IND VS SL 3rd T20I: మూడో టీ20లో టాస్ గెలిచిన లంక - బ్యాటింగ్ ఎవరిదంటే?
భారత్‌తో జరుగుతున్న మూడో టీ20లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
IND VS SL: భారత్, శ్రీలంకల మధ్య జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా చివరి టీ20 మ్యాచ్ నేడు (ఫిబ్రవరి 27వ తేదీ) జరగనుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఈ మ్యాచ్‌లో మొదట శ్రీలంక బ్యాటింగ్‌కు దిగనుంది. భారత్ ఇప్పటికే సిరీస్‌ను 2-0తో గెలుచుకుంది. ఈ మ్యాచ్ కూడా గెలిచేస్తే... 3-0తో సిరీస్ వైట్ వాష్ అవుతుంది.
భారత్ తుదిజట్టులో మూడు మార్పులు చేసింది. గాయం కారణంగా ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. బుమ్రా, భువీ, చాహల్‌లకు విశ్రాంతిని ఇచ్చారు. వీరి స్థానంలో రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్, మహ్మద్ సిరాజ్‌లకు అవకాశం దక్కింది. ఇక శ్రీలంక కూడా తన జట్టుకు రెండు మార్పులు చేసింది. ప్రవీణ్ జయవిక్రమ, కమిల్ మిషార స్థానాల్లో జనిత్ లియనగే, జెఫ్రే వాండర్సేలకు అవకాశం దక్కింది.
భారత్ తుదిజట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), సంజు శామ్సన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజా, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్
శ్రీలంక తుదిజట్టు
పతుం నిశ్శంక, చరిత్ అసలంక, దనుష్క గుణతిలక, దినేష్ చండిమాల్ (వికెట్ కీపర్), దసున్ షనక (కెప్టెన్), జనిత్ లియనగే, చమిక కరుణ రత్నే, దుష్మంత చమీర, జెఫ్రే వాండర్సే, బినుర ఫెర్నాండో, లహిరు కుమర
View this post on Instagram
View this post on Instagram