SIM Card Facts: సిమ్ కార్డు సైడ్‌లో ఎందుకు కట్ అయి ఉంటుందో తెలుసా?
SIM Card Cut: మీరు సిమ్ కార్డును జాగ్రత్తా పరిశీలిస్తే ఒక వైపు కట్ అయి ఉంటుంది. అసలు అది ఎందుకు అలా పక్కన కట్ అయి ఉంటుందో మీకు తెలుసా?

SIM Card: నేటి డిజిటల్ ప్రపంచంలో సిమ్ కార్డ్ ఒక ముఖ్యమైన భాగం. ఈ చిన్న చిప్ కార్డ్ మనల్ని మొబైల్ నెట్‌వర్క్‌కు కలుపుతుంది. కాల్స్, మెసేజెస్, ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందిస్తుంది. సిమ్ కార్డ్‌కు ఒక మూలలో చిన్నగా కట్ చేసి ఉంటుందని మీరు గమనించి ఉండాలి. కానీ అసలు ఇక్కడ ఎందుకు కట్ చేస్తారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దాని వెనుక ఉన్న కారణాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
సిమ్ కార్డ్ డిజైన్
సిమ్ కార్డ్‌లో ఉండే ఈ కట్ మొబైల్ ఫోన్‌లో సిమ్‌ను సరైన దిశలో ఇన్‌సర్ట్ చేయడానికి సహాయపడుతుంది. సిమ్ కార్డ్ లోపల ఒక చిప్ ఉంది. ఇది మీ నెట్‌వర్క్, గుర్తింపు సమాచారాన్ని నిల్వ చేస్తుంది. సిమ్‌ను తప్పు దిశలో చొప్పించినట్లయితే అది పనిచేయదు.దీంతోపాటు చిప్ దెబ్బతినవచ్చు. కట్ చేయడం వెనక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం సిమ్ కార్డ్‌ను సులభంగా, సరైన దిశలో ఇన్‌సర్ట్ చేయడం.
సాంకేతిక భద్రత కూడా...
కట్ చేయడానికి రెండో ప్రధాన కారణం సాంకేతిక భద్రత. ఇలా కట్ చేయడం సిమ్ కార్డ్‌ను సరైన స్లాట్‌లో అమర్చేలా గైడ్ చేస్తుంది. సిమ్ కార్డ్‌ను తలక్రిందులుగా లేదా తప్పు మార్గంలో ఇన్‌సర్ట్ చేయడానికి ప్రయత్నిస్తే అది స్లాట్‌లో సరిపోదు. ఈ డిజైన్ నెట్‌వర్క్, డివైస్ మొత్తాన్ని దెబ్బతినకుండా రక్షిస్తుంది.
Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?
అంతర్జాతీయ ప్రమాణాలు
సిమ్ కార్డ్ పరిమాణం, డిజైన్‌కు సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలు (ISO) రూపొందించారు. ఈ ప్రమాణాలు సిమ్ కార్డ్ ప్రతి రకమైన మొబైల్ ఫోన్, డివైస్‌తో అనుకూలంగా ఉండేలా చూస్తాయి. కట్ డిజైన్ ఈ ప్రమాణాలలో ఒక భాగం. తద్వారా సిమ్‌ని ప్రతి పరికరంలో సులభంగా ఉపయోగించవచ్చు.
వాడుకలో సౌలభ్యం కూడా...
సిమ్ కార్డ్‌లోని కట్ వినియోగదారుకు మార్గదర్శకంగా పనిచేస్తుంది. మీరు ఫోన్‌లోకి సిమ్‌ని చొప్పించినప్పుడు, ఈ కట్ దానిని ఎలా లోపల పెట్టాలో మీకు అర్థం అయ్యేలా చేస్తుంది. ఇది సమయాన్ని ఆదా చేస్తుంది. సిమ్‌ని తప్పుగా చొప్పించే అవకాశాలను తగ్గిస్తుంది. సిమ్ కార్డ్‌లోని సైడ్ నాచ్ ఒక ముఖ్యమైన డిజైన్ లక్షణం. ఇది సిమ్ కార్డును సరిగ్గా చొప్పించడంలో సహాయపడటమే కాకుండా మీ పరికరం, నెట్‌వర్క్, భద్రతను కూడా నిర్ధారిస్తుంది.
Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
I am phoneless?!?! What am I going to do without it?
— 🌞 𝕊𝕦𝕟𝕟𝕪 𝔸 𝕄𝕠𝕣𝕘𝕒𝕟 🌞 (@SunnyAMorgan1) January 6, 2025
I somehow cracked my phone screen and can not use it at all. My local At&t is closed because of the storm. I have an old phone if I can only figure out how to get the SIM card out without a tool. pic.twitter.com/yIGYKuWKcg





















