Tokyo Olympics 2020: టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు ఏం ఫుడ్ తింటున్నారు?
ప్రతిష్టాత్మక Tokyo Olympics భారత ఆటగాళ్లకు ఎలాంటి ఫుడ్ ఇస్తున్నారు? ఏమి తింటున్నారు? అనే దానిపై అందరికీ ఆసక్తే.
క్రీడాకారులు ఫిట్‌నెస్‌కి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అందరికీ తెలిసిందే. అందుకే వారు టోర్నీల కోసం ఎక్కడికి వెళ్లినా వాళ్ల కోసం స్పెషల్ మెనూ ఉంటుంది. రోజుకి ఎన్ని క్యాలరీలు తీసుకోవాలి? ఎన్ని క్యాలరీలు బర్న్ చేయాలి? ఇలా ప్రతీది లెక్కే.
ఇప్పుడు ఇదంతా ఎందుకంటే... ప్రతిష్టాత్మక Tokyo Olympics భారత ఆటగాళ్లకు ఎలాంటి ఫుడ్ ఇస్తున్నారు? ఏమి తింటున్నారు? అనే దానిపై అందరికీ ఆసక్తే. అంతేకాదు, గతంలో పలు టోర్నీల్లో మన ఆటగాళ్లు సరైన ఫుడ్ అందక అవస్థలుపడ్డారు. దీనిపై ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేసిన రోజులు ఉన్నాయి.
2018లో జకార్తా ఏషియన్ గేమ్స్‌లో భారత టెన్నిస్ ఆటగాడు ఆచంట శరత్ కమల్ సరైన ఫుడ్ దొరక్క చాలా ఇబ్బందిపడ్డాడు. మూడు గంటల మ్యాచ్ అనంతరం తన రూమ్‌కి వెళ్లగా తినేందుకు Bread, nutella and muesli మాత్రమే ఉందని తన ఆవేదనను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇదొక్కటే కాదు, 2008 బీజింగ్, 2012 లండన్, 2016 రియో ఒలింపిక్స్‌లో కూడా క్రీడా గ్రామాల్లో మన అథ్లెట్లకు సరైన భోజనం దొరకలేదు. అందుకే ఈ సారి ఎవరూ ఫుడ్ కోసం ఇబ్బంది పడకూడదని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
నార్త్ ఇండియన్ ఫుడ్‌ని మన భారత క్రీడాకారుల మోనూల చేర్చారు. చోలే బటూరా, బట్టర్ నాన్, ప్లేన్ నాన్, పరోటా, బట్టర్ చికెన్, సోయా పనీర్, టమాటా, బెండకాయ, బిర్యానీ, ఉడకబెట్టిన పాలకూర, చిలకడ దుంపలు, బాస్మతీ రైస్, జాస్మిన్ రైస్, చీజ్ తదితర వంటకాలను మన భారత అథ్లెట్ల కోసం సిద్ధం చేశారు. ఎనర్జీ, కార్బొహైడ్రేడ్స్, సోడియం, ఉప్పు, ప్రొటీన్, కొవ్వు ఇలా అన్ని న్యూట్రిషన్ విలువలున్న వాటినే ఎంచుకున్నారు.
‘క్రీడా గ్రామంలో ఏర్పాట్లు బాగున్నాయని, ఫుడ్ క్వాలిటీ కూడా బాగుంది ఫుడ్ మెనూని చూసి ఆటగాళ్లు కూడా సంతోషం వ్యక్తం చేశారు’ అని భారత అధికారి ప్రేమ్ వర్మ వెల్లడించారు. గతంలో బీజింగ్ ఒలింపిక్స్ సమయంలో పతక విజేత సుశీల్ కుమార్ మన ఫుడ్ అందుబాటులో లేక ready-to-eat ఫుడ్‌తో పాటు డ్రై ఫ్రూట్స్ వెంట తెచ్చుకున్నాడు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని, ఆటగాళ్ల డైట్ ప్రకారం మెనూ సిద్ధం చేసినట్లు వర్మ తెలిపారు.
రియో ఒలింపిక్స్‌లో 119 మంది భారత అథెట్లు పాల్గొన్నారు. వీరిలో 67 మంది పురుషులు, 52 మంది మహిళలు ఉన్నారు. ఈ ఒలింపిక్స్‌లో మన ఆటగాళ్లు ఎన్ని పతకాలు గెలుస్తారో తెలియాలంటే కొద్ది రోజులు వేచి ఉండాల్సిందే. ఇప్పటికే క్రీడా గ్రామం చేరుకున్న మన ఆటగాళ్లు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేశారు.