By : ABP Desam | Updated: 01 Aug 2021 05:42 PM (IST)
రెండో సెట్‌లో సింధు 11-8తో బ్రేక్ తీసుకుంది. రెండో సెట్ కోసం ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు.
కాంస్య పోరులో సింధుXబింగ్జియావో పోరు హోరాహొరీగా సాగుతోంది. తొలి సెట్ ను బింగ్జియావో కోల్పోయింది. దీంతో రెండోసెట్ ఆధిపత్యం కోసం ప్రత్యర్థి పోరాడుతోంది.
కాంస్య పోరులో సింధు... ప్రత్యర్థి బింగ్జియావో అనవసర తప్పిదాలు చేస్తోంది. దీంతో పాయింట్లు సమర్పించుకుంటోంది.
కాంస్యం కోసం జరుగుతోన్న పోరులో పీవీ సింధు తొలి సెట్‌ను 21-13తో కైవసం చేసుకుంది.
తొలి సెట్లో సింధు 11- 8తో బ్రేక్ తీసుకుంది. ప్రస్తుతానికి ప్రత్యర్థిపై సింధుదే పైచేయి
ఒలింపిక్స్ క్వార్టర్‌లో భారత బాక్సర్ నిరాశపరిచాడు. 91 కిలోల విభాగంలో ఉజ్బెకిస్థాన్ బాక్సర్ జలొలోవ్ చేతిలో 5-0 తేడాతో సతీశ్ ఓడిపోయాడు.
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం కోసం చైనా క్రీడాకారిణి హి బింగ్జియావోతో ఆదివారం తలపడనుంది.
సెమీఫైనల్లో పీవీ సింధు పరాజయం పాలైంది. మాజీ నెంబర్ తై జు యింగ్ పై సింధు రెండు వరుస సెట్లలో ఓడింది.
సింధు X తైజు యింగ్ వీరిద్దరూ చివరిసారిగా దిల్లీలో జరిగిన BWF ప్రపంచ టూర్ ఫైనల్స్ - 2020లో తలపడ్డారు. ఈ మ్యాచ్లో సింధు 21-19, 12-21, 17-21 తేడాతో ఓడిపోయింది.
టోక్యో ఒలింపిక్స్‌లో సింధు ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో వరుసగా రెండు సెట్లలో విజయం సాధించింది.
టోక్యో ఒలింపిక్స్ మరో 8 రోజుల్లో ముగియనుండటంతో పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. భారత క్రీడాకాభిమానుల కోసం ఆసక్తికరమైన పోరు సిద్ధమైంది. మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ పోరు సెమీఫైనల్ చేరింది. ఇందులో భాగంగా శనివారం సింధు... మాజీ నంబర్ వన్, చైనీస్ తైపీ క్రీడాకారిణి తై జు యింగ్‌తో తలపడనుంది. ఇప్పటి వరకు వీరిద్దరూ 18 మ్యాచుల్లో తలపడ్డారు. అందులో 15 సార్లు తైజుదే పైచేయి. కేవలం 3 సార్లు మాత్రమే సింధు విజయం సాధించింది. మరి, ఈ రోజు మ్యాచ్లో విజయం ఎవరిది?
APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు
Extra Ordinary Man X Review - 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ఆడియన్స్ రివ్యూ: 'దిల్' రాజునూ వాడేసిన నితిన్ - ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?
Vizag Pawan Kalyan : ఏపీ భవిష్యత్ కోసమే టీడీపీ, జనసేన కూటమి - విశాఖలో పవన్ కీలక వ్యాఖ్యలు !
Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?
/body>