IPL 2021: చెన్నైకి ధోనీ... త్వరలో UAEకి... పర్మిషన్ కోసం వెయిటింగ్
భారత క్రికెట్ జట్టు మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ చెన్నైలో ల్యాండయాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ చెన్నైలో ల్యాండయాడు. కరోనా కారణంగా ఈ ఏడాది IPL అర్థంతరంగా మధ్యలో ఆగిపోయిన సంగతి తెలిసిందే. మిగిలిన షెడ్యూల్ సెప్టెంబరు 19 నుంచి తిరిగి ప్రారంభంకానుంది. UAEలో ఈ షెడ్యూల్ జరగనుంది.
ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ UAE వెళ్లేముందు చెన్నై చేరుకున్నాడు. విమానాశ్రయానికి చేరుకున్న ధోనీకి అభిమానులు ఘన స్వాగతం పలికారు. తలా, తలా అంటూ ధోనీని పిలిచారు. తమ అభిమాన సారథి చెన్నై వచ్చాడని తెలుసుకున్న అభిమానులు ఎంతో ఆనందానికి గురయ్యారు.
అంతర్జాతీయ క్రికెట్‌కి వీడ్కోలు పలికినప్పటి నుంచి ధోనీ అభిమానులకు ఎక్కువగా కనిపించడం లేదు. శుక్రవారం లేదా శనివారం అందుబాటులో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, మేనేజ్‌మెంట్ సిబ్బంది యూఏఈ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం BCCI ఇప్పటికే యూఏఈ ప్రభుత్వం నుంచి అనుమతి కోరినట్లు సమాచారం. అక్కడి నుంచి అనుమతి రాగానే ధోనీ జట్టు UAEలో ల్యాండవుతుంది.
చెన్నై చేరుకున్న ధోనీకి సంబంధించి వైరల్ అవుతోన్న ఫొటోలు, వీడియోలు ఇప్పుడు చూద్దాం.
Look who arrived.! 😎🔥@MSDhoni | #MSDhoni | #WhistlePodu pic.twitter.com/u2Tq9iMZN3
— DHONI Trends™ (@TrendsDhoni) August 10, 2021
Thala is back in his Kingdom and along with Sakshi and Ziva this time.
— Ananya (@TheCricBird) August 10, 2021
#MSDhoni |#whistlepodu pic.twitter.com/wrkwehb74S
Finally Dhoni is here 😍🦁🔥@MSDhoni • #MSDhoni • #WhistlePodu pic.twitter.com/QHT9tllPOn
— DHONI Era™ 🤩 (@TheDhoniEra) August 10, 2021
Captain Dhoni has arrived in Chennai for the 2nd Phase of IPL 2021 🥁💥@MSDhoni • #MSDhoni • #WhistlePodu pic.twitter.com/RuV8rO87fK
— DHONIsm™ ❤️ (@DHONIism) August 10, 2021
చెన్నై విమానాశ్రయంలో ధోనీ... భార్య సాక్షి, కూతురు జీవాతో కలిసి కనిపించాడు. IPL మధ్యలోనే అర్థంతరంగా ముగియడంతో ధోనీ రాంచీలోని తన ఫామ్ హౌస్‌లో సాక్షి, జీవాతో కలిసి సమయాన్ని గడుపుతున్నాడు.
సెప్టెంబరు 19 నుంచి ప్రారంభమయ్యే IPL అక్టోబరు 19తో ముగియనుంది. షార్జా, అబుదాబి, దుబాయ్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి. ఎలిమినేటర్, క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లకు షార్జా ఆతిథ్యం ఇవ్వనుంది. ఫైనల్స్, ఫస్ట్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లలు దుబాయ్‌లో జరుగుతాయి.