Hardik Pandya: హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు? - వైరల్ వీడియోలో ఏం ఉంది?
హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు ఉన్నాయా?
![Hardik Pandya: హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు? - వైరల్ వీడియోలో ఏం ఉంది? Is all not well between Virat Kohli Hardik Pandya Video Went viral Hardik Pandya: హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు? - వైరల్ వీడియోలో ఏం ఉంది?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/12/0ea5ba0c20aaf32cc5ff3e4ee9bf7f701673525967682428_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Virat Kohli & Hardik Pandya: భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఈ వీడియో ఆధారంగా టీమ్ ఇండియా ఇద్దరు ఆటగాళ్ల మధ్య విభేదాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.
మంగళవారం గౌహతి వేదికగా భారత్-శ్రీలంక మధ్య తొలి వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 67 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను ఓడించింది. అయితే ఈ మ్యాచ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, టీమిండియా ఆటగాళ్లు వికెట్ పడటంతో సంబరాలు చేసుకుంటున్నారు. కానీ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా విరాట్ కోహ్లీని పట్టించుకోకుండా అతనితో కరచాలనం చేయలేదు. హార్దిక్ పాండ్యా తలపై టోపీని కూడా విరాట్ కోహ్లీ కదిలించాడు. దీని తర్వాత కూడా హార్దిక్ పాండ్యాను విరాట్ కోహ్లీ కొంచెం చూడమని చెప్పాడు. అయినప్పటికీ హార్దిక్ పాండ్యా అతనిని పట్టించుకోలేదు. అతనితో మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు. అయితే హార్దిక్ పాండ్యా జోక్ గా ఇలా చేశాడా? ప్రస్తుతానికి ఏదీ కచ్చితంగా చెప్పలేం.
ఈ వీడియోపై అభిమానులు కామెంట్లు చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో వన్డే గురించి చెప్పాలంటే లంకేయులు కెప్టెన్ దసున్ షనక టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే శ్రీలంక కెప్టెన్ నిర్ణయం తప్పు అయింది.
భారత బౌలర్ల ధాటికి శ్రీలంక 39.4 ఓవర్లలో కేవలం 215 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ ముందు 216 పరుగుల విజయ లక్ష్యం ఉంది. భారత్ తరఫున పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టాడు.
View this post on Instagram
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)