By: ABP Desam | Updated at : 06 Apr 2023 10:53 PM (IST)
యుజ్వేంద్ర చాహల్ (ఫైల్ ఫొటో) ( Image Source : Twitter )
Most IPL Wickets: పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ భారీ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఒక వికెట్ తీసి ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఈ విషయంలో శ్రీలంక వెటరన్ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగను వెనక్కి నెట్టాడు.
లసిత్ మలింగ తన ఐపీఎల్ కెరీర్‌లో 122 మ్యాచ్‌లు ఆడి 170 వికెట్లు తీశాడు. అదే సమయంలో యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్ వికెట్ల సంఖ్య 171కి పెరిగింది. యుజ్వేంద్ర చాహల్ ఈ స్థానానికి చేరుకోవడానికి 133 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది. పంజాబ్ కింగ్స్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జితేష్ శర్మ అతనికి 171వ వికెట్‌గా మారాడు..
టాప్‌లో డ్వేన్ బ్రేవో
ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా విండీస్ ఫాస్ట్ బౌలర్ డ్వేన్ బ్రేవో రికార్డు సృష్టించాడు. బ్రేవో 161 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 183 వికెట్లు తీశాడు. గత సీజన్ వరకు ఐపీఎల్‌లో భాగమైన అతను ఇప్పుడు ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇప్పుడు యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచే అవకాశం ఉంది. ఈ రికార్డును బద్దలు కొట్టాలంటే అతనికి 13 వికెట్లు కావాలి. బహుశా ఈ సీజన్‌లో అతను ఈ భారీ రికార్డును తన పేరిట లిఖించుకోవచ్చు.
ఐపీఎల్‌లో చాహల్ రికార్డు అద్భుతం
యుజ్వేంద్ర చాహల్ 2013 సంవత్సరంలో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. ఈ 11 సీజన్లలో చాహల్ ఇప్పటివరకు 133 మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను 21.58 బౌలింగ్ సగటు, 7.62 ఎకానమీ రేటుతో 171 వికెట్లు తీశాడు. గత సీజన్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ విజేతగా నిలిచాడు.
ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-10 బౌలర్లు
1. డ్వేన్ బ్రావో: 183 వికెట్లు
2. యుజ్వేంద్ర చాహల్: 171 వికెట్లు
3. లసిత్ మలింగ: 170 వికెట్లు
4. అమిత్ మిశ్రా: 166 వికెట్లు
5. ఆర్ అశ్విన్: 159 వికెట్లు
6. పీయూష్ చావ్లా : 157 వికెట్లు
7. భువనేశ్వర్ కుమార్ : 154 వికెట్లు
8. సునీల్ నరైన్ : 153 వికెట్లు
9. హర్భజన్ సింగ్ : 150 వికెట్లు
10. జస్ప్రీత్ బుమ్రా: 145 వికెట్లు
టీ20 ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా యుజ్వేంద్ర చాహల్ నిలిచాడు. సన్ రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీయడం ద్వారా చాహల్.. టీ20లలో 300 వికెట్లతో పాటు ఐపీఎల్ లో అత్యధిక వికెట్లు తీసిన లసిత్ మలింగ రికార్డులను కూడా సమం చేశాడు. టీ20లలో భారత్ స్టార్ బౌలర్లు జస్ప్రిత్ బుమ్రా, అశ్విన్ వంటి దిగ్గజ బౌలర్లు కూడా చాహల్ తర్వాతే ఉన్నారు.
ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్‌తో ముగిసిన మ్యాచ్‌లో చాహల్.. నాలుగు వికెట్లు తీశాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు పొదుపుగా బౌలింగ్ చేసి 17 పరుగులే ఇచ్చాడు. గత సీజన్ లో చాహల్.. 27 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా అదే ఊపును కొనసాగిస్తూ సన్ రైజర్స్ కు షాకుల మీద షాకులిచ్చాడు. ఆదివారం నాటి మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను ఔట్ చేయడంతో చాహల్.. టీ20లలో 300 వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు.
Piyush Chawla: నా కొడుకు కోసమే తిరిగొచ్చా - ఏబీపీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో పీయూష్ చావ్లా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Ruturaj Gaikwad Wedding: ఇంటివాడైన రుతురాజ్- ఉత్కర్ష పవార్‌తో జట్టుకట్టిన సీఎస్కే ఓపెనర్
Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో
MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్పై నిర్ణయం అప్పుడే!
WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్ వేదిక, బ్రాడ్కాస్ట్, జట్ల వివరాలివే
Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం
Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?
CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు
Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం