అన్వేషించండి

Oneplus Nord Watch: వన్‌ప్లస్ నార్డ్ వాచ్‌లో 105 స్పోర్ట్స్ మోడ్స్ - అఫీషియల్‌గా ప్రకటించిన కంపెనీ

వన్‌ప్లస్ తన కొత్త వాచ్‌ను మనదేశంలో లాంచ్ చేయనుంది. అదే వన్‌ప్లస్ నార్డ్ వాచ్.

వన్‌ప్లస్ నార్డ్ వాచ్‌లో 105 స్పోర్ట్స్ మోడ్స్ అందించనున్నారు. ఇండోర్ వాకింగ్, అవుట్‌డోర్ వాకింగ్, రన్నింగ్, యోగా, క్రికెట్, సైక్లింగ్ సహా ఎన్నో స్పోర్ట్స్ మోడ్స్ ఇందులో ఉండనున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన కీలక ఫీచర్లను కూడా కంపెనీ టీజ్ చేసింది. ఇందులో 1.78 అంగుళాల అమోఎల్ఈడీ డిస్‌ప్లే అందించనున్నారు. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్లను ఈ డిస్‌ప్లే సపోర్ట్ చేయనుంది.

వన్‌ప్లస్ దీనికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లను నెమ్మదిగా రివీల్ చేయడం ప్రారంభించింది. వన్‌ప్లస్ వాచ్ మనదేశంలో రూ.13,999 ధరతో అందుబాటులో ఉంది. నార్డ్ డివైస్‌లు తక్కువ ధరతో లాంచ్ అవుతాయి కాబట్టి దీని ధర రూ.7 వేల లోపే ఉంటుందని అనుకోవచ్చు. బ్యూర్ ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్లో కూడా వన్‌ప్లస్ నార్డ్ వాచ్ కనిపించింది. కాబట్టి ఈ వాచ్ మనదేశంలో కూడా త్వరలో లాంచ్ అవుతుందని అనుకోవచ్చు.

2021 ఏప్రిల్‌లో మనదేశంలో లాంచ్ అయిన వన్‌ప్లస్ వాచ్‌కు టోన్డ్‌డౌన్ వెర్షన్‌గా వన్‌ప్లస్ నార్డ్ వాచ్ లాంచ్ కానుంది. వన్‌ప్లస్ వాచ్, బ్యాండ్ తర్వాత ఈ చైనీస్ కంపెనీ లాంచ్ చేయనున్న వేరబుల్ ప్రొడక్ట్ ఇదే. వన్‌ప్లస్ వాచ్ తరహాలోనే నార్డ్ వాచ్‌లో కూడా హార్ట్ రేట్ మానిటర్, స్లీప్ ట్రాకింగ్, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ కూడా ఉండనున్నాయి. వన్‌ప్లస్ వాచ్‌లో 1 జీబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్, గైరోస్కోప్ సెన్సార్, జియోమ్యాగ్నటిక్ సెన్సార్, ఆప్టికల్ హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్లు అందించారు.

వన్‌ప్లస్ నార్డ్ 2టీ 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో ఇటీవలే లాంచ్ అయింది. ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.28,999గా నిర్ణయించారు. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999గా ఉంది. గ్రే షాడో, జేడ్ ఫాగ్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై వన్‌ప్లస్ నార్డ్ 2టీ పనిచేయనుంది. ఇందులో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 1300 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉంది.

ఫోన్ వెనకవైపు మూడు సెన్సార్లు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 సెన్సార్ ఉంది. దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ లెన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్615 సెన్సార్‌ను అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా (డ్యూయల్ సెల్) ఉంది. 80W సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ వోల్టే, వైఫై 6, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, గ్లోనాస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, ఎన్ఎఫ్‌సీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని మందం 0.82 సెంటీమీటర్లు కాగా, బరువు 190 గ్రాములుగా ఉంది.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Joseph Ravan Remand Report: నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
Telangana Tourism Master Plan 2026: తెలంగాణ టూరిజానికి నయా లుక్! దుర్గం చెరువు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి మెగా మాస్టర్ ప్లాన్!
తెలంగాణ టూరిజానికి నయా లుక్! దుర్గం చెరువు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి మెగా మాస్టర్ ప్లాన్!
CTI Letter for Adult Ads: క్రికెట్ మ్యాచ్‌ల టైంలో కండోమ్, డేటింగ్ యాప్ యాడ్స్‌ వద్దు! ఐసీసీ ఛైర్మన్ జైషాకు సీటీఐ లేఖ! 
క్రికెట్ మ్యాచ్‌ల టైంలో కండోమ్, డేటింగ్ యాప్ యాడ్స్‌ వద్దు! ఐసీసీ ఛైర్మన్ జైషాకు సీటీఐ లేఖ! 
హీరో Xoom 110 ధర, వేరియంట్లు, ఫీచర్లు - కొనే ముందే తెలుసుకోవాల్సిన 6 ముఖ్యమైన విషయాలు
హీరో Xoom 110 కొనాలని ఉత్సాహపడుతున్నారా? ఆ బండి గురించి మీకు ఈ విషయాలు తెలుసా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Joseph Ravan Remand Report: నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
నక్సలిజం వైపు వెళ్లేలా యువతకు సందేశాలు - జోసఫ్ రావణ్‌ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు!
Telangana Tourism Master Plan 2026: తెలంగాణ టూరిజానికి నయా లుక్! దుర్గం చెరువు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి మెగా మాస్టర్ ప్లాన్!
తెలంగాణ టూరిజానికి నయా లుక్! దుర్గం చెరువు టార్గెట్‌గా సీఎం రేవంత్ రెడ్డి మెగా మాస్టర్ ప్లాన్!
CTI Letter for Adult Ads: క్రికెట్ మ్యాచ్‌ల టైంలో కండోమ్, డేటింగ్ యాప్ యాడ్స్‌ వద్దు! ఐసీసీ ఛైర్మన్ జైషాకు సీటీఐ లేఖ! 
క్రికెట్ మ్యాచ్‌ల టైంలో కండోమ్, డేటింగ్ యాప్ యాడ్స్‌ వద్దు! ఐసీసీ ఛైర్మన్ జైషాకు సీటీఐ లేఖ! 
హీరో Xoom 110 ధర, వేరియంట్లు, ఫీచర్లు - కొనే ముందే తెలుసుకోవాల్సిన 6 ముఖ్యమైన విషయాలు
హీరో Xoom 110 కొనాలని ఉత్సాహపడుతున్నారా? ఆ బండి గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
Sugali Parvathi Devi On Pawan Kalyan: సుగాలి ప్రీతి కేసులో బిగ్ ట్విస్ట్! మోసం చేశారని పవన్ కల్యాణ్‌పై ఫిర్యాదు!
సుగాలి ప్రీతి కేసులో బిగ్ ట్విస్ట్! మోసం చేశారని పవన్ కల్యాణ్‌పై ఫిర్యాదు!
Nizamabad Crime News: నిజామాబాద్ జిల్లాలో భర్తను భవనంపై నుంచి తోసేసిన భార్య! చనిపోలేదని హార్పిక్‌ ఇంజెక్ట్ చేసి దారుణహత్య! 
నిజామాబాద్ జిల్లాలో భర్తను భవనంపై నుంచి తోసేసిన భార్య! చనిపోలేదని హార్పిక్‌ ఇంజెక్ట్ చేసి దారుణహత్య! 
Allu Arjun : సంధ్య థియేటర్ ఘటన - అల్లు అర్జున్‌కు స్వల్ప ఊరట
సంధ్య థియేటర్ ఘటన - అల్లు అర్జున్‌కు స్వల్ప ఊరట
Revamped Gold Monetization Scheme: ఇళ్లలోని ఇన్‌యాక్టివ్ గోల్డ్‌కు మోక్షం - సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీతో కేంద్రం భారీ స్కెచ్!
ఇళ్లలోని ఇన్‌యాక్టివ్ గోల్డ్‌కు మోక్షం - సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీతో కేంద్రం భారీ స్కెచ్!
Embed widget