Steve Smith: టీమిండియాకు సిగ్నల్ పంపిన స్మిత్ - బిగ్‌బాష్ లీగ్‌లో 56 బంతుల్లోనే సెంచరీ!
భారత్‌తో జరగాల్సిన టెస్టు సిరీస్ కంటే ముందుగానే స్టీవ్ స్మిత్ ఫాంలోకి వచ్చాడు.
Steven Smith Hundred: ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు కూడా టీమిండియాకు అలారం బెల్ మోగించాడు. ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాష్ లీగ్‌లో, అతను 56 బంతుల్లో 101 పరుగుల ఇన్నింగ్స్ ఆడి తన మొదటి సెంచరీని సాధించాడు. సిడ్నీ సిక్సర్స్ తరఫున ఆడుతున్న స్టీవ్ స్మిత్ అడిలైడ్ స్ట్రైకర్స్‌పై ఈ ఇన్నింగ్స్‌ను ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో మొత్తం ఐదు ఫోర్లు, ఏడు సిక్సర్లు బాదాడు. అతని స్ట్రైక్ రేట్ 180.36గా ఉంది.
భారత జట్టుతో జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియాకు స్టీవ్ స్మిత్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టెస్టు సిరీస్‌లో భారత్‌కు ఇబ్బందులు సృష్టించగలడు. టెస్టులో స్టీవ్ స్మిత్ అద్భుతమైన లయతో కనిపిస్తున్నాడు.
ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో అద్భుతమైన ఫామ్‌ను కనబరిచాడు. సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 85 పరుగులు, మూడో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 104 పరుగుల ఇన్నింగ్స్‌లు ఆడాడు.
ముఖ్యంగా సిడ్నీ సిక్సర్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. సిడ్నీ సిక్సర్స్ విజయంలో స్టీవ్ స్మిత్ సెంచరీనే కీలక పాత్ర పోషించింది. అతని అద్భుత సెంచరీకి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు బోనస్‌గా లభించింది.
మొదట బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ సిక్సర్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. అడిలైడ్ స్ట్రైకర్స్ ఛేదనకు దిగి 19 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది. ఇందులో సిడ్నీ సిక్సర్స్ బౌలర్లు టాడ్ మర్ఫీ, బెన్ ద్వార్షుయిస్ మూడేసి వికెట్లు తీశారు. దీంతో పాటు స్టీవ్ ఒకీఫ్ రెండు వికెట్లు, సీన్ అబాట్ ఒక వికెట్ దక్కించుకున్నారు.
View this post on Instagram
View this post on Instagram