అన్వేషించండి

R Praggnanandhaa: నీ దూకుడుకు సాటెవ్వడు - మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను ఓడించిన ప్రజ్ఞానందతో ABP ఇంటర్వ్యూ

R Praggnanandhaa stuns Magnus carlsen: ఎయిర్‌థింగ్స్‌ మాస్టర్స్‌లో ప్రపంచ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను ఓడించిన ప్రజ్ఞానంద ఏబీపీకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ సారాశం మీకోసం!

Abp desam exclusive interview with R praggnanandhaa: భారత యువ కెరటం, గ్రాండ్‌ మాస్టర్‌ ఆర్‌.ప్రజ్ఞానంద దూసుకుపోతున్నాడు. ప్రపంచ రికార్డులు బద్దలు కొడుతున్నాడు. ఎయిర్‌థింగ్స్‌ మాస్టర్స్‌లో ఏకంగా ప్రపంచ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను ఓడించాడు. అంతేకాకుండా పదో రౌండ్లో ఆండ్రీ ఎసిపెన్‌కో, 12వ రౌండ్లో అలెగ్జాండ్రా కోస్‌టెన్‌యుక్‌ను చిత్తు చేశాడు. ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ చెస్‌లో దిగ్గజాలను నివ్వెరపరిచిన ప్రజ్ఞానంద ఏబీపీకి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ సారాశం మీకోసం!


ఏబీపీ ప్రతినిధి:
ఈరోజు ప్రపంచాన్ని నివ్వెరపరిచిన ఓ యువకెరటం మనతో ఉన్నారు. చెస్ లో వరల్డ్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్ సన్ ను ఓడించిన మాస్టర్ ప్రజ్ఞానంద మనతో ఉన్నారు. ముందుగా ఏబీపీ తరపున ప్రజ్ఞానందకు అభినందనలు. కార్ల్ సన్ ను ఓడించటం ఎలా అనిపిస్తోంది..?

ప్రజ్ఞానంద:
ఇది చాలా మంచి అనుభవం. ప్రపంచ నంబర్ 1, వరల్డ్ ఛాంపియన్ మాగ్నస్ ను ఓడించటం గొప్ప అనుభూతి. నా ఆత్మవిశ్వాసాన్ని ఇది పెంచుతుంది.

ఏబీపీ:
ఈ విజయం మీకు ప్రత్యేకంగా అనిపిస్తోందా..?

ప్రజ్ఞానంద:
ఇది చాలా బాగుంది. కానీ నేనింకా గేమ్ మీద దృష్టిసారించాలి. ఇంకా టోర్నమెంట్ అయిపోలేదు. ఇంకా ఆడాల్సింది..సాధించాల్సింది ఉంది.

ఏబీపీ:
మొదటి రోజు పరాజయం పాలయ్యారు. తర్వాత రోజు మాగ్నస్ కార్ల్ సన్ తో ఆడాల్సి వచ్చింది. మీ పరిస్థితి ఎలా ఉందప్పుడు..?

ప్రజ్ఞానంద:
మొదటి రోజు నాకు కలిసిరాలేదు. నాలుగు గేమ్స్ లో మూడు ఓడిపోయాను. తర్వాతి రోజు ఇంకా కఠినమైన ప్రత్యర్థులు ఉన్నారని నాకు తెలుసు. నేనేం దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. నా ఆటమీద దృష్టి పెట్టాను. గేమ్ ను ఎంజాయ్ చేశాను. అదే కలిసొచ్చింది.

ఏబీపీ:
ఆట మొదలయ్యాక...మొదటి ముఫై సెకన్ల ప్రత్యర్థి ఎత్తులు వేయటం మొదలుపెట్టినప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి..?

ప్రజ్ఞానంద:
గేమ్ లో నేనక్కడ ఉన్నానో ఆలోచించకూడదు అనుకున్నాను. నాకున్న బలాలు నాకు తెలుసు. ఆ ఎత్తులతో సిద్ధంగా ఉన్నాను. అదృష్టం కొద్దీ ఆయనో బ్లండర్ చేశాను. ఇక ఆ ఛాన్స్ వదలకూడదనుకున్నాను. ఇక మంచి ఎత్తులు పడటంతో గేమ్ నా వైపు తిరిగింది.

ఏబీపీ:
మీరు గెలిచిన తర్వాత మీ సెలబ్రేషన్స్ చాలా కొత్తగా అనిపించాయి. తల రుద్దుకున్నారు. నోరు మూసుకున్నారు. ఆశ్చర్యపోయారు. ఈ సెలబ్రేషన్స్ ఏంటీ అసలు..?

ప్రజ్ఞానంద:
నేను ఆశ్చర్యానికి గురయ్యాను. నేను వరల్డ్ ఛాంపియన్ తో ఆడటమే మంచి అవకాశం అనుకుంటే...మ్యాచ్ గెలిచాను. అందుకే ఆ వింత ఎక్స్ ప్రెషన్స్.

ఏబీపీ:
ప్రస్తుతం విశ్వనాథన్ ఆనంద్ మీకు ట్రైనింగ్ ఇస్తున్నారు కదా..ఏమన్నా ప్రత్యేక శిక్షణ తీసుకున్నారా..?

ప్రజ్ఞానంద:
నేను విశ్వనాథన్ ఆనంద్ వెస్ట్ బ్రిడ్జ్ అకాడమీ స్టూడెంట్ ని. అక్కడ ఆనంద్ సర్, సందీప్ సర్ నాపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తుంటారు. వాళ్లే కాకుండా నాకు పర్సనల్ ట్రైనర్ గ్రాండ్ మాస్టర్ రమేష్ సర్ ఉన్నారు. వీళ్ల ముగ్గురూ నా ట్రైనింగ్ లో నాకు చాలా సహాయపడుతుంటారు. నా స్పాన్సర్స్ రాంకో నాకు ఎప్పుడూ సపోర్ట్ గా నిలబడుతోంది.

ఏబీపీ:
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, ఇంకా చాలా మంది సెలబ్రిటీలు నిన్ను విష్ చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. నీకేం స్పెషల్ గా అనిపించింది..?


ప్రజ్ఞానంద:
సచిన్ సర్ నుంచి ట్వీట్ రావటం, విషెస్ రావటం చాలా బాగా అనిపించింది. ఇంకా చాలా మంది కాల్ చేసి విషెస్ చెప్పారు. కానీ నాకింకా టోర్నమెంట్ ఉంది. అందుకే నేను ఎక్కువ వాటి మీద దృష్టి పెట్టకూడదు అనుకున్నాను.

 

ఏబీపీ:
పిన్నవయస్సుడైన భారత  గ్రాండ్ మాస్టర్ గా...చిన్నవయస్సులోనే వరల్డ్ ఛాంపియన్ అయిన మాగ్నస్ కార్ల్ సన్ ను ఓడించారు. ఇంకా మీకున్న లక్ష్యాలేంటీ..?

ప్రజ్ఞానంద:
నేను ఇంకా నా గేమ్ ను ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకా మంచిగా ఆడాలి. బలాలు పెంచుకోవాలి.

ఏబీపీ:
భవిష్యత్తు కోసం ప్రత్యేక ప్రణాళికలు ఏమన్నా ఉన్నాయా..?

ప్రజ్ఞానంద:
ఈ శిక్షణను కొనసాగించాలనుకుంటున్నాను. ఇంకా మంచి విషయాలు నేర్చుకోవాలి. ఇంకా ముందుకు వెళ్లాలి.

ఏబీపీ ప్రతినిధి:
మరో సారి మీకు కంగ్రాట్స్. ఈ టోర్నమెంట్ లో, భవిష్యత్తులోనూ మీరు మరిన్ని విజయాలు అందుకోవాలి కోరుకుంటున్నాం.

ప్రజ్ఞానంద:
థాంక్యూ..!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Game Changer Third Single: నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
నానా హైరానా... 'గేమ్ చేంజర్' మూడో సాంగ్ రిలీజుకు ముందు బ్లాక్ బస్టర్ కొట్టిన తమన్
PM Modi News: తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు - ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Embed widget