SRH vs RR IPL 2024 Qualifier 2: ఎస్‌ఆర్‌హెచ్, ఆర్‌ఆర్ పాతరికార్డులు ఏం చెబుతున్నాయి? చెన్నైలో వాతావరణం ఎలా ఉంది? వర్షం విలన్ అవుతుందా?
SRH vs RR IPL 2024 Qualifier 2: ఐపిఎల్ 17 వ సీజన్ క్వాలిఫయర్-2లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ ను రాత్రి 7.30 గంటలకు చెపాక్‌లో తలపడనున్నాయి.
Records Between SRH And RR In IPL: IPL 2024లో ఈరోజు జరగనున్న క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), రాజస్థాన్ రాయల్స్(RR) జట్లు తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు చెన్నై చెపాక్‌లో ఇరు జట్లు ఒకదానికొకటి ఢీ కొట్టనున్నాయి. ఈ రెండు జట్ల మధ్య గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకొని, శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని కోల్‌కతా నైట్ రైడర్స్‌తో కప్పు కోసం పోటీ పడుతుంది. అయితే చెన్నైలో వాతావరణం ఎలా ఉంటుంది? అతి ముఖ్యమైన ఈ మ్యాచ్‌లో వర్షం విలన్ అవుతుందా? అనే అనుమానం ఉంది.
హెడ్ టు హెడ్ రికార్డులు
హైదరాబాద్- రాజస్థాన్ జట్లు ఇప్పటి వరకు మొత్తం 19సార్లు తలపడ్డాయి. ఇందులో హైదరాబాద్ పది మ్యాచులు గెలవగా... రాజస్థాన్ తొమ్మిది మ్యాచులలో గెలిచింది. క్వాలిఫైయర్ 1లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఎనిమిది వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నంలో ఉంది. ఈ సీజన్ లో మే 2 న ఈ రెండు జట్లు తొలిసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో రాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న సన్‌రైజర్స్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా భువి నిలిచాడు.
చివరి 5 IPL మ్యాచ్‌లలో SRH vs RR
2024- SRH 1 పరుగుతో గెలిచింది.
2023- SRH 4 వికెట్ల తేడాతో గెలిచింది.
2023- RR 72 పరుగుల తేడాతో గెలిచింది.
2022- RR 61 పరుగులతో గెలిచింది.
2021- SRH 7 వికెట్ల తేడాతో గెలిచింది.
IPL చరిత్రలో SRH vs RR మ్యాచ్ లలో అదరగోట్టిన ఆటగాళ్ళు
సన్‌రైజర్స్ హైదరాబాద్ కోసం అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు శిఖర్ ధావన్ (253 పరుగులు)కాగా రాజస్థాన్ కోసం అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ సంజు శాంసన్ (688 పరుగులు), అలాగే హైదరాబాద్ అత్యధిక వికెట్లు భువనేశ్వర్ కుమార్ (15 వికెట్లు), అలాగే రాజస్థాన్ కోసం అత్యధిక వికెట్లు జేమ్స్ ఫాల్క్‌నర్ (12 వికెట్లు) తీశారు.
పిచ్ రిపోర్ట్ అండ్ వెదర్
శుక్రవారం చెన్నైలో ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్ నుంచి 29 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందువల్ల, చెపాక్‌లో ఆటగాళ్లు వేడిని భరించాల్సి ఉంటుంది. ఇక రెండో ఇన్నింగ్స్ ఆడేవారిపై మంచు ప్రభావం కూడా ఉండచ్చు. అందుకే టాస్ గెలిచిన టీం బౌలింగ్ ఎంచుకునే అవకాశాలే ఎక్కువ. చారిత్రాత్మకంగా, చెపాక్ వికెట్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇక్కడ బ్యాటింగ్ అంట సుళువు కాదు. ఉప్పల్ స్టేడియం, లేదా వాంఖడే స్టేడియం లలో రికార్డ్ అయినంత భారీ స్కోర్ లు ఇక్కడ రాబట్టడం కష్టమే.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ప్రాబబుల్ ప్లేయింగ్ 11: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్ (WK), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (c), సన్వీర్ సింగ్, భువనేశ్వర్ కుమార్, విజయకాంత్ వియాస్కాంత్.
రాజస్థాన్ రాయల్స్ (RR) ప్రాబబుల్ ప్లేయింగ్ 11: టామ్ కోహ్లర్-కాడ్మోర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్.