IPL 2021, KKR vs CSK: డుప్లెసిస్ ఫీల్డింగ్ అద్భుతం.. మోకాలికి రక్తం కారుతున్నా క్యాచ్ మాత్రం వదల్లేదు.. నెటిజన్ల ప్రశంసలు
కోల్ కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా జరిగింది. డుప్లెసిస్ చూపిన ప్రదర్శనపై నెటిజన్లు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.

IPL 2021, KKR vs CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 ఫేజ్2 లో భాగంగా నేటి సాయంత్రం కోల్ కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా జరిగింది. అయితే చివరి బంతికి చెన్నై విజయం సాధించింది. అబుదాబి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సీఎస్కే ఆటగాడు డుప్లెసిస్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఔటయ్యాడు. అయితే అందుకు డుప్లెసిస్ చూపిన ప్రదర్శనపై నెటిజన్లు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. కాలికి రక్తం కారుతున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా జట్టు కోసం అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు డుప్లెసిస్.
ఆదివారం చెన్నై సూపర్‌కింగ్స్ అద్భుతం చేసింది. అభిమానులను మునికాళ్లపై నిలబెట్టింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఉత్కంఠకర విజయం అందుకుంది. రెండో అంచెలో వరుసగా మూడో మ్యాచ్ గెలిచి హ్యాట్రిక్ నమోదు చేసింది. ప్రత్యర్థి నిర్దేశించిన 172 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆఖరి బంతికి ఛేదించింది. రవీంద్ర జడేజా తిరుగులేని పోరాటంతో 16 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది.
Also Read: ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత.. టీ20ల్లో తొలి భారత క్రికెటర్‌గా రికార్డ్
Faf du Plessis taking the catch of Eoin Morgan.🔥#CSKvsKKR pic.twitter.com/OHISazQ7lA
— M. (@RunMachine_18) September 26, 2021
ఓ దశలో పవర్ ప్లే ముగిసేసరికి కోల్ కతా జట్టు 1 వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. అనంతరం చెన్నై బౌలర్లు కేకేఆర్ బ్యాటర్స్‌ను కట్టడి చేశారు. ఫీల్డింగ్ లో సైతం చెన్నై ఆటగాళ్లు రాణించి బౌండరీలను ఆపారు. 10వ ఓవర్లో తొలి బంతిని ఇయాన్ మోర్గాన్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. లాంగాన్ లో ఉన్న డుప్లెసిస్ వేగంగా పరిగెత్తుతూ బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.
Also Read: ఆర్‌సీబీ కొత్త సారథిగా కేఎల్ రాహుల్! ముగ్గుర్ని ప్రతిపాదించిన మంజ్రేకర్‌తో విభేదించిన స్టెయిన్!
Respect×100 for Faf du plessis 💛
— SPREAD.DHONISM 🦁™ (@Spreaddhonism7) September 26, 2021
.#fafduplessis #ChennaiSuperKings #whistlepodu pic.twitter.com/AHtSIcaNsH
మొదట బంతిని క్యాచ్ అందుకున్న డుప్లెసిస్ బౌండరీ దాటుతామోనని వెంటనే గాల్లోకి విసిరేశాడు. బౌండరీ లైన్ అవతల కాలుపెట్టిన డుప్లెసిస్ వెంటన్ లైన్ లోపలకి వచ్చి గాల్లో ఉన్న బంతిని క్యాచ్ అందుకున్నాడు. కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (8) నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. అయితే అతడి మోకాలికి రక్తం కారుతున్న ఫొటోలను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. కాలికి రక్తం కారుతున్నా నువ్వు పోరాట ప్రతిమను చూపావు.. క్యాచ్ వదల్లేదు.. సూపర్ డుప్లెసిస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

