అన్వేషించండి

Infinix Hot 40i Sale: ఇన్‌ఫీనిక్స్ హాట్ 40ఐ సేల్ ప్రారంభం - 256 జీబీ స్టోరేజ్, 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ రూ.10 వేలలోపే!

Infinix Hot 40i: ఇన్‌ఫీనిక్స్ హాట్ 40ఐ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం అయింది.

Infinix Hot 40i Flipkart Sale: ఇన్‌ఫీనిక్స్ హాట్ 40ఐ స్మార్ట్ ఫోన్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన సేల్ ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం అయింది. ఈ ఫోన్‌లో 8 జీబీ వరకు ర్యామ్ అందుబాటులో ఉంది. 256 జీబీ వరకు స్టోరేజ్ కూడా అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది.

ఇన్‌ఫీనిక్స్ హాట్ 40ఐ ధర (Infinix Hot 40i Price in India)
ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,999గా ఉంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.9,999గా నిర్ణయించారు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. హారిజన్ గోల్డ్, పామ్ బ్లూ, స్టార్‌లిట్ బ్లాక్, స్టార్‌ఫాల్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఇన్‌ఫీనిక్స్ హాట్ 40ఐని కొనుగోలు చేయవచ్చు.

ఇన్‌ఫీనిక్స్ హాట్ 40ఐ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Infinix Hot 40i Specifications)
ఇన్‌ఫీనిక్స్ హాట్ 40ఐలో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్‌ను అందించారు. ఈ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, పీక్ బ్రైట్‌నెస్ 480 నిట్స్‌గానూ, స్క్రీన్ టు బాడీ రేషియో 89.7 శాతంగానూ ఉంది. ఆక్టాకోర్ యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌పై ఇన్‌ఫీనిక్స్ హాట్ 40ఐ రన్ కానుంది. 8 జీబీ వరకు ర్యామ్ ఉంది. ర్యామ్‌ను వర్చువల్‌గా 16 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఎక్స్ఓఎస్ 13.0 ఆపరేటింగ్ సిస్టంపై ఇన్‌ఫీనిక్స్ హాట్ 40ఐ పని చేయనుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు ఏఐ ఆధారిత సెన్సార్ కూడా చూడవచ్చు. క్వాడ్ ఎల్ఈడీ రింగ్ ఫ్లాష్ అందించడం విశేషం. ముందువైపు సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది.

యాపిల్ డైనమిక్ ఐల్యాండ్ తరహాలో మ్యాజిక్ రింగ్ ఫీచర్‌ను ఇందులో అందించారు. ఇన్‌ఫీనిక్స్ హాట్ 40ఐ బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 18W వైర్డ్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది. 256 జీబీ వరకు స్టోరేజ్ అందుబాటులో ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. వైఫై, బ్లూటూత్ వీ5.0, యూఎస్‌బీ టైప్-సీ, జీపీఎస్, ఎఫ్ఎం, ఎన్ఎఫ్‌సీ కనెక్టివిటీ వంటి ఫీచర్లను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. ఈ ఫోన్ మందం 0.83 సెంటీమీటర్లు కాగా, బరువు 190 గ్రాములుగా ఉంది.

ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్రో స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ ఇటీవలే అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్‌ వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరా అందించారు. 6.6 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్‌ను కూడా ఈ ఫోన్‌లో ఉంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, పీక్ బ్రైట్‌నెస్ 500 నిట్స్‌గా ఉండటం విశేషం. మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్‌పై ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్రో పని చేయనుంది.

Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?

Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: రాష్ట్రంలో అనర్హులకు పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
రాష్ట్రంలో అనర్హులకు పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
Manchu Family Issue : మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
Chiranjeevi Rajyasabha:  రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

మోదీ పాటలు వింటారా? ప్రధాని నుంచి ఊహించని రిప్లైసీపీ ముందు విష్ణు, మనోజ్ - ఇదే లాస్ట్ వార్నింగ్!Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desamగూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: రాష్ట్రంలో అనర్హులకు పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
రాష్ట్రంలో అనర్హులకు పింఛన్లు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు, ఉపాధి బిల్లుల జాప్యంపై తీవ్ర ఆగ్రహం
Manchu Family Issue : మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
మంచు ఫ్యామిలీలో మొత్తం సెటిలైపోయినట్లే - షూటింగ్‌కు మనోజ్ - ప్రెస్‌మీట్ క్యాన్సిల్ దగ్గర నుంచి ఏం జరిగింది ?
Chattisgarh Encounter: దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
దండకారణ్యంలో కాల్పుల మోత - భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, 12 మంది మావోల దుర్మరణం
Chiranjeevi Rajyasabha:  రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
రాజ్యసభకు చిరంజీవి - ఏ పార్టీలోనూ చేరకుండానే - బీజేపీ ప్లాన్‌కు పవన్ గ్రీన్ సిగ్నల్ ?
Manchu Mohan Babu Attack News: మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
Avanthi Srinivas Resign To YSRCP: వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా
Sai Pallavi: సీత పాత్ర కోసం నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? - లీగల్‌గా ఆన్సర్ ఇస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్
సీత పాత్ర కోసం నాన్ వెజ్ మానేసిన సాయి పల్లవి? - లీగల్‌గా ఆన్సర్ ఇస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్
PF Withdraw: ATM నుంచి పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా! - ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌
ATM నుంచి పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా! - ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌
Embed widget