News
News
X

Whatsapp Call Links : వాట్సాప్‌లోనే ఇక గ్రూప్ కాల్ వీడియో మీటింగ్స్ - ఈ ఫీచర్ రాకింగ్ ఖాయం !

వాట్సాప్ కొత్తగా కాల్ లింక్స్ అనే ఫీచర్ అందుబాటులోకి తెస్తోంది. జూమ్ తరహాలో మీటింగ్‌లు ఏర్పాటు చేసుకోవచ్చు.

FOLLOW US: 
 
Whatsapp Call Links :  వాట్సాప్‌లో వీడియో కాల్స్ చేసుకోవాలంటే ఈజీనే. అయితే గ్రూప్ వీడియో కాల్స్ చేసుకోవాలంటే ఎనిమిది మందికి మత్రమే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఒకే సారి 32 మందితో  వీడియో కాల్‌లో మాట్లాడేలా కాల్ లింక్స్‌ను అభివృద్ది చేశారు.  ఈ అడ్వాన్స్ డ్ ఫీచర్ ను టెస్టింగ్ చేసే ప్రక్రియను త్వరలోనే వాట్సాప్ ప్రారంభించనుంది. దాని పేరే ‘కాల్ లింక్స్’. పేరుకు తగ్గట్టుగానే ఈ ఫీచర్ ను ఉపయోగించి ఒక లింక్ ను గరిష్ఠంగా 32 మందికి షేర్ చేసి.. దాని ద్వారా ఏకకాలంలో 32 మందితో వీడియో కాల్ లో మాట్లాడొచ్చు.

కాల్ లింక్స్ గురించి ఫేస్‌బుక్‌లో ప్రకటించిన మార్క్ 

వాట్సాప్ లో లేని వారు కూడా ఈ లింక్ ద్వారా వీడియో కాల్ కు కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. మెటా (ఫేస్ బుక్) గ్రూప్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ స్వయంగా దీనిపై ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ చేశారు. ఈ వారంలోనే ‘కాల్ లింక్స్’ ఫీచర్ ను ప్రయోగాత్మకంగా కొంతమంది వాట్సాప్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చే చాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.  అయితే ఈ ఫీచర్ ను వాడాలంటే వాట్సాప్ కొత్త వర్షన్ కు అప్ డేట్ కావాల్సి ఉంటుంది. ఈ తరహాలో గ్రూప్ వీడియో కాల్ లింక్ ను షేర్ చేసే ఫీచర్ గూగుల్ మీట్, జూమ్ యాప్ లలో అందుబాటులో ఉంది. 

News Reels

ఒకే్ సారి  32 మందితో వీడియో కాలింగ్ చేసుకునే సౌకర్యం

వాట్సాప్ లోని  ‘కాల్స్’ ట్యాబ్ లోకి వెళ్లాక ‘కాల్ లింక్స్’ అనే ఒక కొత్త ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఆడియో లేదా వీడియో కాల్ కు సంబంధించిన లింక్ ను క్రియేట్ చేయొచ్చు.  ఆ లింక్ ను మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు షేర్ చేయడం ద్వారా వారిని గ్రూప్ వీడియో కాల్ కు కనెక్ట్ చేసుకోవచ్చు. మీ కాంటాక్ట్ లిస్టులో లేని వారి నంబర్లకు కూడా ఈ లింక్ ను షేర్ చేయొచ్చు. ఆ లింక్ ను క్లిక్ చేసి వాళ్లు కూడా గ్రూప్ కాల్ లో చేరొచ్చు. ఇలా గరిష్ఠంగా 32 మందితో వీడియో కాల్ లో మాట్లాడేందుకు ‘కాల్ లింక్స్’ ఫీచర్ ఉపయోగపడుతుంది.   

ఎప్పుటికప్పుడు వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు 

వాట్సాప్‌ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయడంలో మెటా చురుకుగా వ్యవహరిస్తోంది. పోటీగా పలు మెసెజింగ్ సంస్థలు వస్తున్నా... సులువుగా వాడటంలో వాట్సాప్ ను మించినది ఇంకా రాలేదు. అందుకే వాట్సాప్ కు ఆదరణ అంతకంతకూ పెరుగుతోంది. ప్రత్యేకమైన సేవలు అందించడంలోనూ ముందుంటోంది. దాదాపుగా ప్రతీ నెలా ఓ అప్డేట్ తీసుకు వస్తుంది. ఇప్పటికే వాట్సాప్ ద్వారా డబ్బులు పంపించే సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది. 

Published at : 27 Sep 2022 06:00 PM (IST) Tags: WhatsApp WhatsApp Update Whatsapp Call Links

సంబంధిత కథనాలు

Meta Warning: అదే జరిగితే ఫేస్‌బుక్‌లో ఆ వార్తలన్నీ బంద్ - అమెరికాకే వార్నింగ్ ఇచ్చిన మెటా, ఇంతకీ ఆ గొడవేంటి?

Meta Warning: అదే జరిగితే ఫేస్‌బుక్‌లో ఆ వార్తలన్నీ బంద్ - అమెరికాకే వార్నింగ్ ఇచ్చిన మెటా, ఇంతకీ ఆ గొడవేంటి?

స్మార్ట్‌వాచ్‌లు సేఫా లేక డేంజరా? ఇంతకూ నిపుణులు ఏం అంటున్నారు.!

స్మార్ట్‌వాచ్‌లు సేఫా లేక డేంజరా? ఇంతకూ నిపుణులు ఏం అంటున్నారు.!

యూరోప్ బాటలో ఇండియా కూడా - ఈ-వేస్ట్ తగ్గించడానికి కఠిన నిర్ణయం!

యూరోప్ బాటలో ఇండియా కూడా - ఈ-వేస్ట్ తగ్గించడానికి కఠిన నిర్ణయం!

GST Law Panel: 'గేమ్స్ ఆఫ్ స్కిల్', 'గేమ్స్ ఆఫ్ ఛాన్స్'పై జీఎస్టీ ఎంత? గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల తర్వాతే నిర్ణయం!

GST Law Panel: 'గేమ్స్ ఆఫ్ స్కిల్', 'గేమ్స్ ఆఫ్ ఛాన్స్'పై జీఎస్టీ ఎంత? గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల తర్వాతే నిర్ణయం!

Apple Foldable Device: 2023లో యాపిల్ కొత్త ఫోల్డబుల్ డివైస్ - శాంసంగ్‌కు చెక్ పెట్టాలని ఫిక్స్!

Apple Foldable Device: 2023లో యాపిల్ కొత్త ఫోల్డబుల్ డివైస్ - శాంసంగ్‌కు చెక్ పెట్టాలని ఫిక్స్!

టాప్ స్టోరీస్

Jagan Review : వైఎస్ఆర్‌సీపీలోనూ వాలంటీర్ తరహా వ్యవస్థ - ప్రతి యాభై ఇళ్లకు ఓ నేతను పెట్టాలని జగన్ నిర్ణయం !

Jagan Review : వైఎస్ఆర్‌సీపీలోనూ వాలంటీర్ తరహా వ్యవస్థ - ప్రతి యాభై ఇళ్లకు ఓ నేతను పెట్టాలని జగన్ నిర్ణయం !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Connect Movie Trailer: డిఫరెంట్ హర్రర్ థ్రిల్‌ ఇచ్చే నయనతార ‘కనెక్ట్’ - ట్రైలర్ వచ్చేసింది - భయపడటం మాత్రం పక్కా!

Connect Movie Trailer: డిఫరెంట్ హర్రర్ థ్రిల్‌ ఇచ్చే నయనతార ‘కనెక్ట్’ - ట్రైలర్ వచ్చేసింది - భయపడటం మాత్రం పక్కా!

Pawan Kalyan: ఇంకో రీమేకా? మాకొద్దు బాబోయ్ - ట్విట్టర్‌లో పవన్ ఫ్యాన్స్ రచ్చ!

Pawan Kalyan: ఇంకో రీమేకా? మాకొద్దు బాబోయ్ - ట్విట్టర్‌లో పవన్ ఫ్యాన్స్ రచ్చ!