Thailand Open 2022: అకానె యమగూచికి షాకిచ్చిన సింధు - ఒలింపిక్ విజేతతో తర్వాతి పోరు!
Thailand Open 2022: పీవీ సింధు థాయ్‌ల్యాండ్ ఓపెన్ 2022లో సెమీ ఫైనల్ చేరుకుంది. క్వార్టర్ ఫైనల్లో అకానె యమగూచి (జపాన్)పై అద్భుత విజయం అందుకుంది.
Thailand Open 2022: PV Sindhu storms into semi-finals, defeats Japan's Akane Yamaguchi : రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు థాయ్‌ల్యాండ్ ఓపెన్ 2022లో సెమీ ఫైనల్ చేరుకుంది. థాయ్‌ల్యాండ్‌లో జరిగిన క్వార్టర్ ఫైనల్లో కఠిన ప్రత్యర్థి అకానె యమగూచి (జపాన్)పై అద్భుత విజయం అందుకుంది. 21-15, 20-22, 21-13 తేడాతో ప్రత్యర్థిని మట్టికరిపించింది.
SUPER SINDHU 🙇♂️👑@Pvsindhu1 enters semifinals of #ThailandOpen2022 in style after defeating reigning world champion 🇯🇵's Akane Yamaguchi 21-15, 20-22, 21-13 in the quarter finals 😍
— BAI Media (@BAI_Media) May 20, 2022
Well done champ! 👏#BWFWorldTour#IndiaontheRise#Badminton pic.twitter.com/084Y0lp9NU
మొదటి గేమ్‌లో సింధు 21-15తో ఆధిపత్యం చెలాయించింది. కానీ రెండో గేమ్‌లో యమగూచి పుంజుకుంది. 20-22తో సింధును వెనక్కి నెట్టేసింది. దాంతో నిర్ణయాత్మక మూడో గేమ్‌లో తెలుగు తేజం అద్భుతంగా ఆడింది. బలమైన క్రాస్ కోర్టు షాట్లు, స్మాష్‌లతో విరుచుకుపడింది. 21-15 తేడాతో గేమ్‌తో పాటు మ్యాచును గెలిచేసింది. సెమీ ఫైనల్లో సింధు మరో కఠిన ప్రత్యర్థిని ఎదుర్కోవాల్సి ఉంది. ఒలింపిక్ స్వర్ణ పతక విజేత చెన్ యూఫీతో తలపడాల్సి ఉంది.
Also Read: MI vs DC మ్యాచుకు కోహ్లీ! దగ్గరుండి రోహిత్‌ను ప్రోత్సహిస్తాడట!
Also Read: మాంత్రికుడి ప్రాణం చిలకలో! RCB, DC ప్రాణాలు ముంబయి చేతిలో!!
అంతకు ముందు గురువారం దక్షిణ కొరియాకు షట్లర్ యూ జిన్ సిమ్‌ను సింధు ఓడించింది. కాగా భారత మరో షట్లర్ మాలవిక బన్సోడ్ 16-21, 21-14, 21-14 తేడాతో ఓటమి చవిచూసింది. డెన్మార్క్ అమ్మాయి క్రిస్టోఫెర్సెన్ ఆమెపై గెలిచింది.
SINDHU DEFEATS YAMAGUCHI
— IndiaSportsHub (@IndiaSportsHub) May 20, 2022
Star shuttler @Pvsindhu1 has entered SemiFinals courtesy to the three game win against Yamaguchi.
💥Akane 🇯🇵 is World Number 1
💥Sindhu scored 14th victory over her
💥Meets Yu Fei Chen 🇨🇳 Next
👉She is the only Indian hope left in #ThailandOpen2022 pic.twitter.com/vsLgeaK7tb