అన్వేషించండి

Squash World Cup 2025: చరిత్ర సృష్టించిన భారత్.. స్క్వాష్ వరల్డ్ కప్ 2025 విజేతగా టీమిండియా

Squash World Cup Winner India: స్క్వాష్ ప్రపంచ కప్ 2025 విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో హాంకాంగ్ ను ఓడించి తొలిసారిగా భారత్ విశ్వ విజేతగా నిలిచింది. ఆసియా దేశానికి ఇదే మొదటి టైటిల్.

Squash World Cup 2025: 2025 సంవత్సరం ముగిసేలోపు క్రీడా ప్రపంచంలో భారతదేశం మరో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. భారత స్క్వాష్ జట్టు స్క్వాష్ ప్రపంచ కప్ 2025 టైటిల్‌ను గెలుచుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. స్క్వాష్ ప్రపంచ కప్‌ను గెలుచుకున్న తొలి ఆసియా దేశంగా భారత్ రికార్డులు తిరగరాసింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 3-0 తేడాతో హాంకాంగ్‌ను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది.

ఈ విజయానికి మరో ప్రత్యేకత ఏమిటంటే, భారత్ ఈ టోర్నమెంట్‌లో ఒక్క మ్యాచ్ కూడా కోల్పోలేదు. మిక్స్‌డ్-టీమ్ ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నమెంట్ భారత ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, నిలకడకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది. ఇంతకు ముందు భారత జట్టు స్క్వాష్ ప్రపంచ కప్ ఫైనల్‌కు ఎప్పుడూ చేరుకోలేదు. 2023లో సెమీ-ఫైనల్‌ వరకు వచ్చి జట్టు ఓడిపోయింది. అయితే ఈసారి జట్టు పూర్తి సన్నద్ధతతో, గెలవాలన్న తపన, లక్ష్యాలతో బరిలోకి దిగింది.

గ్రూప్ దశ నుండి ఫైనల్ వరకు భారత్ ఆధిపత్యం

రెండవ సీడ్ పొందిన భారత జట్టు గ్రూప్ దశలో స్విట్జర్లాండ్, బ్రెజిల్‌ జట్లను 4-0 తేడాతో ఓడించి ఘనంగా ప్రారంభించింది. అనంతరం క్వార్టర్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించింది. సెమీఫైనల్‌లో భారత జట్టు రెండుసార్లు ఛాంపియన్ అయిన ఈజిప్ట్‌తో తలపడినా తడబడలేదు. భారత్ అద్భుతమైన ఆటతీరుతో 3-0 తేడాతో ఈజిష్ట్ జట్టుపై విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది.

ఫైనల్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన

ఫైనల్ మ్యాచ్‌లో అనుభవజ్ఞురాలైన భారత క్రీడాకారిణి జోష్నా చిన్నప్ప ప్రపంచ ర్యాంకింగ్‌లో 37వ స్థానంలో ఉన్న లీ కా యీని 3-1 తేడాతో ఓడించి భారత జట్టుకు మంచి ఆరంభం ఇచ్చింది. ఆ తర్వాత ఆసియా క్రీడల పతక విజేత అభయ్ సింగ్ అలెక్స్ లౌను 3-0 తేడాతో ఓడించి భారత్ ఆధిక్యాన్ని మరింత పెంచాడు. చివరి మ్యాచ్‌లో 17 ఏళ్ల యంగ్ ప్లేయర్ అనాహత్ సింగ్ అద్భుతంగా రాణించి ప్రపంచ ర్యాంకింగ్‌లో 31వ స్థానంలో ఉన్న టొమాటో హోను 3-0 తేడాతో ఓడించడంతో భారత్‌ విజయం ఖాయమైంది. ఆ తర్వాత భారత పురుషుల జాతీయ ఛాంపియన్ వెలవన్ కుమార్ ఆడే అవకాశం రాలేదు.

ఒలింపిక్స్‌కు ముందు గొప్ప విజయం

ఈ స్క్వాష్ టోర్నమెంట్‌లో మొత్తం 12 దేశాలు పాల్గొన్నాయి. ఇందులో ఆస్ట్రేలియా, ఈజిప్ట్, హాంకాంగ్, జపాన్, మలేషియా, ఇరాన్, పోలాండ్, దక్షిణాఫ్రికా, స్విట్జర్లాండ్ వంటి పటిష్ట దేశాలు ఉన్నాయి. 1996లో స్క్వాష్ ప్రపంచ కప్ ప్రారంభమైంది.  ఇప్పటివరకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఈజిప్ట్ వంటి జట్లు వరల్డ్ కప్ టైటిల్‌ను గెలుచుకుంటూ వస్తున్నాయి. తాజా విజయంతో సరికొత్త ఛాంపియన్‌గా భారత్ అవతరించింది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Vaibhav Sooryavanshi: హాఫ్ సెంచరీ తరువాత వైభవ్ సూర్యవంశీ వినూత్నంగా సెలబ్రేషన్లు.. దాని అర్థం ఏంటో తెలుసా..
హాఫ్ సెంచరీ తరువాత వైభవ్ సూర్యవంశీ వినూత్నంగా సెలబ్రేషన్లు.. దాని అర్థం ఏంటో తెలుసా..
Srikkanth Samson Snub: వరల్డ్ కప్ హీరో కు టీమ్ మేనేజ్‌మెంట్ అన్యాయం చేస్తోంది.. కొంద‌రు ప్లేయ‌ర్ల‌పై ప‌క్ష‌పాతం చూపిస్తోంది..  దిగ్గ‌జ క్రికెట‌ర్ హాట్ కామెంట్స్!
వరల్డ్ కప్ హీరో కు టీమ్ మేనేజ్‌మెంట్ అన్యాయం చేస్తోంది.. కొంద‌రు ప్లేయ‌ర్ల‌పై ప‌క్ష‌పాతం చూపిస్తోంది..  దిగ్గ‌జ క్రికెట‌ర్ హాట్ కామెంట్స్!
Arshdeep - Samreen Romance:
"మై పర్సన్" అంటూ పిక్స్ షేర్ చేసిన అర్షదీప్ .. బాలీవుడ్ బ్యూటీతో యూకేలో రొమాంటిక్ వెకేషన్!
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tenth Class Student Death: సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
సీఎం చంద్రబాబుతో శభాష్ అనిపించుకున్న విద్యార్థినిఆత్మహత్య.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
Anti Paper Leak Bill: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి.. సభ 2 గంటలకు వాయిదా
Hyderabad Drugs Case: అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
అబిడ్స్‌లో డ్రగ్స్ కలకలం.. పోలీసులపైకి కారు ఎక్కించిన నిందితుడు- ఇద్దరు పోలీసులకు గాయాలు
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Polimera 3 : పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
హైవే మీద, నగరంలోనూ అదరహో! MG Windsor EV 15,000 15,000km లాంగ్ టర్మ్ రివ్యూ
లాంగ్‌టర్మ్‌లో MG Windsor EV ఎలా ఉంది? 15,000km సుదీర్ఘ ప్రయాణంలో బయటపడిన నిజాలు
Embed widget