అన్వేషించండి

Google Account Security: మీ Google అకౌంట్ సేఫ్‌గా ఉండాలంటే? ఈ 5 సెట్టింగ్‌లను ఇప్పుడే మార్చండి!

Google Account Security: మీ గూగుల్ అకౌంట్ సేఫ్‌గా ఉండాలంటే వెంటనే ఈ 5 సెట్టింగ్స్ మార్చుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • గూగుల్ ఖాతా భద్రతకు 2-స్టెప్ వెరిఫికేషన్, బలమైన పాస్‌వర్డ్‌ కీలకం.
  • సెక్యూరిటీ చెకప్ ద్వారా పరికరాలు, థర్డ్-పార్టీ యాప్‌ల యాక్సెస్ నియంత్రించండి.
  • రికవరీ ఫోన్, ఇమెయిల్ అప్‌డేట్ చేసి, మోసాల నుండి రక్షించండి.

Google Account Security: ఈ రోజుల్లో డిజిటల్ ప్రయాణంలో గూగుల్ అకౌంట్ చాలా కీలకం. జీమెయిల్, గూగుల్ ఫోటోస్, డ్రైవ్, యూట్యూబ్, ఫోన్ కాంటాక్ట్స్ వంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఒక్క అకౌంట్‌తోనే లింక్ అయి ఉంటుంది. ఈ నేపథ్యంలో మీ గూగుల్ అకౌంట్ సెక్యూరిటీ సెట్టింగ్‌లు బలహీనంగా ఉంటే, సైబర్ నేరగాళ్ల చేతికి మీ వ్యక్తిగత డేటా చిక్కితే భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. మీ అకౌంట్ సెక్యూరిటీని బలోపేతం చేయడానికి ఈ 5 సెట్టింగ్‌లను వెంటనే చెక్ చేసుకోండి.  

1. 2-స్టెప్ వెరిఫికేషన్  

మీ గూగుల్ అకౌంట్‌కు రక్షణ కల్పించే అత్యంత ముఖ్యమైన విషయం.. 2-స్టెప్ వెరిఫికేషన్. దీన్ని యాక్టివేట్ చేయడం వల్ల, పాస్‌వర్డ్‌ నమోదు చేసిన తర్వాత కూడా మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీ  ద్వారా అదనపు వెరిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనివల్ల వేరొకరికి మీ పాస్‌వర్డ్ తెలిసినప్పటికీ, మీ పర్మిషన్ లేనిదే లాగిన్ చేయడం సాధ్యంకాదు.

2. గూగుల్ సెక్యూరిటీ చెకప్   

గూగుల్ అకౌంట్‌లోని 'సెక్యూరిటీ చెకప్' ఫీచర్ ద్వారా మీ అకౌంట్ భద్రతను ఈజీగా చెక్ చేయవచ్చు. మీ అకౌంట్ ఏయే పరికరాల్లో లాగిన్ అయి ఉంది, ఏయే యాప్‌లు లింక్ అయి ఉన్నాయి అనేది ఇందులో తెలుస్తుంది. మీకు తెలియని లేదా మీరు ప్రస్తుతం ఉపయోగించని డివైస్‌లో ఏదైనా కనిపిస్తే, వెంటనే దాన్ని 'Sign Out' చేయడం బెటర్.  

3. వీక్ పాస్‌వర్డ్‌లను మార్చండి

మీరు చాలా కాలంగా ఒకే పాస్‌వర్డ్‌ను ఉపయోగిస్తున్నా, లేదా ఇతర వెబ్‌సైట్లలో వాడిన పాస్‌వర్డ్‌నే గూగుల్ అకౌంట్‌కు ఉపయోగిస్తున్నా వెంటనే దాన్ని మార్చండి. వేరొక వెబ్‌సైట్ డేటా లీక్ అయినప్పుడు అదే పాస్‌వర్డ్‌తో మీ గూగుల్ అకౌంట్ హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. ఆల్ఫా న్యూమరిక్, సింబల్స్ కలగలిపిన బలమైన పాస్‌వర్డ్‌ను మాత్రమే పెట్టుకోండి. 

Also Read: 1980 రెట్రో ఫొటో ట్రెండ్‌‌తో నిలువునా ముంచేస్తారు జాగ్రత్త.. సైబర్ బ్యూరో వార్నింగ్

4. థర్డ్-పార్టీ యాప్స్ యాక్సెస్

చాలా రకాల యాప్‌లు లేదా వెబ్‌సైట్‌లలో ఈజీగా సైన్ ఇన్ చేయడానికి 'Sign in with Google' నియోగిస్తుంటాం, ఆ తర్వాత వాటిని మర్చిపోతుంటాం. మీ అకౌంట్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి థర్డ్ పార్టీ యాప్‌ల లిస్ట్ ను చెక్ చేయండి. మీరు ప్రస్తుతం ఉపయోగించని యాప్‌ల నుంచి యాక్సెస్‌ను వెంటనే రద్దు చేయండి.

Also Read: ఐఫోన్ 17 ప్రోపై భారీ ఆఫర్.. రూ. 69,990కే మీ సొంతం!

5. రికవరీ ఫోన్, ఇమెయిల్‌ను అప్‌డేట్‌  

పాస్‌వర్డ్‌ను మరచిపోయినా లేదా మీ అకౌంట్ హ్యాక్‌ అయినా తిరిగి పొందడానికి ఫోన్ నెంబర్, ప్రత్యామ్నాయ ఇమెయిల్ అడ్రస్ అవసరం. మీ అకౌంట్ లో రిజిస్టర్ చేసిన రికవరీ ఫోన్ నంబర్ ఇమెయిల్ మీరు ప్రస్తుతం వాడుతున్నారా, లేదా అనేది చెక్ చేసుకుని అప్‌డేట్ చేయండి.

ఈ 5 చిన్న మార్పులు చేయడం ద్వారా మీ గూగుల్ అకౌంట్‌ను డిజిటల్ మోసాల నుంచి సురక్షితంగా ఉంచుకోవచ్చు. 

Also Read: ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా

Frequently Asked Questions

గూగుల్ అకౌంట్ భద్రత ఎందుకు ముఖ్యం?

మీ జీమెయిల్, గూగుల్ ఫోటోస్, డ్రైవ్, యూట్యూబ్, ఫోన్ కాంటాక్ట్స్ వంటి ముఖ్యమైన సమాచారం అకౌంట్‌తో లింక్ అయి ఉంటుంది. భద్రత లేకపోతే వ్యక్తిగత డేటా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.

2-స్టెప్ వెరిఫికేషన్ అంటే ఏమిటి, దాని వల్ల లాభం ఏమిటి?

ఇది గూగుల్ అకౌంట్‌కు అదనపు రక్షణ. పాస్‌వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి. ఇది మీ అనుమతి లేకుండా ఇతరులు లాగిన్ అవ్వకుండా ఆపుతుంది.

నా గూగుల్ అకౌంట్ భద్రతను ఎలా తనిఖీ చేయాలి?

గూగుల్ అకౌంట్‌లోని 'సెక్యూరిటీ చెకప్' ఫీచర్ ద్వారా దీన్ని చేయవచ్చు. ఏయే పరికరాల్లో లాగిన్ అయి ఉంది, ఏయే యాప్‌లు లింక్ అయి ఉన్నాయి అనేది తెలుస్తుంది. తెలియని డివైస్‌ల నుండి వెంటనే సైన్ అవుట్ చేయాలి.

బలహీనమైన పాస్‌వర్డ్‌ల విషయంలో ఏమి చేయాలి?

పాతవి లేదా ఇతర వెబ్‌సైట్లలో వాడిన పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చాలి. ఆల్ఫా న్యూమరిక్, సింబల్స్ కలిపి బలమైన పాస్‌వర్డ్‌ను ఎంపిక చేసుకోవాలి.

రికవరీ ఫోన్ నంబర్, ఇమెయిల్ అప్‌డేట్ చేయడం ఎందుకు అవసరం?

పాస్‌వర్డ్ మరచిపోయినా లేదా అకౌంట్ హ్యాక్ అయినా తిరిగి పొందడానికి ఇవి అవసరం. మీరు ప్రస్తుతం వాడుతున్నవి ఉన్నాయో లేదో చూసుకుని వీటిని అప్‌డేట్ చేయాలి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
Best Phones Under 30000: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget