Jio Best Plan: ఈ జియో ప్లాన్‌తో 6 జీబీ డేటా ఫ్రీ - బోలెడన్నీ ఓటీటీ యాప్స్ సబ్‌స్క్రిప్షన్ కూడా!
Jio Rs 398 Plan: జియో రూ.398 ప్లాన్ ద్వారా మంచి లాభాలను అందించనుంది.
Jio New Plan: భారతదేశ నంబర్ వన్ టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో ప్రస్తుతం ఒక మంచి ప్రీపెయిడ్ ప్లాన్ అందిస్తుంది. ఈ ప్లాన్‌తో ఎక్స్‌ట్రా డేటా, ఓటీటీ యాప్స్‌కు యాక్సెస్ కూడా లభించనుంది. అన్‌లిమిటెడ్ 5జీ డేటాను కూడా ఈ ప్లాన్ ద్వారా అందించనున్నారు. అదే రిలయన్స్ జియో రూ.398 ప్లాన్. దీని వ్యాలిడిటీ పీరియడ్ తక్కువే. కానీ బెనిఫిట్స్ మాత్రం చాలా ఎక్కువ.
రిలయన్స్ జియో రూ.398 ప్లాన్ లాభాలు
ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే. రోజుకు 2 జీబీ డేటాను అందించనున్నారు. అంటే 28 రోజుల్లో మొత్తంగా 56 జీబీ లభిస్తుందన్న మాట. అంతే కాకుండా అదనంగా 6 జీబీ డేటా కూడా లభించనుంది. దీన్ని వోచర్ల కేటగిరిలో నుంచి యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ డేటా వోచర్ విలువ రూ.61. కానీ ఈ రూ.398 ప్లాన్‌తో ఫ్రీగా లభించనుందన్న మాట.
అన్‌లిమిటెడ్ 5జీ డేటా కూడా ఈ ప్లాన్‌తో లభించనుంది. అంటే ఒక వేళ మీరు 5జీ కవరేజ్ లభించే ప్రాంతంలో ఉండి, మీది 5జీ ఫోన్ అయితే అన్‌లిమిటెడ్ 5జీ డేటాను ఎంజాయ్ చేయవచ్చన్న మాట. ఈ ప్లాన్‌తో ఓటీటీ బెనిఫిట్స్ కూడా లభించనున్నాయి. సోనీలివ్, జీ5, జియో సినిమా ప్రీమియం, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సన్‌నెక్స్ట్, కంచా లన్కా, ప్లానెట్ మరాఠీ, చౌపల్, డాక్యుబే, ఎపిక్ ఆన్, హొయ్‌చొయ్, జియో టీవీ, జియో క్లౌడ్ యాక్సెస్ కూడా అందించనున్నారు.
Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?