OTT Subscription Auto Renew Off: నెట్‌ఫ్లిక్స్, డిస్నీప్లస్ హాట్‌స్టార్ లాంటి యాప్స్ ఆటో రెన్యూ ఆఫ్ చేయడం ఎలా?
OTT Subscription Cancellation: నెట్‌ఫ్లిక్స్, డిస్నీప్లస్ లాంటి ఓటీటీ యాప్స్‌లో ఆటో రెన్యూ ఆప్షన్ ఆన్‌లో ఉంటుంది. కానీ దాన్ని ఆఫ్ చేసుకుంటే మంచిదని చెప్పుకోవచ్చు.
Netflix Hotstar Subscription: మీరు ఎంటర్‌టైన్‌మెంట్ లవర్స్ అయితే మీరు తప్పనిసరిగా నెట్‌ఫ్లిక్స్, డిస్నీ హాట్‌స్టార్‌లకు సబ్‌స్క్రయిబ్ చేసి ఉండాలి. కానీ కొన్నిసార్లు సమయం లేకపోవడం వల్ల మీరు దీన్ని ఎక్కువగా ఉపయోగించకపోవచ్చు. కానీ వాడినా, వాడకపోయినా ఖాతా నుంచి డబ్బు కట్ అవుతూ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృథా అవుతుంది. మీ మెంబర్‌షిప్ ఆటో రెన్యూ మోడ్‌లో ఉన్నప్పుడు ఇది జరుగుతుంది. కానీ ఇప్పుడు దానిని నియంత్రించడం చాలా సులభం. దీని కోసం మీరు మీ సభ్యత్వాన్ని మాన్యువల్‌గా క్యాన్సిల్ చేయాలి.
మీరు మీ నెట్‌ఫ్లిక్స్, డిస్నీ హాట్‌స్టార్ ఖాతాలో ఆటో పేమెంట్ కట్ ఆప్షన్‌ను ఎంచుకోకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ అంతట మీరే చెల్లింపు చేస్తే తప్ప మీ ఖాతా నుంచి డబ్బు కట్ అవదు.
ఆటో రెన్యూ ఆప్షన్‌ను ఎలా ఆఫ్ చేయాలి?
ముందుగా నెట్‌ఫ్లిక్స్, డిస్నీ హాట్‌స్టార్‌ల్లో మొబైల్ యాప్ లేదా వెబ్ సైట్‌ల్లో లాగిన్ అవ్వండి.
ఇక్కడ ప్రొఫైల్‌కి వెళ్లి సబ్‌స్క్రిప్షన్ లేదా అకౌంట్ ఆప్షన్‌ని ఎంచుకోండి.
ఆపై ఆటో రెన్యూ ఆప్షన్‌ను ఆఫ్ చేయండి.
తద్వారా మీ మెంబర్‌షిప్ మరోసారి రెన్యూ అవ్వదు. మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవ్వవు.
Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
మెంబర్‌షిప్‌ను ఎలా క్యాన్సిల్ చేయాలి?
ముందుగా మీ ఖాతాకు లాగిన్ అయి ఆపై మేనేజ్ సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్‌కు వెళ్లండి.
ఇక్కడ క్యాన్సిల్ సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
బ్యాంక్ అలర్ట్స్‌ను సెటప్ చేయండి
మీరు మీ బ్యాంక్ ఖాతాలో అలర్ట్స్‌ను కూడా సెట్ చేయవచ్చు. అనుకోకుండా అకౌంట్ నుంచి డబ్బు కట్ అయినట్లయితే వెంటనే చర్యలు తీసుకోవడానికి ఇది మీకు సహాయం చేస్తుంది.
మీ డెబిట్/క్రెడిట్ కార్డ్ వివరాలను ఎవరికీ షేర్ చేయకండి. మీరు సబ్‌స్క్రిప్షన్ నుంచి డెబిట్/క్రెడిట్ కార్డ్ సమాచారాన్ని తీసివేయవచ్చు. ఇది సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలను నివారించడానికి మీకు సహాయం చేస్తుంది. మీ పర్మిషన్ లేకుండా డబ్బు కట్ అవ్వదు.
Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?
In the wake of a devastating cyber attack, a former President (Robert De Niro) is tasked with finding the perpetrators and seeking truth when another attack is imminent — but is the true threat a foreign power, or from within?
— Netflix (@netflix) December 23, 2024
The new limited series ZERO DAY premieres February… pic.twitter.com/B0Z79Lb2DC
Yeh kahani shuru hui thi ishq se, kya khatam hogi inteqaam pe?
— Disney+ Hotstar (@DisneyPlusHS) November 21, 2024
Hotstar Specials: Thukra Ke Mera Pyaar is now streaming #TKMPonHotstar pic.twitter.com/MAjimut9Uj