By: ABP Desam | Updated at : 27 Jan 2023 09:03 AM (IST)
కంటతడి పెట్టిన సానియా(Image Source: Twitter)
భావోద్వేగ క్షణం... ఆటను వదిలేసిన క్షణం... ఎప్పుడూ నవ్వుతూ కనిపించే సానియా మీర్జా ఒక్కసారిగా కంట తడి పెట్టుకున్నారు. ఆస్ట్రేలియా ఓపెన్‌ను తన ఆఖరి గ్రాండ్‌స్లామ్ అని చెప్పిన సానియా మీర్జా... టైటిల్ కొట్టకుండానే వెనుదిరిగారు. ఎన్ని విజయాలు సాధించిన ఆఖరి విజయం సొంతమైతే ఆ కిక్కే వేరు ఉంటుంది కదా. అలాంటి కిక్‌ను సానియా మీర్జా పొంద లేకపోయారు.
ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా, బోపన్న జోడీ ఓటమి పాలయ్యారు. స్టెఫాని, మాతోస్ జరిగిన ఫైనల్ మ్యాచ్‌తో 6-7, 2-6 తేడాతో ఓడిపోయిందీ జోడీ. ఆరంభం ధాటిగానే స్టార్ట్ చేసినా... మధ్యలో సానియాబోపన్న జోడీకి బ్రేక్ పడింది. అనవసరమైన తప్పిదాలు కారణంగా హోరాహోరీ పోరులో మొదటి సెట్‌ను చేజార్చుకుందీ జోడీ. రెండో సెట్‌లో మాత్రం ఎలాంటి పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో స్టెఫాని, మాతోస్ ఎదురు దాడి కొనసాగింది. దీంతో మ్యాచ్‌ను 6-7, 2-6తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది.
సానియా భావోద్వేగం...
తర్వాత టైటిల్ ఇచ్చే సందర్భంగా మాట్లాడిన సానియా మీర్జా అందర్నీ ఏడిపించేశారు. తాను చాలా చిన్న వయసులోనే కేరీర్ స్టార్ట్ చేశానంటూ చెబుతూ... కంటతడి పెట్టుకున్నారు. తనకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. తన మొదటి నుంచి తన గేమ్‌లో పార్టనర్‌గా ఉన్న బోపన్న చాలా మంచి మిత్రుడిగా అభివర్ణించారు. ఆస్ట్రేలియా తన హోం గ్రౌండ్ లాంటిదన్నారు. తనకు అన్ని విధాలుగా సహకరించిన వారందరి పేర్లు ప్రస్తావించి ధన్యవాదాలు చెప్పారు. ఎన్నో మరుపురాని అనుభూతులు ఇచ్చిన గ్రాండ్‌స్లామ్‌ను విడిచిపెట్టడం చాలా బాధగా ఉందన్నారు. ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూనే తన ప్రసంగాన్ని కొనసాగించారు సానియా. అది చూసిన కుటుంబ సభ్యులు కూడా కంట నీరు పెట్టుకున్నారు.
రెండు ఆస్ట్రేలియా గ్రాండ్‌స్లామ్‌లు
2009(మిక్స్‌డ్), 2016(డబుల్స్) ఆస్ట్రేలియా ఓపెన్‌లో సానియా విజేతగా నిలిచారు. ఈసారి కూడా టైటిల్ గెలుస్తారని అంతా అనుకున్నారు కానీ నిరాశతో కెరీర్ ముగించేశారు సానియా
MIW Vs UPW WPL 2023: ఫైనల్స్‌లో ప్లేస్ కోసం ముంబై, యూపీల మధ్య పోటీ - లైవ్ ఎక్కడ చూడచ్చంటే?
Suryakumar Yadav: సూర్యకుమార్ 3 వన్డేల్లో 3 డక్స్! మర్చిపోతే మంచిదన్న సన్నీ!
IPL 2023: రెస్ట్ గురించి అడిగితే.. ఆటగాళ్లు ఫ్రాంచైజీల సొంతమంటున్న రోహిత్!
‘సూర్య’కుమార్ కాదు, ‘శూణ్య’కుమార్- 3 డకౌట్లతో మిస్టర్ 360ని ఆటాడుకుంటున్న నెటిజన్లు
అనుమానమే నిజమయ్యేట్టుంది- కేకేఆర్‌తోపాటు భారత్‌కూ షాక్ తప్పేట్టులేదుగా!
పేపర్ లీక్ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు
CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ
Kavitha Supreme Court : ఈడీపై కవిత పిటిషన్‌పై విచారణ తేదీ మార్పు - మళ్లీ ఎప్పుడంటే ?
Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్‌బర్గ్ టార్గెట్ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు