T20 WC Winning Prize: టీ20 ప్రపంచకప్ విజేతకు ఎంత డబ్బిస్తారో తెలుసా? ప్రైజ్‌మనీ ప్రకటించిన ఐసీసీ
ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీ ప్రైజ్‌మనీ ప్రకటించారు. విజేతకు 1.6 మిలియన్ డాలర్లు (రూ.12 కోట్లు) ఇవ్వనున్నారు. ఇక రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 8 లక్షల డాలర్లు (రూ.6 కోట్లు) అందిస్తారు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ టోర్నీ ప్రైజ్‌మనీ ప్రకటించారు. విజేతగా ఆవిర్భవించిన జట్టుకు 1.6 మిలియన్ డాలర్లు (రూ.12 కోట్లు) ఇవ్వనున్నారు. ఇక రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 8 లక్షల డాలర్లు (రూ.6 కోట్లు) అందిస్తారు. సెమీ ఫైనల్లో ఓటమి పాలైన రెండు జట్లకు చెరో నాలుగు లక్షల డాలర్లు అంటే రూ.3 కోట్ల వరకు వస్తుంది. మొత్తం ఈ మెగాటోర్నీలో పాల్గొంటున్న 16 జట్లు 5.6 మిలియన్ డాలర్లను పంచుకోనున్నాయి.
Also Read: ఆడకున్నా.. అతడిని ఆడిస్తేనే చెన్నైకి మంచిది: సునిల్ గావస్కర్
ఇక సూపర్ 12 దశలో మ్యాచులు గెలిచిన ప్రతి జట్టుకు బోనస్ రూపంలో కొంత మొత్తాన్ని ఐసీసీ చెల్లించనుంది. అంటే ఈ దశలో 30 మ్యాచులు జరుగుతాయి. గెలిచిన ప్రతి జట్టుకు మ్యాచుకు 40వేల డాలర్లు అంటే రూ.30 లక్షల వరకు వస్తుంది. ఈ రౌండ్ కోసం మొత్తం 12 లక్షల డాలర్లను ఖర్చు పెట్టనున్నారు.
Also Read: టీ20 ప్రపంచకప్ నిబంధనల్లో మార్పులు.. తొలిసారి డీఆర్‌ఎస్
సూపర్ 12 దశలోంచి వెళ్లిపోయిన ప్రతి జట్టుకు 70వేల డాలర్లను ఐసీసీ ముట్టచెప్పనుంది. వెళ్లిపోయే వారి కోసం మొత్తంగా 560000 డాలర్లను ఖర్చు చేస్తున్నారు. రౌండ్ వన్‌లోనూ ఇదే విధంగా చెల్లింపులు ఉంటాయి. ఈ దశలో మొత్తం 12 మ్యాచులు జరుగుతాయి. గెలిచిన ప్రతి జట్టుకు 40,000 డాలర్లను చెల్లిస్తారు. ఇందుకు గాను మొత్తం 4,80,000 డాలర్లను కేటాయించారు. ఇదే రౌండ్లో వెనుదిరిగిన ఒక్కో జట్టుకు 40వేల డాలర్లను అందజేస్తారు.
Also Read: ఢిల్లీతో చెన్నై ఢీ.. మొదటి ఫైనల్ బెర్త్ ఎవరికో?
రౌండ్ వన్‌లో బంగ్లాదేశ్, ఐర్లాండ్, నమీబియా, నెదర్లాండ్స్, ఒమన్, పపువా న్యూగినీ, స్కాట్లాండ్, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఇక సూపర్ 12లో అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ పోటీ పడతాయి. రౌండ్ వన్ నుంచి నాలుగు జట్లు ఇందులో కలుస్తాయి. నగదు ప్రోత్సాహకాలే కాకుండా ఈ సారి డ్రింక్స్ బ్రేక్‌నూ ఐసీసీ ప్రకటించింది. ప్రతి ఇన్నింగ్స్ మధ్యలో రెండున్నర నిమిషాలు ఇవ్వనుంది. దుబాయ్‌లో ఉక్కపోత పరిస్థితులే ఇందుకు కారణం.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
📢 Prize money announced for the 2021 ICC Men's #T20WorldCup.
— T20 World Cup (@T20WorldCup) October 10, 2021
More 👇https://t.co/j7xewGORj6
It’s time to gear up for the #T20WorldCup!
— T20 World Cup (@T20WorldCup) October 10, 2021
Everything you need to know ahead of the first match on October 17 👇https://t.co/rmVPnWIR6G