Suryakumar Yadav: టీ20ల్లో టాప్ - వన్డేల్లో ఫ్లాప్ - సూర్యకుమార్ షో ఎక్కడ?
అంతర్జాతీయ వన్డే క్రికెట్లో సూర్యకుమార్ యాదవ్ ఫ్లాప్ షో కొనసాగుతూనే ఉంది.
Suryakumar Yadav Flop Show: భారత బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం టీ20 ఇంటర్నేషనల్‌లో నంబర్ వన్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ టీ20 ర్యాంకింగ్స్‌లో చాలా కాలంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ, వన్డేల్లో అతని ఫామ్ అంతంత మాత్రంగానే ఉంది. ఎందుకో తెలీదు కానీ, సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో కంటిన్యూగా ఫ్లాప్ అవుతున్నాడు. చివరి 10 వన్డే ఇన్నింగ్స్‌లలో సూర్యకుమార్ యాదవ్ గణాంకాలు షాకింగ్‌గా ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్‌ల్లో రెండుసార్లు ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. గత 10 ఇన్నింగ్స్‌ల్లో అతని బ్యాట్ నుంచి ఒక్క అర్ధ సెంచరీ కూడా రాలేదు.
గత 10 ఇన్నింగ్స్‌ల గణాంకాలు ఇలా ఉన్నాయి
గత 10 వన్డే ఇన్నింగ్స్‌లలో సూర్యకుమార్ యాదవ్ అత్యధిక స్కోరు 34 నాటౌట్. ఈ 10 ఇన్నింగ్స్‌ల్లో సూర్యకుమార్ ఖాతా తెరవకుండానే రెండుసార్లు పెవిలియన్‌కు చేరడంతో పాటు ఏడు సార్లు రెండంకెల స్కోరును కూడా దాటలేకపోయాడు.
వెస్టిండీస్‌పై - 09 పరుగులు.
వెస్టిండీస్‌పై - 08 పరుగులు.
న్యూజిలాండ్‌పై - 04 పరుగులు.
న్యూజిలాండ్‌పై - 34 పరుగులు.
న్యూజిలాండ్‌పై - 6 పరుగులు.
శ్రీలంకపై - 4 పరుగులు.
న్యూజిలాండ్‌పై - 31 పరుగులు.
న్యూజిలాండ్‌పై - 14 పరుగులు.
ఆస్ట్రేలియాపై - 0 పరుగులు.
ఆస్ట్రేలియాపై - 0 పరుగులు.
ఇంటర్నేషనల్ కెరీర్ ఎలా సాగింది?
సూర్యకుమార్ యాదవ్ 2021 మార్చి 14వ తేదీన ఇంగ్లాండ్‌తో జరిగిన T20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి అతను టీమ్ ఇండియా కోసం ఒక టెస్ట్, 22 వన్డే మ్యాచ్‌లు, 48 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడాడు. ఇప్పటివరకు అతను ఆడిన ఏకైక టెస్టులో ఎనిమిది పరుగులు చేశాడు.
వన్డేల్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతను 25.47 సగటుతో 433 పరుగులు చేశాడు. ఇందులో అతను రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. ఇది కాకుండా అతను ఇప్పటివరకు టీ20 ఇంటర్నేషనల్స్‌లో 46.52 సగటు, 175.76 స్ట్రైక్ రేట్‌తో 1675 పరుగులు చేశాడు. ఇందులో అతను మూడు సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు సాధించాడు. వన్డేల్లో నిరంతర పేలవమైన ఫామ్ అతనికి సమస్యగా మారింది.
2022లో భారత్ తరఫున అంతర్జాతీయ టీ20లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన బ్యాట్స్‌మెన్, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ పేర్లు ఎవరో తెలుసా? భారత్ తరఫున స్టైలిష్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ టీ20లో అత్యధిక పరుగులు చేయగా, వికెట్లు తీయడంలో భువనేశ్వర్ కుమార్ ముందు వరుసలో ఉన్నాడు.
టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ 2022 సంవత్సరంలో 31 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో 1164 పరుగులు చేశాడు. ఈ సమయంలో సూర్యకుమార్ యాదవ్ సగటు 46.56 కాగా స్ట్రైక్ రేట్ 187.43గా ఉంది. సూర్యకుమార్ యాదవ్ ఈ ఏడాది రెండు సెంచరీలతో పాటు తొమ్మిది సార్లు అర్థ సెంచరీలు చేశాడు. టీ20 ఫార్మాట్‌లో ఏడాది వ్యవధిలో 1000 పరుగులు చేసిన మొదటి భారత బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవే. ప్రపంచంలో ఈ రికార్డు సాధించిన రెండో బ్యాటర్ కూడా సూర్యనే.
ఈ ఏడాది టీ20 ఇంటర్నేషనల్‌లో టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 32 మ్యాచ్‌లు ఆడిన భువీ 19.56 సగటుతో 37 వికెట్లు తీశాడు. భువనేశ్వర్ తన బౌలింగ్‌లో తక్కువ పరుగులు ఇస్తూ ఉంటాడు. అదే బౌలింగ్ 2022లో కూడా కనిపించింది. 2022 సంవత్సరంలో T20 ఇంటర్నేషనల్‌లో కేవలం 6.98 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. అదే సమయంలో 4 పరుగులకు 5 వికెట్లు తీసి అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు కూడా నమోదు చేశాడు.