అన్వేషించండి

Realme Pad X: రియల్‌మీ చవకైన ట్యాబ్లెట్ వచ్చేసింది - రూ.18 వేలలోపే!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన చవకైన ట్యాబ్లెట్ ప్యాడ్ ఎక్స్‌ను మనదేశంలో లాంచ్ చేసింది.

రియల్‌మీ ప్యాడ్ ఎక్స్ ట్యాబ్లెట్ మనదేశంలో లాంచ్ అయింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌పై ఈ ట్యాబ్ పనిచేయనుంది. రియల్‌మీ లాంచ్ చేసిన మొదటి 5జీ ట్యాబ్లెట్ ఇదే కావడం విశేషం. ట్యాబ్లెట్ వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. క్వాడ్ స్పీకర్ సెటప్ కూడా ఇందులో ఉంది.

రియల్‌మీ ప్యాడ్ ఎక్స్ ధర
దీని ధరను మనదేశంలో రూ.19,999గా నిర్ణయించారు. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉంది. ఇది వైఫై కనెక్టివిటీని సపోర్ట్ చేయనుంది. 5జీ ఫీచర్ సపోర్ట్ చేసే మోడల్ ధర రూ.25,999గా ఉంది. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో 5జీ సపోర్ట్ చేసే మోడల్ ధర రూ.27,999గా ఉంది. గ్లేసియర్ బ్లూ, గ్లోయింగ్ గ్రే రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

దీని సేల్ ఆగస్టు 1వ తేదీ నుంచి జరగనుంది. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ.కాం, ఆఫ్‌లైన్ రిటైల్ చానెళ్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల ద్వారా దీన్ని కొనుగోలు చేస్తే రూ.2,000 తగ్గింపు లభించింది. అంటే రూ.17,999కే దీన్ని కొనేయచ్చన్న మాట.

రియల్‌మీ ప్యాడ్ ఎక్స్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మీ యూఐ 3.0 ఫర్ ప్యాడ్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ట్యాబ్లెట్ పనిచేయనుంది. ఇందులో 11 అంగుళాల 2కే డిస్‌ప్లేను అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌పై రియల్‌మీ ప్యాడ్ ఎక్స్ పనిచేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్ ఇందులో ఉంది. ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ద్వారా మరో 5 జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు.

ట్యాబ్లెట్ వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ముందువైపు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ద్వారా వీడియో కాల్స్ చేసుకోవచ్చు, సెల్ఫీలు తీసుకోవచ్చు. దీని ఫీల్డ్ ఆఫ్ వ్యూ 105 డిగ్రీలుగా ఉంది. 128 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఇందులో ఉంది. దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.

స్మార్ట్ కీబోర్డు, రియల్‌మీ మ్యాగ్నటిక్ స్టైలస్‌ను కూడా ఈ ట్యాబ్ సపోర్ట్ చేయనుంది. అయితే వీటిని ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. నాలుగు స్పీకర్లు ఈ ట్యాబ్‌లో ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 8340 ఎంఏహెచ్‌గా ఉంది. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్.... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
Embed widget