అన్వేషించండి

Infinix Smart 8 Plus: రూ.7 వేలలోపే 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఫోన్ - ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్ వచ్చేసింది!

Infinix New Phone: ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్ స్మార్ట్ ఫోన్ భారతదేశంలో లాంచ్ అయింది. దీన్ని రూ.6,999కే కొనుగోలు చేయవచ్చు.

Infinix New Smartphone: ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్ మొబైల్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్‌ను అందించారు. భారీ బ్యాటరీ కూడా ఉంది. ఏఐ ఆధారిత డ్యూయల్ కెమెరా సెటప్‌ను వెనకవైపు అందించారు. మ్యాజిక్ రింగ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. అంటే యాపిల్ డైనమిక్ ఐల్యాండ్ తరహా ఫీచర్ అన్నమాట. ఆండ్రాయిడ్ 13 ఆధారిత గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 సిరీస్‌లో ఇప్పటికే రెండు ఫోన్లు లాంచ్ అయ్యాయి. ఇది మూడో ఫోన్.

ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్ ధర
ఈ ఫోన్‌లో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.7,999గా నిర్ణయించారు. కానీ బ్యాంకు ఆఫర్ల ద్వారా రూ.6,999కే కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన సేల్ మార్చి 9వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కానుంది.

ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఇందులో 6.6 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గా ఉంది. 12 ఎన్ఎం మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 4 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ర్యామ్‌ను వర్చువల్‌గా మరో 4 జీబీ వరకు పెంచుకోవచ్చు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎక్స్ఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టంపై ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్ రన్ కానుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు ఏఐ ఆధారిత సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. యాపిల్ డైనమిక్ ఐల్యాండ్ తరహాలో ఉండే ఇన్‌ఫీనిక్స్ మ్యాజిక్ రింగ్ ఫీచర్ అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ కాగా, 18W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, గ్లోనాస్, యూఎస్‌బీ టైప్-సీ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. దీని మందం 0.85 సెంటీమీటర్లు కాగా బరువు 189 గ్రాములుగా ఉంది.

ఇన్‌ఫీనిక్స్ హాట్ 40ఐ స్మార్ట్ ఫోన్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. కొన్ని నెలల క్రితం ఈ ఫోన్ సౌదీ అరేబియా మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. ఆక్టాకోర్ యూనిసోక్ ప్రాసెసర్‌పై ఇన్‌ఫీనిక్స్ హాట్ 40ఐ పని చేయనుంది. దీని వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. ఇవి ఏఐని సపోర్ట్ చేయడం విశేషం. ఫోన్ ముందువైపు 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు. నాలుగు కలర్ ఆప్షన్లలో ఇన్‌ఫీనిక్స్ హాట్ 40ఐని కొనుగోలు చేయవచ్చు.

Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?

Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IT Rules 2021 Amendments:డిజిటల్ మీడియాపై పట్టుకు కేంద్రం ప్రయత్నిస్తోందా? కొత్తగా తీసుకొస్తున్న మార్పులేంటీ?
డిజిటల్ మీడియాపై పట్టుకు కేంద్రం ప్రయత్నిస్తోందా? కొత్తగా తీసుకొస్తున్న మార్పులేంటీ?
మీ iPhone అసలైనదా లేక నకిలీదా? IMEI నంబర్ సహా ఈ పద్ధతుల్లో గుర్తించండి
మీ iPhone అసలైనదా లేక నకిలీదా? IMEI నంబర్ సహా ఈ పద్ధతుల్లో గుర్తించండి
Agent Smith: గూగుల్ ఏజెంట్ స్మిత్ - ఏఐలో ఇది మరో రేంజ్ - ఇవిగో పూర్తి వివరాలు
గూగుల్ ఏజెంట్ స్మిత్ - ఏఐలో ఇది మరో రేంజ్ - ఇవిగో పూర్తి వివరాలు
X Down: ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్
ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ "ఎక్స్" డౌన్! వినియోగదారులు అసహనం!

వీడియోలు

CSK Plays Without Dhoni in 17 Years IPL 2026 | ధోనీ, రైనా, జడేజా లేకుండా CSK మ్యాచ్ | ABP Desam
Jadeja Destroys CSK vs RR IPL 2026 | ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన జడేజా | ABP Desam
IPL 2026 RR VS CSK Highlights | చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ | ABP Desam
Vaibhav Suryavanshi RR vs CSK IPL 2026 | వైభవ్ కు సలహా ఇచ్చిన జైస్వాల్ | ABP Desam
Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Anirudh Reddy: డ్రగ్స్‌ ఆరోపణల్లో కొత్త ట్విస్ట్... అనిరుధ్ రెడ్డికి రాహుల్ రామకృష్ణ ఛాలెంజ్, విష్ణు మంచు కూడా!
డ్రగ్స్‌ ఆరోపణల్లో కొత్త ట్విస్ట్... అనిరుధ్ రెడ్డికి రాహుల్ రామకృష్ణ ఛాలెంజ్, విష్ణు మంచు కూడా!
Polavaram Project: ఏపీకి గుడ్‌న్యూస్.. పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.1,301 కోట్ల నిధులు విడుదల, రైతులకు ప్రయోజనం
ఏపీకి గుడ్‌న్యూస్.. పోలవరం ప్రాజెక్టుకు మరో రూ.1,301 కోట్ల నిధులు విడుదల, రైతులకు ప్రయోజనం
LPG Cylinder Price Hike: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే..
భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ల ధరలు.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే..
Karimnagar Jeevan Reddy: బీఆర్ఎస్‌లో కేకే పదవి జీవన్ రెడ్డికి - కోడలికి టిక్కెట్ కూడా - సీనియర్‌కు తగ్గ డీలేనా?
బీఆర్ఎస్‌లో కేకే పదవి జీవన్ రెడ్డికి - కోడలికి టిక్కెట్ కూడా - సీనియర్‌కు తగ్గ డీలేనా?
Rules From 1 April 2026: ఏటీఎం విత్‌డ్రాల నుంచి ITR ఫైలింగ్ వరకు నేటి నుంచి అమల్లోకి 5 కొత్త రూల్స్
ఏటీఎం విత్‌డ్రాల నుంచి ITR ఫైలింగ్ వరకు నేటి నుంచి అమల్లోకి 5 కొత్త రూల్స్
NTR Vaidya Seva: ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
Property Rights: భార్య పుట్టింటి ఆస్తిపై భర్తకు ఏ హక్కు ఉండదు: ఏపీ హైకోర్టు
భార్య పుట్టింటి ఆస్తిపై భర్తకు ఏ హక్కు ఉండదు: ఏపీ హైకోర్టు
YSRCP Supports Amaravati Bill: అమరావతి బిల్లుకు వైసీపీ వ్యతిరేకం కాదు.. ఎంపీ మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
అమరావతి బిల్లుకు వైసీపీ వ్యతిరేకం కాదు.. ఎంపీ మిథున్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Embed widget