![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
David Warner Pakistan vs Australia: ఇండియాలో 'బాహుబలి' పాక్‌లో 'థార్'! ఎక్కడైనా డేవిడ్ వార్నర్ రూటే సెపరేటు!
David Warner: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) ఎక్కడైనా సరే అలరించడం మానడు! భారత అభిమానుల కోసం ఇక్కడి హీరోల స్ఫఫులు చేస్తుంటాడు. ఇప్పుడేమో పాకిస్థాన్లో..
![David Warner Pakistan vs Australia: ఇండియాలో 'బాహుబలి' పాక్‌లో 'థార్'! ఎక్కడైనా డేవిడ్ వార్నర్ రూటే సెపరేటు! Pakistan vs Australia, 2nd Test David Warner Tries To Fix Karachi Pitch watch video David Warner Pakistan vs Australia: ఇండియాలో 'బాహుబలి' పాక్‌లో 'థార్'! ఎక్కడైనా డేవిడ్ వార్నర్ రూటే సెపరేటు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/12/ec4e0ac373b589d42e831b53f4079ba1_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
David Warner vs Pakistan: ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ (David Warner) మరోసారి పాక్ అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. కరాచీ పిచ్‌పై పడ్డ పాద ముద్రలను సుత్తితో చదును చేశాడు. మైదానం సిబ్బందికి సాయం చేశాడు. పాకిస్థాన్ పోస్టు చేసిన వీడియో వైరల్‌గా మారింది. దానికి వార్నర్ సతీమణి క్యాండిస్ (Candice Warner) వేసిన కౌంటర్ ఇంకా అద్దిరింది!
కరాచీ వేదికగా ఆస్ట్రేలియా, పాకిస్థాన్ (Pakistan vs Australia) రెండో టెస్టులో తలపడ్డాయి. బుధవారమైన ఐదో రోజు ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. అయితే పిచ్‌పై ఎక్కువగా బ్యాటర్లు, బౌలర్ల పాద ముద్రలు పడ్డాయి. బౌలింగ్ చేసేందుకు కాస్త ఇబ్బందికరంగా మారింది. దాంతో వాటిని సుత్తితో డేవిడ్ వార్నర్ చదును చేశాడు. కొద్దిసేపు కుడిచేయి, మరికాసేపు ఎడమచేతి ఉపయోగించాడు. ఈ వీడియోను పాక్ క్రికెట్ బోర్డు ట్విటర్లో పోస్టు చేసింది. 'థార్ హ్యామర్ ఈ రోజు మరోసారి బాదేస్తోంది' అని కామెంట్ పెట్టింది.
ఇదే వీడియోను డేవిడ్ వార్నర్ సతీమణి క్యాండిస్ రీట్వీట్ చేసింది. 'డేవిడ్ వార్నర్ ఇంటివద్ద ఈ పని ఇంకాస్త ఎక్కువ చేస్తే బాగుంటుంది' అని పంచ్ వేసింది. వీళ్లిదరూ ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్‌లో సరదా సరదా వీడియోలు చేస్తూ అలరించే సంగతి తెలిసిందే.
ఈ మ్యాచులో 556/9 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను ఆస్ట్రేలియా డిక్లేర్ చేసింది. ఉస్మాన్ ఖవాజా (160), స్టీవ్ స్మిత్ (72), అలెక్స్ కేరీ (93) రాణించారు. బదులుగా పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 148 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను 97/2కు డిక్లేర్ చేసింది. భారీ స్కోరును పాక్ మెరుగ్గానే ఛేదించే ప్రయత్నం చేసింది. బాబర్ ఆజామ్ (196), మహ్మద్ రిజ్వాన్ (104) సెంచరీలకు తోడుగా అబ్దుల్లా షఫీక్ (96) రాణించడంతో ఐదో రోజు ఆటముగిసే సరికి 7 వికెట్ల నష్టానికి 443 పరుగులు చేసింది. ఆలౌట్ కాకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
I wish @davidwarner31 would do this a little bit more around the house!! 🤣🤣 https://t.co/hFhdFGqPTA
— Candice Warner (@CandiceWarner31) March 17, 2022
David Warner enjoying the game! pic.twitter.com/0ELAPgaZZU
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 8, 2022
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)