అన్వేషించండి

Elon Musk: వాట్సాప్‌నకు పోటీగా ఎలాన్ మస్క్ XChat యాప్- ఇక ఈజీ చాటింగ్, ఫోన్ నెంబర్ లేకుండా కాల్స్

Elon Musk XChat app | వాట్సాప్‌కు పోటీగా ఎలాన్ మస్క్ XChat యాప్ వచ్చేస్తోంది. ఫోన్ నెంబర్‌ అవసరం లేకుండానే కాల్స్ చేసే అవకాశం కల్పించనున్నారు. త్వరలో ఇది అందుబాటులోకి రానుందని మస్క్ తెలిపారు.

XChat is Competition for whatsapp | టెక్నాలజీ ప్రపంచంలో మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నారు బిజినెస్ మ్యాన్ ఎలాన్ మస్క్. తన X ప్లాట్‌ఫామ్‌లో కొత్త మెసేజింగ్ ఫీచర్ XChat Appని ప్రారంభిస్తున్నారు. ఈ కొత్త చాటింగ్ విధానం ద్వారా వినియోగదారులు మరింత ఎక్కువ ప్రైవసీతో పాటు డేటా సెక్యూరిటీ, చాలా సులభమైన ఇంటర్‌ఫేస్‌ను పొందనున్నారు.

XChat అంటే ఏమిటి?

XChat అనేది X ప్లాట్‌ఫామ్ సంబంధిత కొత్త చాటింగ్ ఫీచర్. ఇది ప్రస్తుతం సబ్‌స్క్రిప్షన్ పద్ధతిలో కొందరికి అందుబాటులో ఉంది. ఇందులో వినియోగదారుల చాటింగ్, వీడియో కంటెంట్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో అందుబాటులో ఉంటుంది. కొంత సమయం తర్వాత అదృశ్యమయ్యే(Disappear) సందేశాలను పంపేందుకు సైతం అవకాశం కల్పించారు.

అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఎక్స్‌చాట్ ద్వారా మీరు ఆడియో, వీడియో కాల్స్ చేయడానికి ఇకపై ఎలాంటి ఫోన్ నంబర్ అవసరం లేదు. అంటే, ఇప్పుడు చాటింగ్, కాలింగ్ రెండూ కేవలం ఒక X ఖాతా ద్వారానే చేయవచ్చు. ఈ ఫీచర్ అన్ని రకాల డివైజ్‌లలో పనిచేస్తుంది.

బలమైన ఎన్‌క్రిప్షన్, డేటా సెక్యూరిటీ, ప్రైవసీ

XChatని కొత్త ఎన్‌క్రిప్షన్ ఆర్కిటెక్చర్‌పై రూపొందించినట్లు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ పేర్కొన్నారు ఇది రస్ట్ ఆధారితమని... దీనిని 'బిట్‌కాయిన్ స్టైల్ ఎన్‌క్రిప్షన్' అన్నారు. ఇది యూజర్ల సెక్యూరిటీ విషయంలో రాజీ పడలేదని స్పష్టం చేశారు. వినియోగదారులు తమ చాటింగ్, డేటాను సురక్షితంగా ఉంచుకోవడానికి 4 అంకెల పిన్ కోడ్‌ను సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీ చాటింగ్‌ గతంలోని చాటింగ్, మెసేజింగ్ యాప్‌ల కంటే మరింత సురక్షితం కానుంది.

మరిన్ని ఫీచర్లు ఏమిటి?

XChat ఇంకా బీటా వెర్షన్‌లో ఉది. నివేదికల ప్రకారం, ఇందులో గ్రూప్ చాట్ ఫీచర్ కూడా రానుంది. దీంతో పాటు మీరు కోరుకుంటే, ఏదైనా చాట్‌ను చదవకుండానే వదిలిపెట్టే ఛాన్స్ ఉంది.  అంటే "చదవనిది" (Unread) ఉంచే అవకాశం కూడా ఉంటుంది. ఫైల్ షేరింగ్ ఇప్పుడు మరింత సులభం అవుతుంది. ఎందుకంటే XChat ఏదైనా రకమైన ఫైల్‌ను పంపేలా డిజైన్ చేశారు. 

అందరికీ ఎప్పుడు అందుబాటులోకి..

ప్రస్తుతం, XChat ప్రారంభ వెర్షన్ కొన్ని ఎంపిక చేసిన చెల్లింపు వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇది త్వరలో అన్ని X వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని సంస్థ చెబుతోంది. 

ఎలాన్ మస్క్ 'ఎవ్రీథింగ్ యాప్' విజన్

XChatని మస్క్ దీని పెద్ద ప్లాన్‌తో లాంచ్ చేయనున్నారు. మొదట చాటింగ్ యాప్, వీడియో, ఆడియో కాలింగ్ గా తీసుకురానున్న యాప్ తరువాత అన్ని రకాల సేవలు అందించేలా డిజైన్ చేస్తున్నారు. Xని ఒక ‘ఎవ్రీథింగ్ యాప్’ అంటే ప్రతి పని కోసం వాడే ఒకే యాప్‌గా మార్చాలనుకుంటున్నారు. సోషల్ మీడియా నుండి పేమెంట్స్, కాలింగ్, చాటింగ్ ద్వారా మల్టీ ఫంక్షన్  ప్లాట్‌ఫామ్‌గా మారుతోంది.

XChat ద్వారా ఎలాన్ మస్క్ Xని కేవలం ఒక సోషల్ నెట్‌వర్క్‌గా కాకుండా, ఆల్ ఇన్ వన్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌గా చూస్తున్నారు. కొత్త టెక్నాలజీ, ప్రైవసీపై ఫోకస్ చేయడంతో XChat చాటింగ్‌కు ఒక కొత్త రూపాన్ని ఇవ్వనుంది. మీరు టెక్నాలజీ కొత్త ఫేజ్‌లో భాగం కావాలనుకుంటే, XChat కోసం సిద్ధంగా ఉండండి, గతంలో కంటే ఈజీ చాటింగ్, డేటా సేఫ్, ప్రైవసీ ఉంటుందని చెబుతున్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Embed widget