(Source: ECI/ABP News/ABP Majha)
Apple Event 2022: అత్యంత చవకైన యాపిల్ ఫోన్ వచ్చేస్తుంది - 5జీ కూడా - మార్చి 8న ముహూర్తం ఫిక్స్!
యాపిల్ తన చవకైన 5జీ స్మార్ట్ ఫోన్‌ను మార్చి 8వ తేదీన లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
Apple Event: యాపిల్ మార్చి 8వ తేదీన నిర్వహించే ఈవెంట్లో కొత్త ఐఫోన్ ఎస్ఈ 3 (iPhone SE 3), ఐప్యాడ్ ఎయిర్‌ను (iPad Air) లాంచ్ చేయడం దాదాపు పక్కా అయిపోయింది. ఈ రెండిటి లాంచ్‌కు సంబంధించిన సమాచారాన్ని యాపిల్ ఒక ఆసియన్ క్యారియర్‌కు అందించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రముఖ టిప్‌స్టర్ ఎవాన్ బ్లాస్ తెలిపారు. సాధారణంగా మొబైల్ తయారీ కంపెనీ తాము లాంచ్ చేయబోయే స్మార్ట్ ఫోన్ల గురించిన సమాచారాన్ని క్యారియర్లకు అందిస్తాయి.
ఈ కార్యక్రమానికి సంబంధించిన మీడియా ఇన్వైట్లను కూడా యాపిల్ పంపిస్తుంది. ఇందులో కొత్త మ్యాక్‌బుక్ ప్రో (Macbook Pro), మ్యాక్‌బుక్ ఎయిర్ (Macbook Air), మ్యాక్ మినీ (Mac Mini), ఐమ్యాక్ ప్రో (iMac Pro) లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ ఎస్ఈ 3 లేదా ఐఫోన్ ఎస్ఈ+ 5జీ (iPhone SE+ 5G) లేదా ఐఫోన్ ఎస్ఈ 5జీ కూడా ఈరోజే లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది.
యాపిల్ (Apple) ఈ సంవత్సరం నిర్వహించనున్న మొదటి పబ్లిక్ ఈవెంట్ ఇదే. మార్చి 8వ తేదీ ఉదయం 10 గంటలకు (భారత కాలమానం ప్రకారం రాత్రి 11:30 గంటలకు) ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది. కంపెనీ వెబ్‌సైట్, యాపిల్ టీవీ యాప్‌లో దీన్ని లైవ్ స్ట్రీమ్ చేయవచ్చు. యాపిల్ అధికారిక యూట్యూబ్ చానెల్లో కూడా దీన్ని స్ట్రీమ్ చేయవచ్చు.
యాపిల్ ఈవెంట్ అనౌన్స్‌మెంట్లు (అంచనా)
గతంలో లాంచ్ కానున్న మ్యాక్‌బుక్ ఎయిర్ కంటే ఇప్పుడు లాంచ్ కానున్న మ్యాక్‌బుక్ ఎయిర్ డిజైన్ చాలా కొత్తగా ఉండనుందని తెలుస్తోంది. గతేడాది లాంచ్ అయిన మ్యాక్‌బుక్ ప్రో తరహాలో దీని డిజైన్ ఉండనుందని సమాచారం. మినీ ఎల్ఈడీ డిస్‌ప్లేలతో కలర్ ఫుల్‌గా ఈ మ్యాక్‌బుక్ ఎయిర్ లాంచ్ కానుందని తెలుస్తోంది.
దీంతోపాటు కొత్త ఐఫోన్ ఎస్ఈ లాంచ్ కానుంది. దీనికి ఐఫోన్ ఎస్ఈ (2022) లేదా ఐఫోన్ ఎస్ఈ 5జీ, లేదా ఐఫోన్ ఎస్ఈ+ 5జీ అని పేరు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ ఎస్ఈ (2020) తరహాలో దీని డిజైన్ ఉండనుంది. కానీ ఇందులో 5జీ సపోర్ట్ అందించనున్నారు. దీంతోపాటు ఏ15 బయోనిక్ ప్రాసెసర్ కూడా అందించే అవకాశం ఉంది. దీని కెమెరాలు కూడా మెరుగయ్యే అవకాశం ఉంది. దీని ధర 300 డాలర్ల (సుమారు రూ.22,700) రేంజ్‌లో ఉండనుందని వార్తలు వస్తున్నాయి.
ఐప్యాడ్ ఎయిర్‌ను కూడా యాపిల్ అప్‌గ్రేడ్ చేయనుందని తెలుస్తోంది. ఇప్పుడు రానున్న ఐప్యాడ్ ఎయిర్ (ఐదో తరం)లో ఏ15 బయోనిక్ ప్రాసెసర్, 5జీ కనెక్టివిటీ ఉండనుందని తెలుస్తోంది.
Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!