అన్వేషించండి

BSNL New Plan: 2022 ప్లాన్ లాంచ్ చేసిన బీఎస్ఎన్ఎల్ - 300 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్!

బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. అదే రూ.2,022 ప్లాన్.

కేంద్ర ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే రూ.2,022 ప్లాన్. ఈ ప్లాన్ అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌ను అందించనుంది. దీని వ్యాలిడిటీ 300 రోజులుగా ఉంది. ఈ ప్లాన్ ద్వారా 75 జీబీ డేటాను అందించనున్నారు. దీంతోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాలింగ్ లాభాలు కూడా లభించనున్నాయి.

బీఎస్ఎన్ఎల్ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్లాన్ 2022’ అనే పేరుతో ఈ కొత్త ప్లాన్‌ను లాంచ్ చేసింది. బీఎస్ఎన్ఎల్ అందించే 75 జీబీ డేటా అయిపోతే నెట్ స్పీడ్ 40 కేబీపీఎస్‌కు తగ్గనుంది. అయితే హైస్పీడ్ డేటా వ్యాలిడిటీ కూడా 60 రోజులుగానే ఉంది. ఈ 60 రోజుల తర్వాత డేటా కావాలంటే వోచర్లతో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్లాన్ వ్యాలిడిటీ 300 రోజులుగా ఉంది.

ఈ ప్లాన్ దేశం మొత్తం అందుబాటులో ఉంది. ఆగస్టు 31వ తేదీ వరకు దీంతో రీచార్జ్ చేసుకోవచ్చు. బీఎస్ఎన్ఎల్ రాబోయే 18 నుంచి 24 నెలల్లో 4జీ సర్వీసులను ప్రారంభించనుందని తెలుస్తోంది. 5జీ సర్వీసులు కూడా ఫైనల్ టెస్టింగ్ దశలో ఉన్నట్లు సమాచారం.

బీఎస్ఎన్ఎల్ రూ.398 ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తుంది. దీంతోపాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ కూడా లభించనున్నాయి. ఇంక మరే అదనపు లాభాలు ఈ ప్లాన్ ద్వారా అందించారు. ప్రస్తుతం రూ.400లోపు అన్‌లిమిటెడ్ డేటాను అందించే ప్రత్యేకమైన ప్లాన్ మార్కెట్లో ఇదొక్కటే ఉంది. దీంతోపాటు ఎన్నో ప్రత్యేకమైన ప్లాన్లు బీఎస్ఎన్ఎల్‌లో ఉన్నాయి. అయితే 4జీ లేకపోవడం బీఎస్ఎన్ఎల్‌కు పెద్ద మైనస్‌గా మారింది. 2021లో ప్లాన్ టారిఫ్‌లు పెంచని ఏకైక టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎలే.

2023లో 5జీ లాంచ్ చేయాలని బీఎస్ఎన్ఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవేళ అన్నీ ప్లాన్‌కు తగ్గట్లు జరిగితే బీఎస్ఎన్ఎల్ త్వరలో 4జీ సర్వీసులను కూడా అందించనుంది. అప్పుడు ప్రైవేట్ కంపెనీలకు దీటుగా బీఎస్‌ఎన్ఎల్ పోటీలోకి రాగలదు. ప్రస్తుతం 5జీ సొల్యూషన్స్ కోసం జియో, ఎయిర్‌టెల్ కూడా ఎదురుచూస్తున్నాయి. మీరు నివసించే ప్రాంతంలో బీఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ స్పీడ్ బాగుంటే ఇది మీకు బెస్ట్ ప్లాన్ అవుతుంది.

బీఎస్ఎన్ఎల్ రూ.299 ప్లాన్ ద్వారా రోజుకు 3 జీబీ డేటాను అందించనుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది. అంటే మొత్తంగా 90 జీబీ డేటాను ఈ ప్లాన్‌తో అందించనున్నారన్న మాట. ఎఫ్‌యూపీ లిమిట్ అయిపోయాక డేటా స్పీడ్ 80 కేబీపీఎస్‌కు తగ్గిపోనుంది.

ఇంటర్నెట్ లాభాలతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ కూడా ఈ ప్లాన్ ద్వారా లభించనున్నాయి. ఈ ధరలో ప్రైవేట్ టెల్కోలు అందించే ప్లాన్లతో పోలిస్తే ఈ ప్లాన్ దాదాపు రెట్టింపు లాభాలను అందిస్తుంది. కానీ బీఎస్ఎన్ఎల్‌కు 4జీ లేకపోవడం ఒక్కటే మైనస్.

రూ.299లో ఎయిర్ టెల్, వొడాఫోన్ ప్లాన్లు ఇవే...
రూ.299 ధరలో ఎయిర్‌టెల్, వొడాఫోన్ ప్లాన్లు  కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి కేవలం రోజుకు 1.5 జీబీ డేటాను మాత్రమే అందించనున్నాయి. అంటే బీఎస్ఎన్ఎల్ అందించే డేటాలో సగం అన్నమాట. వీటి వ్యాలిడిటీ కూడా కేవలం 28 రోజులు మాత్రమే. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు మాత్రం ఎయిర్ టెల్, వొడాఫోన్ కూడా అందిస్తున్నాయి.

Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!

Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!

టాప్ హెడ్ లైన్స్

Apple iPhone 18 Pro Sales EMI: ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ సేల్స్ షురూ.. EMI, క్యాష్‌బ్యాక్ వివరాలు ఇవే!
ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ సేల్స్ షురూ.. EMI, క్యాష్‌బ్యాక్ వివరాలు ఇవే!
Laptop Keyboard Cleaning : ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
Bluetooth LE: బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?
బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Land For Poor People: దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు
దశాబ్దాల నిరీక్షణకు తెర.. 28 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ- సీఎం చంద్రబాబు
Sharmila Daughter Wedding: కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. YSRకు ఫస్ట్ కార్డ్
కుమార్తె పెళ్లి డేట్, వివరాలు ప్రకటించిన వైఎస్ షర్మిల.. నాన్న YSRకు ఫస్ట్ కార్డ్
TMC New Name And Logo: టీఎంసీ గ్రూపులకు పార్టీ పేరు, గుర్తు కేటాయించిన ఈసీ.. మమతా బెనర్జీ పార్టీ పేరు, వివరాలు
టీఎంసీ గ్రూపులకు పార్టీ పేరు, గుర్తు కేటాయించిన ఈసీ.. మమతా బెనర్జీ పార్టీ పేరు, వివరాలు
Vijayasai Reddy: ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
ఆ 2 కుటుంబాలతో సీమకు ప్రయోజనం లేదు.. రాయలసీమ ఒరిజనల్ రెడ్ల పౌరుషం చూపిస్తాం: విజయసాయిరెడ్డి
Human Trafficking Case: బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
The India Story OTT : ఓటీటీలోకి సడన్‌గా కాజల్ అగర్వాల్ కొత్త మూవీ - కోర్ట్ రూమ్ డ్రామా 'ద ఇండియా స్టోరీ' ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి సడన్‌గా కాజల్ అగర్వాల్ కొత్త మూవీ - కోర్ట్ రూమ్ డ్రామా 'ద ఇండియా స్టోరీ' ఎందులో చూడొచ్చంటే?
AP Congress : ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
రూ.10 లక్షల లోపు ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌.. బలెనో, i20లో మీకు ఏది సరిపోతుందంటే?
బలెనో vs i20.. టాప్‌ వేరియంట్లలో ఏ కారు ఎక్కువ ఫీచర్లు ఇస్తుందో తెలుసా?
Embed widget