్, క్రెడిట్ కార్డు ఆఫర్లు వాడితే దీని రేటు మరింత తగ్గే అవకాశం ఉంది. ఐఫోన్ 13పైనే ఇంత తగ్గింపు ఉంది కాబట్టి ఐఫోన్ 13 మినీ ధర మరింత తగ్గే అవకావం ఉంది.
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఆఫర్ సేల్ సెప్టెంబర్ 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు జరగనుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ వినియోగదారులకు మాత్రం సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ఈ సేల్‌కు యాక్సెస్ లభించనుంది. ఐఫోన్ 13 ప్రో ధర రూ.89,990 నుంచి, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ధర రూ.99,990 నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఐఫోన్ 13 ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.69,990గా ఉంది. ఐఫోన్ 13 ప్రో ధర రూ.1,19,900గానూ, ఐఫోన్ 13 మినీ ధర రూ.1,26,000గానూ ఉంది.
Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?
Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?