India vs Australia: 52 సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రమే - ఈసారైనా సాధించాలని ఆస్ట్రేలియా కల!
ఆస్ట్రేలియా జట్టు గత 52 సంవత్సరాల్లో భారత్‌లో కేవలం ఒక్కసారి మాత్రమే సిరీస్‌లో విజయం సాధించింది.
India vs Australia Test Series 2023: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు వచ్చే నెలలో టెస్ట్ సిరీస్ ఆడేందుకు ఐదు సంవత్సరాల తర్వాత భారత్‌ను సందర్శించనుంది. ఈ సిరీస్‌లో కంగారూ జట్టు భారత గడ్డపై నాలుగు టెస్టు మ్యాచ్‌లను ఆడనుంది.
ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఇరు దేశాల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ నాగ్‌పూర్‌లో జరగనుంది. భారత పర్యటనలో టెస్టు సిరీస్‌ను గెలవాలని ఆస్ట్రేలియా జట్టు చాలా కాలంగా తహతహలాడుతోంది. ఈసారి స్వదేశంలో భారత్‌ను ఓడించడమే కంగారూ జట్టు కల.
చాలా మంది ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్లు కూడా చాలా కాలంగా భారత్‌లో ఆస్ట్రేలియా విజయాన్ని కోరుకుంటున్నారు. అయితే గత 54 సంవత్సరాల్లో భారత్‌లో ఆస్ట్రేలియా ఒక్కసారి మాత్రమే టెస్టు సిరీస్‌ను గెలుచుకోగలిగిందన్నది గణాంకాలు చెబుతున్న నిజం. అంతేకాదు గత 14 ఏళ్లలో భారత్‌లో కంగారూ జట్టు కేవలం ఒక్క టెస్టు మాత్రమే గెలిచింది.
52 సంవత్సరాల్లో కేవలం ఒక్క సారి మాత్రమే...
1956 - 57లో ఆస్ట్రేలియా తొలిసారిగా భారత్‌లో టెస్టు సిరీస్ ఆడింది. ఇందులో పర్యాటక జట్టు 2-0తో భారత్‌ను ఓడించింది. అప్పటి నుంచి 13 ఏళ్ల పాటు భారత గడ్డపై ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయించింది. ఈ సమయంలో కంగారూలు భారతదేశంలో జరిగిన నాలుగింటిలో మూడు టెస్ట్ సిరీస్‌లను గెలుచుకున్నారు, ఒకటి డ్రాగా ముగిసింది.
1970లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన తర్వాత భారత్ గుణపాఠం నేర్చుకుంది. ఆ తర్వాత టీమ్ ఇండియా పాచిక పడింది. 1979-80లో మరోసారి ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఆ సమయంలో టెస్ట్ సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో విజయం సాధించింది. 1986-87 సిరీస్ డ్రా అయింది.
ఆ తర్వాత 1996 నుంచి 2001 వరకు భారత్ తన సొంతగడ్డపై ప్రతిసారి ఆస్ట్రేలియాను ఓడించింది. అదే సమయంలో 2004-05లో ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌ని కైవసం చేసుకుంది. అయితే దీని తర్వాత 2008 - 09, 2010 - 11, 2012-13, మరియు 2016-17 టెస్ట్ సిరీస్‌లలో భారత్ వరుసగా నాలుగుసార్లు ఆస్ట్రేలియాను మన దేశంలో ఓడించింది. ఈ విధంగా గత 52 ఏళ్లలో చూస్తే భారత్‌లో ఒక్కసారి మాత్రమే టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకోవడంలో కంగారూ జట్టు విజయం సాధించింది.
14 ఏళ్లలో ఒకే ఒక్క టెస్టు
ఆస్ట్రేలియా గత నాలుగు భారత పర్యటనలను పరిశీలిస్తే, వారి ప్రదర్శన మరీ తీసికట్టుగా ఉంది. గత 14 ఏళ్లలో భారత పర్యటనలో ఆస్ట్రేలియా 14 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో కంగారూ జట్టు ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలవగలిగింది. 2016-17లో ఇండియా టూర్‌లో పుణె టెస్టులో విజయం సాధించాడు. ఆ టెస్టులో ఆస్ట్రేలియా 333 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది.
2008-09 నుంచి 2016-17 వరకు ఆస్ట్రేలియా జట్టు భారత గడ్డపై వరుసగా నాలుగు టెస్టు సిరీస్‌లను కోల్పోయింది. భారత పర్యటనలో ఈసారి కూడా కంగారూ జట్టు బాట అంత సులువు కాదని టీమ్ ఇండియా పటిష్ట రికార్డు తెలియజేస్తోంది. భారత బౌలర్లు, బ్యాట్స్‌మెన్‌లు కంగారూలకు గట్టి పరీక్ష పెడతారు. ఈసారి కూడా రోహిత్ సేనపై గెలవడం కంగారూలకు అంత సులభం కాదు.