IPL Player Of The Match:ఐపీఎల్ చరిత్రలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌లు అందుకున్న వారెవరో తెలుసా?
IPL Player Of The Match: ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతమైన ప్రతిభ చూపిన వాళ్లకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఇస్తారు. ఇప్పటి వరకు ఆ అవార్డు అందుకున్న వారి జాబితా ఇక్కడ చూడండి.

IPL Player Of The Match: ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ప్లేయర్ ఆఫ్‌ద మ్యాచ్‌లు అందుకున్న వివరాలు ఇక్కడ చూద్దాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాడికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందజేస్తారు. 2008 నుంచి 2024 వరకు జరిగిన ప్రతి ఐపీఎల్‌లో ఈ గౌరవాన్ని అందుకున్న ఆటగాళ్ల వివరాలు ఇక్కడ చూద్దాం.
| సంవత్సరం | ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ | టీం పేరు |
| 2008 | యూసఫ్ పఠాన్ | రాజస్థాన్ రాయల్స్ |
| 2009 | అనిల్ కుంబ్లే | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు |
| 2010 | సురేష్ రైనా | చెన్నై సూపర్ కింగ్స్ |
| 2011 | మురళీ విజయ్ | చెన్నై సూపర్ కింగ్స్ |
| 2012 | మన్వీందర్ బిస్లా | కోల్‌కతా నైట్ రైడర్స్ |
| 2013 | పోలార్డ్ | ముంబై ఇండియన్స్ |
| 2014 | మనీష్ పాండే | కోల్‌కతా నైట్ రైడర్స్ |
| 2015 | రోహిత్ శర్మ | ముంబై ఇండియన్స్ |
| 2016 | బెన్ కట్టింగ్ | సన్ రైజర్స్‌్ హైదరాబాద్ |
| 2017 | క్రునాల్ పాండ్యా | ముంబై ఇండియన్స్ |
| 2018 | షేన్ వాట్సన్ | చెన్నై సూపర్ కింగ్స్ |
| 2019 | జస్ప్రీత్ బుమ్రా | ముంబై ఇండియన్స్ |
| 2020 | ట్రెంట్ బౌల్ట్ | ముంబై ఇండియన్స్ |
| 2021 | ఫాఫ్ డు ప్లెసిస్ | చెన్నై సూపర్ కింగ్స్ |
| 2022 | హార్దిక్ పాండ్యా | గుజరాత్ టైటాన్స్ |
| 2023 | డెవాన్ కాన్వే | చెన్నై సూపర్ కింగ్స్ |
| 2024 | మిచెల్ స్టార్క్ | కోల్‌కతా నైట్ రైడర్స్ |
ఈసారి ఐపిఎల్‌లో టాప్ స్కోర్లను ఒకసారి చూద్దాం. ఐపీఎల్‌లో ఎక్కువ పరుగులు చేసిన వ్యక్తికి ఆరెంజ్ క్యాప్ అవార్డు ఇస్తారు. ఈసారి ఈ రేసులో సాయి సుదర్శన ఉన్నాడు. ఆ జట్టు క్వాలిఫైయర్ టూ మ్యాచ్‌లో ముంబైతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
టాప్ 5 రన్-స్కోరర్లు – ఆరెంజ్ క్యాప్ లీడర్స్ (IPL 2025)
గుజరాత్ టైటాన్స్‌కు చెందిన సాయి సుదర్శన్ ఒకే IPL సీజన్‌లో 700 కంటే ఎక్కువ పరుగులు చేసిన అతి పిన్న వయస్కుడిగా (23 ఏళ్లు) చరిత్ర సృష్టించాడు. అదే సమయంలో, ముంబై ఇండియన్స్‌కు చెందిన సూర్యకుమార్ యాదవ్ ఒక సీజన్‌లో ఓపెనర్ కాని ఆటగాడు చేసిన అత్యధిక పరుగుల రికార్డును AB డివిలియర్స్ బద్దలు కొట్టాడు.
సాయి సుదర్శన్ (గుజరాత్ టైటాన్స్) – 759 పరుగులు
సూర్యకుమార్ యాదవ్ (ముంబై ఇండియన్స్) – 717 పరుగులు
విరాట్ కోహ్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) – 657 పరుగులు
శుబ్మాన్ గిల్ (గుజరాత్ టైటాన్స్) – 650 పరుగులు
మిచెల్ మార్ష్ (లక్నో సూపర్ జెయింట్స్) – 627 పరుగులు
టాప్ 5 వికెట్లు తీసినవారు – పర్పుల్ క్యాప్ లీడర్లు (ఐపీఎల్ 2025)
బౌలింగ్‌లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌కు పర్పుల్ క్యాప్ అందిస్తారు. వారిక క్యాప్‌తోపాటు నగదు బహుమతి కూడా ఇస్తారు ఈసారి ఈ రేసులో ప్రసిద్ధ కృష్ణ ఉన్నాడు. ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లు రెండూ ఒకే జట్టులో ఉన్న వ్యక్తులకే వచ్చే అవకాశం ఉంది.
ప్రసిద్ధ కృష్ణ (గుజరాత్ టైటాన్స్) – 25 వికెట్లు
నూర్ అహ్మద్ (చెన్నై సూపర్ కింగ్స్) – 24 వికెట్లు
జోష్ హాజిల్‌వుడ్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) – 22 వికెట్లు
ట్రెంట్ బౌల్ట్ (ముంబై ఇండియన్స్) – 21 వికెట్లు
అర్ష్‌దీప్ సింగ్ (పంజాబ్ కింగ్స్) – 21 వికెట్లు




















