News
News
X

Prithvi Shaw: పృథ్వీ షా వైరల్ వీడియోలో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా? - గొడవ పెట్టుకున్న భోజ్‌పురి హీరోయిన్!

పృథ్వీ షా వైరల్ వీడియోలో ఉన్న సెలబ్రిటీ ఎవరో తెలుసా?

FOLLOW US: 
Share:

Prithvi Shaw Sapna Gill Selfie Case Update: భారత క్రికెటర్ పృథ్వీ షా ఇటీవల వైరల్ వీడియో కారణంగా లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. ఈ వీడియోలో పృథ్వీ షా, ఒక యువతి మధ్య వాగ్వాదం జరుగుతోంది. పృథ్వీ షాతో వాగ్వాదానికి దిగిన యువతి మరెవరో కాదు యువ నటి సప్నా గిల్. ఈ వీడియోలో పృథ్వీ షాతో సప్నా గిల్ వాగ్వాదానికి దిగినట్లు స్పష్టంగా కనిపించింది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పృథ్వీ స్నేహితుడు చిత్రీకరించాడు. ఈ వీడియో బాగా వైరల్ అయింది. కాగా ఈ కేసులో సంబంధిత యువ నటి సప్నా గిల్‌తో పాటు మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

భారత క్రికెటర్ పృథ్వీ షా ప్రస్తుతం టీమ్ ఇండియా జట్టులో లేడు. నటి సప్నా గిల్‌తో వివాదం కారణంగా ప్రస్తుతం పృథ్వీ షా వార్తల్లో నిలిచారు. ముంబై వీధుల్లో ఇద్దరి మధ్య చాలా బలంగా వాగ్వాదం జరిగింది. పృథ్వీ స్నేహితుడి కారు అద్దాలను సప్నా గిల్ పగులగొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత నటి సప్నా గిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

సప్నా గిల్ ఎవరు? (Who is Sapna Gill)
సప్నా గిల్ భోజ్‌పురి నటి, మోడల్. సప్నా తన గ్లామర్, నటనతో భోజ్‌పురి పరిశ్రమలో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం సప్నా గిల్ వయసు 26 ఏళ్లు. సప్నా పంజాబ్ రాజధాని చండీగఢ్‌లో జన్మించింది. భోజ్‌పురి సూపర్ స్టార్ నటుడు రవి కిషన్, దినేష్ లాల్ యాదవ్‌తో కలిసి'కాశీ అమర్‌నాథ్', 'నిర్హువా చలాల్ లండన్' వంటి సినిమాల్లో సప్నా గిల్ నటించింది. ఆమెకు ఇంకా అంత మంచి పేరు రాలేదు. అయితే పృథ్వీ షాతో వివాదాల కారణంగా సప్నా గిల్ వెలుగులోకి వచ్చింది.

పృథ్వీ షా, సప్నా గిల్ సెల్ఫీ కేసు ఏంటి?
భారత క్రికెటర్ పృథ్వీ షా ఓ యువతితో వాగ్వాదానికి దిగాడు. ముంబైలోని ఓ హోటల్ బయట ఈ ఘటన చోటుచేసుకుంది. సెల్ఫీ తీసుకోవడంపైనే ఈ వాదన జరిగినట్లు తెలుస్తోంది. పృథ్వీ షాతో సెల్ఫీ దిగుతుండగా తోపులాట జరిగినట్లు సమాచారం.

మీడియా నివేదికల ప్రకారం ఈ సంఘటన జోగేశ్వరి లింక్ రోడ్‌లోని లోటస్ పెట్రోల్ పంప్ సమీపంలో జరిగినట్లు సమాచారం. పృథ్వీ షా స్నేహితుడు తెలిపిన వివరాల ప్రకారం ఓ హోటల్‌లో పార్టీ చేసుకుంటూ సెల్ఫీ తీసుకునే విషయంలో పృథ్వీ షా వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత పృథ్వీ షా హోటల్ నుంచి కారులో ఇంటికి వెళ్తున్నాడు. పృథ్వీ షా స్నేహితుడి కారులో ఉన్నాడని భావించిన బంధువులు, యువతి, ఆమె స్నేహితులు కలిసి వారంతా వేరే కారుపై దాడి చేశారు.

అనంతరం యువతికి, పృథ్వీకి మధ్య వాగ్వాదం జరిగినట్లు మరో వీడియో బయటకు వచ్చింది. ఈ ఘటనపై పృథ్వీ స్నేహితులు ఓషివారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంబంధిత యువతి, ఇతరులపై కేసు నమోదు చేశారు. సప్నా గిల్‌తో పాటు మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. విచారణలో నిజానిజాలు బయటకు వస్తాయని పోలీసులు అంటున్నారు.

Published at : 18 Feb 2023 07:25 PM (IST) Tags: Prithvi Shaw Viral Video Social media Prithvi Shaw Video Prithvi Shaw selfie Prithvi Shaw fight

సంబంధిత కథనాలు

IPL: ఐపీఎల్‌లో కొత్త రూల్స్- ఈ సీజన్ నుంచే అమలు- అవేంటంటే..!

IPL: ఐపీఎల్‌లో కొత్త రూల్స్- ఈ సీజన్ నుంచే అమలు- అవేంటంటే..!

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!

IND Vs AUS 3rd ODI: లక్ష్యం దిశగా సాగుతున్న టీమిండియా - మంచి టచ్‌లో కింగ్, కేఎల్!

IND Vs AUS 3rd ODI: లక్ష్యం దిశగా సాగుతున్న టీమిండియా - మంచి టచ్‌లో కింగ్, కేఎల్!

IND Vs AUS 3rd ODI: సమిష్టిగా రాణించిన ఆస్ట్రేలియా బ్యాటర్లు - ఒక్క అర్థ సెంచరీ లేకపోయినా 260కి పైగా!

IND Vs AUS 3rd ODI: సమిష్టిగా రాణించిన ఆస్ట్రేలియా బ్యాటర్లు - ఒక్క అర్థ సెంచరీ లేకపోయినా 260కి పైగా!

IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?

IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?

టాప్ స్టోరీస్

గంటా శ్రీనివాసరావు ఓటేస్తారా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరగబోయేదేంటీ?

గంటా శ్రీనివాసరావు ఓటేస్తారా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరగబోయేదేంటీ?

KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ

KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య

Stocks to watch 23 March 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - HAL, Heroపై ఓ కన్నేయండి

Stocks to watch 23 March 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - HAL, Heroపై ఓ కన్నేయండి