Koneru Humpy FIDE World Cup: తెలుగమ్మాయి సరికొత్త చరిత్ర- కోనేరు హంపిపై సీఎంలు చంద్రబాబు, రేవంత్ ప్రశంసలు
Koneru Humpy Womens World Cup | జార్జియాలో జరుగుతున్న ఫిడే మహిళల వరల్డ్ కప్ సెమీఫైనల్లోకి కోనేరు హంపి దూసుకెళ్లారు. హంపి ఘనతపై చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రశంసలు కురిపించారు.

బాటుమి: భారత చెస్ ప్లేయర్, ఇంటర్నేషన్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి (Koneru Humpy) ఫిడే మహిళల చెస్ వరల్డ్ కప్ సెమీఫైనల్ చేరిన తొలి భారత క్రీడాకారిణిగా నిలిచారు. క్వార్టర్ ఫైనల్లో 1.5-0.5 పాయింట్ల తేడాతో చైనా ప్లేయర్ యుక్సిన్ సాంగ్ పై తెలుగు తేజం కోనేరు హంపి విజయం సాధించి FIDE Womens World Cup సెమీఫైనల్లోకి దూసెకెళ్లారు. శనివారం జరిగిన తొలి గేమ్ లో గెలిచిన కోనేరు హంపి, నిన్న జరిగిన రెండో గేమ్ డ్రా చేసుకున్నారు. సెమీఫైనల్లో కోనేరు హంపి చైనా ప్లేయర్, టాప్ సీడ్ లీ టింజీతో తలపడతారు. మరోవైపు మరో క్వార్టర్ ఫైనల్లో 2-0తో జార్జియాకు చెందిన ననా జాగ్నిజెపై లీ టింజీ విజయం సాధించింది. గత ఏడాది ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్‌గా హంపి నిలిచారు.
Grandmaster #KoneruHumpy scripts history, becomes first Indian woman to enter FIDE Women's World Cup semi-finals.#FIDEWorldCup #FIDE #ChessWorldCup #Chess pic.twitter.com/cUVjaTK8VK
— All India Radio News (@airnewsalerts) July 21, 2025
తొలి భారత క్రీడాకారిణిగా హంపి రికార్డు
ఫిడే మహిళల వరల్డ్ కప్ సెమీఫైనల్స్‌కు చేరుకున్న తొలి భారతీయురాలిగా నిలిచిన కోనేరు హంపిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలుగు తేజం కోనేరు హంపిని అభినందించారు. ఆమె సెమీఫైనల్లోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు. చెస్ వరల్డ్ కప్ విజేతగా అవతరించాలని, భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించి తెలుగు వారితో పాటు దేశానికి గర్వకారణంగా నిలవాలని తెలుగు రాష్ట్రాల సీఎంలు ఆకాంక్షించారు.
Let’s cheer for our Telugu daughter shining brightly on the global stage.
— N Chandrababu Naidu (@ncbn) July 21, 2025
Congratulations to Grandmaster Koneru Humpy on becoming the first Indian woman to reach the FIDE World Cup semifinals.
Your achievement fills us with pride and inspires countless others across the nation.… pic.twitter.com/JSDtzI7dv5
ఫిడే ఉమెన్స్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్ కు చేరిన గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపికి నా ప్రత్యేక అభినందనలు. ఈ వరల్డ్ కప్ లో సెమీఫైనల్స్ చేరిన తొలి భారతీయ మహిళ కోనేరు హంపి కావడం తెలుగు ప్రజలకు గర్వకారణం. హంపి విజయం సాధించాలని మనసారా కోరుకుంటున్నాను - రేవంత్ రెడ్డి
FIDE ఉమెన్స్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్ కు
— Revanth Reddy (@revanth_anumula) July 21, 2025
చేరిన గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపికి
నా ప్రత్యేక అభినందనలు.
ఈ లీగ్ లో చేరిన
తొలి భారతీయ మహిళ
కోనేరు హంపి కావడం…
తెలుగు ప్రజలకు గర్వకారణం.
ఆమె విజయం సాధించాలని…
మనసారా కోరుకుంటున్నాను.#ChessChampion #KoneruHampi pic.twitter.com/xYQimuDhCE
నేడు ట్రై బ్రేక్‌లో తేలనున్న హారిక, దివ్య మ్యాచ్ రిజల్ట్
ఇద్దరు భారత క్రీడాకారిణులు దివ్య దేశ్‌ముఖ్, ద్రోణవల్లి హారికల మధ్య క్వార్టర్ ఫైనల్స్ నేడు ట్రైబ్రేక్ లో తేలనుంది. వీరి మధ్య జరిగిన రెండు గేమ్స్ డ్రాగా ముగియడంతో ట్రై బ్రేక్ తో ఫలితం తేల్చనున్నారు. మరో భారత క్రీడాకారిణి వైశాలి టోర్నీ నుంచి ఇప్పటికే వైదొలిగింది. క్వార్టర్ ఫైనల్స్ లో వైశాలిపై 0.5 1.5 తేడాతో తాన్ జ్యోంగి విజయం సాధించింది. మహిళల క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించాలంటే తొలి మూడు స్థానాల్లో నిలవాల్సి ఉంటుంది.






















