News
News
X

Shoaib Akhtar: 20 సంవత్సరాల నుంచి సేఫ్‌గా ఉన్న షోయబ్ రికార్డు - దగ్గరగా వచ్చింది వీరే - ఉమ్రాన్ వల్ల అవుతుందా?

ప్రపంచ క్రికెట్‌లో షోయబ్ అక్తర్ వేగవంతమైన బంతి రికార్డు ఇంతవరకు బద్దలు కాలేదు.

FOLLOW US: 
Share:

World Top Fastest Ball: ప్రపంచ క్రికెట్‌లో ఆటగాళ్ల రికార్డులు, వారి బెస్ట్ పెర్ఫార్మెన్స్‌ల గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇందులో పాక్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ పేరిట ఇప్పటికీ ఒక బద్దలు కాని రికార్డు ఉంది. ఇంగ్లండ్‌తో జరిగిన 2003 వన్డే ప్రపంచకప్‌లో షోయబ్ అక్తర్ గంటకు 161.3 కిలోమీటర్ల వేగంతో బంతిని వేశాడు. షోయబ్ అక్తర్ సాధించిన ఈ రికార్డును ఇప్పటికీ ఏ బౌలర్ కూడా బద్దలు కొట్టలేకపోయాడు.

ప్రపంచ క్రికెట్‌లోని ఫాస్ట్ బౌలర్లలో షోయబ్ అక్తర్ ఎప్పుడూ ముందంజలో ఉంటాడు. అతనితో పాటు ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటివరకు చాలా మంది బౌలర్లు కనిపించారు. వారు కచ్చితంగా తమ వేగంతో అందరినీ ఆకట్టుకున్నారు కానీ షోయబ్ అక్తర్ రికార్డును బద్దలు కొట్టలేకపోయారు. దీని తరువాత షోయబ్ అక్తర్ సాధించిన ఈ రికార్డును బద్దలు కొట్టడానికి చాలా దగ్గరగా వచ్చిన అలాంటి ఐదుగురు బౌలర్ల గురించి తెలుసుకుందాం.

1. షాన్ టెయిట్ (161.1)
ఆస్ట్రేలియన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షాన్ టైట్ ఆడుతున్న రోజుల్లో ఫాస్టెస్ట్ బౌలర్‌గా అందరూ పరిగణించారు. 2010లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో షాన్ టెయిట్ వేసిన ఒక బంతి వేగం గంటకు 161.1 కిలోమీటర్లుగా ఉంది. షాన్ టెయిట్ కెరీర్ గురించి చెప్పాంటే అతను ఎక్కువ కాలం క్రికెట్‌లో కొనసాగలేదు. అతను కేవలం 21 టీ20 మ్యాచ్‌లు, మూడు టెస్టు మ్యాచ్‌లు, 35 వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.

2. బ్రెట్ లీ (161.1)
ప్రపంచ క్రికెట్‌లో విజయవంతమైన ఫాస్ట్ బౌలర్లలో ఒకరైన మాజీ కంగారూ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ బంతులను ఎదుర్కోవడం ఏ బ్యాట్స్‌మెన్‌కు అంత తేలికైన పని కాదు. 2005లో నేపియర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రెట్ లీ 161.1 కిలోమీటర్ల వేగంతో బంతిని వేశాడు.

3. మిచెల్ స్టార్క్ (160.4)
ప్రస్తుతం మిచెల్ స్టార్క్ ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్‌గా ఉన్నాడు. అతని బంతుల వేగాన్ని ఎదుర్కోవడం బ్యాట్స్‌మన్‌కి అంత ఈజీ టాస్క్ కాదు. 2015లో పెర్త్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ గంటకు 160.4 కిలోమీటర్ల వేగంతో బంతిని వేశాడు.

4. ఫిడేల్ ఎడ్వర్డ్స్ (157.7)
వెస్టిండీస్ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఫిడేల్ ఎడ్వర్డ్స్ కూడా ఉంటాడు. 2003లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఫిడేల్ ఎడ్వర్డ్స్ గంటకు 157.7 కిలోమీటర్ల వేగంతో బంతిని వేశాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇది నాలుగో అత్యంత వేగవంతమైన బంతి.

5. మిచెల్ జాన్సన్ (156.8)
ప్రపంచ క్రికెట్‌లో మిచెల్ జాన్సన్ పేస్ స్పష్టంగా కనిపించే విషయం ఇది. 2013లో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మిషెల్ జాన్సన్ వేసిన ఒక బంతి గంటకు ఏకంగా 156.8 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయింది.

ప్రస్తుతం ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉన్న ఆటగాళ్లు ప్రపంచ క్రికెట్‌లో ముగ్గురే ఉన్నారు. వీరిలో ఒకరు భారత బౌలర్ ఉమ్రాన్ మాలిక్. కెరీర్ ప్రారంభంలోనే ఐపీఎల్‌లో 157 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు. దీంతో పాటు దక్షిణాఫ్రికాకు చెందిన ఆన్రిచ్ నోర్జే, న్యూజిలాండ్‌కు చెందిన లోకీ ఫెర్గూసన్‌లకు కూడా ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ఆడుతున్న యువ బౌలర్లలో అత్యంత వేగవంతమైన బౌలర్లు వీరే.

Published at : 28 Feb 2023 01:53 AM (IST) Tags: Shoaib Akhtar Mitchell Starc Brett Lee Shaun Tait Fidel Edwards Fastest Bowler in the World World Fastest Bowlers

సంబంధిత కథనాలు

Indore Stadium Pitch Rating: బీసీసీఐ అప్పీల్‌ - ఇండోర్‌ పిచ్‌ రేటింగ్‌ను మార్చిన ఐసీసీ!

Indore Stadium Pitch Rating: బీసీసీఐ అప్పీల్‌ - ఇండోర్‌ పిచ్‌ రేటింగ్‌ను మార్చిన ఐసీసీ!

WPL: ముంబైకి భారీ ప్రైజ్ మనీ.. పాకిస్తాన్ సూపర్ లీగ్ కంటే డబుల్

WPL: ముంబైకి భారీ ప్రైజ్ మనీ.. పాకిస్తాన్ సూపర్ లీగ్ కంటే డబుల్

అఫ్గాన్ అదుర్స్- పసికూన చేతిలో పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్..

అఫ్గాన్ అదుర్స్- పసికూన చేతిలో పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్..

ఢిల్లీ కెప్టెన్‌గా వార్నర్.. అక్షర్ పటేల్‌కు వైస్ కెప్టెన్సీ

ఢిల్లీ కెప్టెన్‌గా వార్నర్.. అక్షర్ పటేల్‌కు వైస్ కెప్టెన్సీ

BCCI Central Contracts: బీసీసీఐ కాంట్రాక్ట్స్‌ - జడ్డూకు ప్రమోషన్.. రాహుల్‌కు డిమోషన్

BCCI Central Contracts: బీసీసీఐ కాంట్రాక్ట్స్‌ - జడ్డూకు ప్రమోషన్.. రాహుల్‌కు డిమోషన్

టాప్ స్టోరీస్

KTR Convoy: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ - కాన్వాయ్ ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు, ఉద్రిక్తత

KTR Convoy: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ - కాన్వాయ్ ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు, ఉద్రిక్తత

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్!

Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్!

CM KCRకు బండి సంజయ్ లేఖ- విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్

CM KCRకు బండి సంజయ్ లేఖ-  విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్