Moeen Ali Retirement: షాకిచ్చిన మొయిన్ అలీ! టెస్టులకు గుడ్‌బై.. మూడో బెస్ట్ బౌలర్ అతడే!
ఈ మధ్యే టీమ్‌ఇండియాతో తలపడ్డ టెస్టు సిరీసులో మొయిన్ అలీ ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతానని మొయిన్ అలీ వారం రోజులు క్రితమే కెప్టెన్ జో రూట్, కోచ్ సిల్వర్‌వుడ్‌కు చెప్పినట్టు తెలిసింది.
ఇంగ్లాండ్ సీనియర్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇకపై కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌పై మరింత దృష్టి సారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీసుకు ముందు అతడు రిటైర్మెంట్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అతనిప్పుడు ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే.
Also Read: ప్లేఆఫ్ కోసం రాజస్తాన్.. పరువు కోసం హైదరాబాద్!
యాషెస్‌కు ముందు ఆశ్చర్యం!
ఈ మధ్యే టీమ్‌ఇండియాతో తలపడ్డ టెస్టు సిరీసులో మొయిన్ అలీ ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతానని మొయిన్ అలీ వారం రోజులు క్రితమే కెప్టెన్ జో రూట్, కోచ్ సిల్వర్‌వుడ్‌కు చెప్పినట్టు తెలిసింది. ఇంటికి, కుటుంబానికి ఎక్కువ కాలం దూరంగా ఉండటం అసౌకర్యంగా అనిపించడంతో అతడీ నిర్ణయానికి వచ్చాడని ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫోకు చెప్పాడని సమాచారం.
Also Read: హర్షల్ పటేల్ హ్యాట్రిక్.. ముంబై ఇండియన్స్ పతనాన్ని శాసించిన ఆర్సీబీ బౌలర్
వారం ముందే వారికి తెలుసు!
సుదీర్ఘ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన మొయిన్ అలీని కెప్టెన్ జో రూట్, కోచ్ సిల్వర్ వుడ్ అభినందించారు. అతడు జట్టుకు ఎంతగానో సేవలందించాడని ప్రశంసించారు. ఏడేళ్ల కెరీర్లో మొయిన్ అలీ 64 టెస్టులు ఆడాడు. లార్డ్స్ వేదికగా 2014లో శ్రీలంకపై అతడు అరంగేట్రం చేశాడు. అదే జట్టుపై రెండో టెస్టులోనే అతడు శతకం బాదేయడం గమనార్హం.
Also Read: డుప్లెసిస్ ఫీల్డింగ్ అద్భుతం.. మోకాలికి రక్తం కారుతున్నా క్యాచ్ మాత్రం వదల్లేదు.. నెటిజన్ల ప్రశంసలు
ఇవీ రికార్డులు
ఓ అద్భుత రికార్డును మొయిన్ అలీ వదులుకున్నాడు! టెస్టు క్రికెట్లో ఇప్పటి వరకు కేవలం 14 మందే 3000 పరుగులు, 200 వికెట్లు తీశారు. ఆ ఘనతకు మొయిన్ మరో 84 పరుగులు, 5 వికెట్ల దూరంలో ఆగిపోయాడు. కాగా టెస్టుల్లో అతడు 36.66 సగటు, 60.79 స్ట్రైక్‌రేట్‌తో 195 వికెట్లు తీశాడు. ఐదుసార్లు ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. ఒక ఇన్నింగ్స్‌లో 53 పరుగులకే 6 వికెట్లు, ఒక మ్యాచులో 112 పరుగులకే 10 వికెట్లు తీయడం అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు. గ్రేమ్ స్వాన్, డెరిక్ అండర్‌వుడ్ తర్వాత మొయినే ఇంగ్లాండ్ అత్యుత్తమ బౌలర్ కావడం గమనార్హం.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
6⃣4⃣ Test matches
— England Cricket (@englandcricket) September 27, 2021
1⃣9⃣5⃣ wickets
2⃣9⃣1⃣4⃣ runs
Countless memories ❤️#ThankYouMo 👏
England All rounder Moeen Ali decided to retire from Test cricket. In 64 matches, he scored 2914 runs and took 195 wickets including Hat trick.
— Ayesha 🏴 (@JoeRoot66Fan) September 27, 2021
will miss you mo. pic.twitter.com/a6qGyn5tk6