అన్వేషించండి

APPs Removed: ప్లే స్టోర్ నుంచి సగం యాప్ లు తొలగింపు, కానీ వినియోగదారులకు గుడ్ న్యూస్

Google digital cleanup | గూగుల్ ప్లే స్టోర్ నుంచి ప్రమాదకరమైన, హానికరమైన యాప్స్ ను తొలగించింది. దాంతో వినియోగదారులకు ఏ సమస్య ఉండదని స్పష్టం చేసింది.

Apps Removed From Play store: ఇటీవల గూగుల్ ప్లే స్టోర్‌లోని యాప్‌ల సంఖ్యను గమనిస్తే.. గతంలో కంటే తక్కువ యాప్‌లు కనిపిస్తుంటాయి. ఎందుకంటే గూగుల్ డిజిటల్ క్లీనప్ ప్రోగ్రాం చేపట్టింది. వినియోగదారులకు అవసరమైన, ఎలాంటి హానికరం కాని యాప్ లను ప్లే స్టోర్ నుంచి తొలగించలేదు. వాస్తవానికి 2024 ప్రారంభంలో ప్లే స్టోర్‌లో దాదాపు 34 లక్షల యాప్‌లు ఉన్నాయి, కానీ ఇప్పుడు యాప్‌ల దాదాపు 18 లక్షలకు తగ్గింది. అంటే సగం కంటే ఎక్కువ యాప్‌లు ప్లే స్టోర్స్ ఇప్పుడు అందుబాటులో లేవు. ఇది వినడానికి విచిత్రంగా, ఏదో తప్పిదం ద్వారా యాప్ తొలగించారని అనిపిస్తుంది కానీ, నిజానికి ఇది వినియోగదారులకు గుడ్ న్యూస్.

ఎందుకు అనేది ఇక్కడ తెలుసుకుందాం:

1. గూగుల్ వేస్ట్ యాప్‌లను ఉపేక్షించదు 
గతంలో ఏది పడితే ఆ యాప్‌లను ప్లే స్టోర్‌లో ఎవరైనా అప్‌లోడ్ చేసేవారు. ఒకే వాల్‌పేపర్ యాప్, కేవలం టెక్స్ట్ చూపించే యాప్ యాప్ లాంటివి సైతం ప్లే స్టోర్ లో పెట్టేవారు. తరువాత జూలై 2024లో గూగుల్ ఇలాంటి యాప్‌లపై, చైనా యాప్ లపై సైతం నిషేధం విధించింది. అప్పటినుంచి ఏ యాప్ పనికిరాదో దాన్ని ప్లే స్టోర్ నుంచి రిమూవ్ చేస్తున్నారు. మీరు అనవసరమైన లేదా నకిలీ యాప్‌ల నుండి సేఫ్ అని అర్థవుతుంది.

2. వినియోగదారుల భద్రతకు అధిక ప్రాధాన్యం
గూగుల్ అనవసర యాప్‌లను మాత్రమే తొలగించలేదు, మీ డేటాను చోరీ చేసే లేదా మీ ఫోన్‌ కండీషన్ దెబ్బతీసే యాప్‌లను కూడా రిమూవ్ చేసింది. హిందూస్తాన్ టైమ్స్ నివేదిక ప్రకారం 2.36 మిలియన్ (అంటే 23 లక్షల 6 వేలకు పైగా) ప్రమాదకర యాప్‌లను గుర్తించి ముందే బ్లాక్ చేశారు. అయితే 1.58 లక్షలకు పైగా చీటింగ్ డెవలపర్లను నిషేధించారు. గూగుల్ నార్మల్,  AI రెండింటితోనూ యాప్‌లను చెక్ చేయడం ప్రారంభించింది. ఇప్పుడు మీరు ఏ యాప్‌ను డౌన్‌లోడ్ చేసినా, దాని వల్ల మీకు అతి తక్కువ సమస్య తలెత్తే అవకాశం ఉంది. 

 3. కొత్త నిబంధనల వల్ల అనేక డెవలపర్లు స్వయంగా తొలగించుకున్నారు
2024లో యూరప్‌లో ఒక కొత్త నిబంధన అమలోకి వచ్చింది, దీనిలో ప్రతి యాప్ మేకర్ తన నిజమైన గుర్తింపును (పేరు, చిరునామా) పూర్తి వివరాలను తప్పకుండా తెలియజేయాలి. అలా చేయకూడదనుకున్న డెవలపర్లు తమ యాప్‌లను స్వయంగా రిమూవ్ చేసుకున్నారు. ఆపిల్‌లో ఈ నిబంధన అమలులోకి వచ్చింది, కానీ అక్కడ యాప్‌ల సంఖ్యపై ప్రభావం చూపలేదు ఎందుకంటే అక్కడ యాప్‌లకు సంబంధించి కఠినమైన నియమాలు ఉన్నాయి.

ఈ చర్యల వల్ల ఫలితం ఏమిటి?

 ఇప్పుడు ప్లే స్టోర్‌లో నిజంగా పనిచేసే, సురక్షితమైన, పారదర్శకమైన యాప్‌లు మాత్రమే ఉంటాయని గూగుల్ స్పష్టం చేసింది. కాబట్టి, ప్లే స్టోర్ నుంచి సగం యాప్‌లు తొలగించినా, మిగిలిన యాప్ లు దాదాపు సురక్షితమైనవగా భావించవచ్చు. డేటా చోరీ చేసే, యూజర్ల ప్రైవసీ దెబ్బతీయడం లాంటి యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తొలగించారు. గూగుల్ డిజిల్ క్లీనప్ ద్వార ప్లే స్టోర్ యాప్స్ సురక్షితమైనవని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Google Account Security: మీ Google అకౌంట్ సేఫ్‌గా ఉండాలంటే? ఈ 5 సెట్టింగ్‌లను ఇప్పుడే మార్చండి!
మీ Google అకౌంట్ సేఫ్‌గా ఉండాలంటే? ఈ 5 సెట్టింగ్‌లను ఇప్పుడే మార్చండి!
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
Apple iPhone 17 Pro Offer: ఐఫోన్ 17 ప్రోపై భారీ ఆఫర్.. రూ. 69,990కే మీ సొంతం!
ఐఫోన్ 17 ప్రోపై భారీ ఆఫర్.. రూ. 69,990కే మీ సొంతం!
1980s Retro Photos Trend: 1980 రెట్రో ఫొటో ట్రెండ్‌‌తో నిలువునా ముంచేస్తారు జాగ్రత్త.. సైబర్ బ్యూరో వార్నింగ్
1980 రెట్రో ఫొటో ట్రెండ్‌‌తో నిలువునా ముంచేస్తారు జాగ్రత్త.. సైబర్ బ్యూరో వార్నింగ్

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dhiraj Bommadevara Wins Gold: స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
Gannavaram News: గన్నవరం సీఐ లంచాల సంపాదన రూ.20 కోట్లు! టీడీపీ కార్యకర్త సంచలన ఆరోపణలు
గన్నవరం సీఐ లంచాల సంపాదన రూ.20 కోట్లు! టీడీపీ కార్యకర్త సంచలన ఆరోపణలు
Telangana Assembly Protest Case: పండుగ పూట కావాలనే ఇబ్బంది పెడుతున్నారు.. విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో
పండుగ పూట కావాలనే ఇబ్బంది పెడుతున్నారు.. విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో
Vinayaka Chavithi At Chandrababu Home: ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో వినాయక చవితి వేడుకలు
ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో వినాయక చవితి వేడుకలు Photos చూశారా
Hyderabad Crime News: అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
Andhra Pradesh Rains: ఏపీలో 12 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు.. పిడుగులు పడతాయని, అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!
ఏపీలో 12 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు.. పిడుగులు పడతాయని, అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!
Rashmika Mandanna : బేబీ బంప్‌తో రష్మిక లుక్... భర్త విజయ్‌కు హగ్ - రణబాలి సెట్‌లో క్యూట్ మూమెంట్
బేబీ బంప్‌తో రష్మిక లుక్... భర్త విజయ్‌కు హగ్ - రణబాలి సెట్‌లో క్యూట్ మూమెంట్
Konda Surekha: పదవి నుంచి తొలగించినందుకు బాధగా లేదు, మళ్లీ మంత్రిని అవుతాను: కొండా సురేఖ ధీమా
పదవి నుంచి తొలగించినందుకు బాధగా లేదు, మళ్లీ మంత్రిని అవుతాను: కొండా సురేఖ ధీమా
Embed widget