అన్వేషించండి

Asus Rog Phone 5s: 18 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌తో అసుస్ గేమింగ్ ఫోన్ - ఫీచర్లు మామూలుగా లేవుగా!

అసుస్ రోగ్ ఫోన్ 5ఎస్ సిరీస్ స్మార్ట్ ఫోన్లు మనదేశంలో లాంచ్ అయ్యాయి. వీటిలో 18 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ అందించారు.

Asus Rog Phone 5S Series Launched: అసుస్ రోగ్ ఫోన్ 5ఎస్(Asus Rog Phone 5S), రోగ్ ఫోన్ 5ఎస్ ప్రో (Asus Rog Phone 5S Pro) మనదేశంలో లాంచ్ అయ్యాయి. ఈ రెండు గేమింగ్ స్మార్ట్ ఫోన్లలో టాప్ ఎండ్ స్నాప్‌డ్రాగన్ 888+ ప్రాసెసర్‌ను అందించారు. దీంతోపాటు వీటిలో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ శాంసంగ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్‌గా ఉంది. 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని కూడా ఇందులో అందించారు.

అసుస్ రోగ్ ఫోన్ 5ఎస్ ధర
ఇందులో రెండు ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.49,999గా ఉంది. ఇక 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.57,999గా నిర్ణయించారు. ఫాంటం బ్లాక్, స్టార్మ్ వైట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

అసుస్ రోగ్ ఫోన్ 5ఎస్ ప్రో ధర
ఇందులో 18 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధరను రూ.79,999గా నిర్ణయించారు. ఫాంటం బ్లాక్ కలర్ ఆప్షన్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ రెండు ఫోన్ల సేల్ ఫిబ్రవరి 18వ తేదీన జరగనుంది. ఫ్లిప్‌కార్ట్‌లో వీటిని కొనుగోలు చేయవచ్చు.

అసుస్ రోగ్ ఫోన్ 5ఎస్, 5ఎస్ ప్రో స్పెసిఫికేషన్లు
ఈ రెండు ఫోన్లూ ఆండ్రాయిడ్ 11 ఆధారిత రోగ్ యూఐ ఆపరేటింగ్ సిస్టంపైనే పనిచేయనున్నాయి. వీటిలో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ శాంసంగ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 360 హెర్ట్జ్‌గానూ ఉంది. హెచ్‌డీఆర్10+ సపోర్ట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్న 2.5డీ కర్వ్‌డ్ గ్లాస్ కూడా ఇందులో ఉంది. రియల్‌మీ 5ఎస్ ప్రోలో వెనకవైపు చిన్న పీఎంఓఎల్ఈడీ డిస్‌ప్లేను కూడా అందించారు.

ఈ రెండిట్లోనూ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888+ ప్రాసెసర్‌ను అందించారు. అసుస్ రోగ్ ఫోన్ 5ఎస్‌లో 12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ అందించగా... అసుస్ రోగ్ ఫోన్ 5ఎస్‌లో 18 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు స్టోరేజ్ అందుబాటులో ఉంది. ఈ రెండిట్లో ఎల్పీడీడీఆర్5 ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ అందించారు.

ఈ రెండిట్లోనూ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 64 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్686 సెన్సార్‌ను ప్రధాన కెమెరాగా అందించారు. దీంతోపాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 24 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.

ముందువైపు డ్యూయల్ ఫ్రంట్ స్టీరియో స్పీకర్లు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, వైఫై డైరెక్ట్, బ్లూటూత్ వీ5.2, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో డ్యూయల్ సెల్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 30W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.99 సెంటీమీటర్లు గానూ, బరువు 238 గ్రాములుగానూ ఉంది.

Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, కేవలం రూ.1,999కే!

Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget