Paralympics Opening Ceremony: అట్టహాసంగా పారాలింపిక్స్ ఆరంభ వేడుకలు... భారత పతాకధారిగా టెక్ చంద్
జపాన్ రాజధాని టోక్యోలో 16వ పారాలింపిక్స్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది.
జపాన్ రాజధాని టోక్యోలో 16వ పారాలింపిక్స్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రపంచం నలుమూలల నుంచి 4500 మంది పారా అథ్లెట్లు ఈ విశ్వ క్రీడల్లో సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. భారత్ నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద జట్టుతో బరిలోకి దిగుతోంది. 54 మంది భారత అథ్లెట్లు ఈ క్రీడల్లో పాల్గొన్నారు. ఇప్పటి వరకు భారత్ పారాలింపిక్స్‌లో 12 పతకాలు గెలిచింది. ఈ సారి టోక్యో ఒలింపిక్స్‌లో రెండంకెల సంఖ్యలో పతకాలు సాధిస్తారని అంచనాలున్నాయి. సెప్టెంబరు 5 వరకు ఈ పోటీలు జరుగుతాయి.
❤️💙💚#Tokyo2020 #Paralympics pic.twitter.com/zDmF4UUuKp
— #Tokyo2020 for India (@Tokyo2020hi) August 24, 2021
పతాకధారిగా టెక్ చంద్
పారాలింపిక్స్ ఆరంభ వేడుకల్లో మువ్వెన్నల పతాకాన్ని టెక్ చంద్ చేతపట్టి భారత జట్టును ముందుండి నడిపించాడు. ముందుగా భారత పతాకధారిగా రియో పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన మరియప్పన్ తంగవేలును ఎంచుకున్నారు. మరియప్పన్ టోక్యోకు వెళ్లేటప్పుడు అతడు ప్రయాణించిన విమానంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతడితో సన్నిహితంగా మెలిగిన మరియప్పన్ తో పాటు మరో నలుగురు భారత అథ్లెట్లను క్వారంటైన్‌కి పంపారు. దీంతో పతాకధారి అవకాశం టెక్ చంద్‌కి దక్కింది.
The Indian contingent is here, led by Javelin maestro Tek Chand 🙌#TeamIndia #Paralympics #UnitedByEmotion #OpeningCeremony pic.twitter.com/hurSAzBnOA
— #Tokyo2020 for India (@Tokyo2020hi) August 24, 2021
ప్రారంభ వేడుకలను వీక్షించిన మోదీ
టోక్యో పారాలింపిక్స్ ప్రత్యక్ష ప్రసార వేడుకలను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీక్షించారు. భారత జట్టు వచ్చినప్పుడు మోదీ నిలబడి చప్పట్లు కొడుతూ ప్రోత్సహించారు. ఈ వీడియోను మోదీ ట్విటర్ ద్వారా పంచుకున్నారు.
Best of luck India!
— Narendra Modi (@narendramodi) August 24, 2021
I am sure our #Paralympics contingent will give their best and inspire others. pic.twitter.com/XEXXp4EzFc
* పారాలింపిక్స్‌లో చైనాదే ఆధిపత్యం. 2004 నుంచి అత్యధిక స్వర్ణాలు గెలుస్తున్న దేశం చైనానే.
* 2004లో 63 స్వర్ణాలు నెగ్గిన చైనా 2008లో 89, 2012లో 95, 2016లో 107 పసిడి పతకాలు నెగ్గింది.
* ఈసారి పారాలింపిక్స్‌లో 163 దేశాల నుంచి 4500 అథ్లెట్లు పోటీ పడుతున్నారు.
* 22 క్రీడల్లో 540 పతక ఈవెంట్లున్నాయి.
* పారాలింపిక్స్‌ను రెండోసారి నిర్వహిస్తోన్న తొలి నగరం టోక్యో. 1964లో అక్కడ ఈ క్రీడలు జరిగాయి.
* 1960లో రోమ్‌లో తొలిసారి పారాలింపిక్స్‌ను నిర్వహించారు.
* అప్పుడు 23 దేశాల నుంచి 400 మంది అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు.
* 1988 నుంచి ఒలింపిక్స్, పారాలింపిక్స్‌ను ఒకే వేదికలో నిర్వహిస్తున్నారు.