అన్వేషించండి

Apple Event: యాపిల్ ఫార్అవుట్ ఈవెంట్ నేడే - ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ - లైవ్ ఎలా చూడాలి?

ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లను యాపిల్ నేడు లాంచ్ చేయనుంది. నేడు జరగనున్న యాపిల్ ఫార్ అవుట్ ఈవెంట్లో ఇవి లాంచ్ కానున్నాయి.

యాపిల్ ఫార్ అవుట్ ఈవెంట్ నేడు (సెప్టెంబర్ 7వ తేదీ) జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఈ ఈవెంట్లో లాంచ్ కానున్నాయి.

లైవ్ స్ట్రీమింగ్ చూడటం ఎలా?
సెప్టెంబర్ 7వ తేదీన భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ప్రారంభం అయ్యే ఈవెంట్‌ను యాపిల్ యూట్యూబ్ చానెల్లో లైవ్ చూడవచ్చు. యాపిల్ టీవీ యాప్ ద్వారా కూడా ఈ కార్యక్రమాన్ని లైవ్ స్ట్రీమ్ చేయవచ్చు.

ఏమేం లాంచ్ కానున్నాయి?
ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లు ఈ ఈవెంట్లో లాంచ్ కానున్నాయి. వీటితో పాటు యాపిల్ వాచ్ సిరీస్ 8, వాచ్ ప్రో కూడా ఈ సిరీస్‌లో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. యాపిల్ ఎయిర్‌పోడ్స్ ప్రో 2ను కూడా కంపెనీ తీసుకురానుంది.

ఐఫోన్ 14 సిరీస్ స్మార్ట్ ఫోన్ల ధర కూడా ఇటీవలే ఆన్‌లైన్‌లో లీకైంది. ఈ కథనాల ప్రకారం... సిరీస్ ధర 749 డాలర్ల (సుమారు రూ.60,000) నుంచి ప్రారంభం కానుందని వార్తలు వస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే మనదేశంలో దాదాపు రూ.75 వేల నుంచి రూ.80 వేల మధ్య నుంచి ఐఫోన్ 14 సిరీస్ ధర ప్రారంభం కానుంది.

ట్రెండ్ ఫోర్స్ అనే వెబ్ సైట్ కథనం ప్రకారం... ఐఫోన్ 14 ధర 749 డాలర్ల (సుమారు రూ.60,000), ఐఫోన్ మ్యాక్స్ ధర 849 డాలర్ల (సుమారు రూ.68,000), ఐఫోన్ 14 ప్రో ధర 1,049 డాలర్ల (సుమారు రూ.83,000), ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ధర 1,149 డాలర్ల (సుమారు రూ.91,000) నుంచి ప్రారంభం కానుంది.

ఐఫోన్ 14 మ్యాక్స్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (అంచనా)
లీకైన వివరాల ప్రకారం... ఐఫోన్ 14 మ్యాక్స్ స్మార్ట్ ఫోన్‌లో 6.68 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీ డిస్‌ప్లే అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా... పిక్సెల్ డెన్సిటీ 458 పిక్సెల్స్ పర్ ఇంచ్‌గా ఉండనుంది. 6 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్ ఇందులో అందుబాటులో ఉండనుంది.

యాపిల్ లేటెస్ట్ ప్రాసెసర్ ఏ15 బయోనిక్ చిప్‌ను ఐఫోన్ 14 మ్యాక్స్‌లో అందించే అవకాశం ఉంది. ఐఫోన్ 13 సిరీస్, ఐఫోన్ ఎస్ఈ (2022) స్మార్ట్ ఫోన్లలో కూడా ఇదే ప్రాసెసర్‌ను కంపెనీ అందించింది. అయితే యాపిల్ ప్రస్తుతం కొత్త ఏ16 బయోనిక్ ప్రాసెసర్‌ను రూపొందించనుందని అవి ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌ల్లో ఉండనున్నాయని గతంలో వార్తలు వచ్చాయి. ఏ ప్రాసెసర్ ఉండనుందో తెలియాలంటే మాత్రం సెప్టెంబర్ వరకు ఆగాల్సిందే.

ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు రెండు కెమెరాలు అందించనున్నట్లు తెలుస్తోంది. వీటి సామర్థ్యం 12 మెగాపిక్సెల్‌గా ఉండే అవకాశం ఉంది. 512 జీబీ, 1 టీబీ స్టోరేజ్ వేరియంట్లు ఇందులో ఉండే అవకాశం ఉంది. ఇందులో నాచ్, ఫేస్ ఐడీ రికగ్నిషన్ వంటి ఫీచర్లు కూడా ఉండనున్నాయి.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

టాప్ హెడ్ లైన్స్

ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
How To Recover Deleted WhatsApp Messages: వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందడం ఎలా? బ్యాకప్‌ లేకపోయినా రికవరీ చేసే సీక్రెట్‌ ట్రిక్స్!
వాట్సాప్‌లో డిలీట్ చేసిన మెసేజ్‌లను తిరిగి పొందడం ఎలా? బ్యాకప్‌ లేకపోయినా రికవరీ చేసే సీక్రెట్‌ ట్రిక్స్!
How To Free Up Storage On Android Phones: ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్ అయ్యిందా?థర్డ్ పార్టీ యాప్‌ అవసరం లేకుండానే స్పేస్‌ను ఖాళీ చేసే సీక్రెట్‌ టిప్స్‌!
ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్ అయ్యిందా?థర్డ్ పార్టీ యాప్‌ అవసరం లేకుండానే స్పేస్‌ను ఖాళీ చేసే సీక్రెట్‌ టిప్స్‌!
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Embed widget