Women IPL Auction 2023: మహిళ ఐపీఎల్ వేలంలో కోట్లు కొల్లగొట్టే ప్లేయర్స్ వీరే - టాప్‌లో ఎవరు?
మహిళల ఐపీఎల్‌లో ఎక్కువ ధర పొందే అవకాశం ఉన్న ఐదుగురు ఆటగాళ్లు వీరే.
Women Premier League: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం (WPL వేలం) ఫిబ్రవరి 13వ తేదీన ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. ఈ వేలంలో మొత్తం 409 మంది మహిళా క్రికెటర్లు అందుబాటులో ఉన్నారు. వీరి నుంచి ఫ్రాంచైజీలు తమ జట్లను ఎంపిక చేసుకుంటాయి. ప్రతి జట్టుకు వేలంలో రూ.12 కోట్ల పర్స్ అందుబాటులో ఉండనుంది. తమ జట్టులో కనీసం 15 మంది, గరిష్టంగా 18 మంది ప్లేయర్స్‌ను కొనుగోలు చేయగలవు. ఈ వేలంలో అత్యధిక ధరను పొందే అవకాశం ఉన్న క్రికెటర్లు వీరే.
1. స్మృతి మంథన: భారత క్రికెటర్ స్మృతి మంథన గత కొన్నేళ్లుగా టీమ్ ఇండియాకు అత్యంత ముఖ్యమైన ప్లేయర్. తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో చాలా సందర్భాలలో జట్టును గెలిపించింది. ప్రస్తుతం ఆమె మహిళా బ్యాట్స్‌మెన్‌ల టీ20 ర్యాంకింగ్స్‌లో కూడా మూడో స్థానంలో ఉంది. స్మృతి మంథన మంచి పాపులర్ ఫేస్. కాబట్టి ఆమె చేరబోయే టీమ్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో WPL వేలంలో స్మృతి మంథన అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో నిలిచే అవకాశం ఉంది. మొత్తం అందరికంటే కాస్ట్లీ ప్లేయర్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
2. దీప్తి శర్మ: భారత జట్టులోని ఈ ఆల్ రౌండర్ ప్రస్తుతం మహిళా బౌలర్ల టీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో, ఆల్ రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉంది. అటువంటి పరిస్థితిలో ఈ నైపుణ్యం ఉన్న ఆల్‌రౌండర్‌పై డబ్బుల వర్షం కురిసే అవకాశం ఉంది.
3. షెఫాలీ వర్మ: ఇటీవల షెఫాలీ వర్మ కెప్టెన్సీలో టీ20 ప్రపంచ కప్‌ను భారత అండర్-19 మహిళల జట్టు గెలుచుకుంది. కేవలం 19 సంవత్సరాల వయస్సులోనే ఈ ప్లేయర్ భారతదేశం తరపున 51 T20Iలు ఆడింది. 24.62 సగటుతో 1231 పరుగులు చేశాడు. షెఫాలీ వర్మ స్ట్రైక్ రేట్ కూడా 134.53గా ఉంది. మహిళా బ్యాట్స్‌మెన్‌ల టీ20 ర్యాంకింగ్స్‌లో షెఫాలీ వర్మ 8వ స్థానంలో ఉంది. ఫ్రాంచైజీతో లాంగ్ టైమ్ ట్రావెల్ చేయగల ఏజ్ ఉంది కాబట్టి తన కోసం ఫ్రాంచైజీలు పోటీ పడతాయి.
4. సోఫీ డివైన్: న్యూజిలాండ్‌కు చెందిన సోఫీ డివైన్ అద్భుతమైన ఆల్ రౌండర్. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానంలో ఉండగా, ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉంది. విదేశీ ఆటగాళ్లలో తనకు అత్యధిక ధర లభిస్తుందని భావిస్తున్నారు.
5. అలిస్సా హీలీ: ఈ ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్ బ్యాటర్ మీద కూడా ఫ్రాంచైజీలు ప్రత్యేక దృష్టి పెట్టనున్నాయి. 32 ఏళ్ల ఈ క్రీడాకారిణి బ్యాటింగ్ సగటు 23.46 కాగా స్ట్రైక్ రేట్ 128గా ఉంది. ఆమె టీ20 క్రికెట్‌లో కూడా సెంచరీ సాధించింది. అనేక సందర్భాల్లో ఆస్ట్రేలియా తరపున మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడింది.
మార్చి 4వ తేదీన డబ్ల్యూపీఎల్ మొదటి సీజన్ ప్రారంభం కానుంది. మార్చి 26వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ మేరకు బీసీసీఐ ఐదు డబ్ల్యూపీఎల్ ఫ్రాంచైజీలకు ఈ-మెయిల్ పంపినట్లు సమాచారం. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లు ముంబైలోని బ్రబౌర్న్, డీవై పాటిల్ స్టేడియాలలో జరగనున్నాయి.