అన్వేషించండి

Virat Kohli Records: ఐపీఎల్‌లో కోహ్లీ కొత్త రికార్డులు - స్ట్రైక్ రేట్ లేదన్న వాళ్లకు సిక్సర్లతో రిప్లై

IPL 2024: ఐపీఎల్‌ 2024లో కోహ్లీ మొదటి నుంచి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గానే ఉన్నాడు. కొన్నాళ్లు సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ దగ్గరికి ఆరెంజ్ క్యాప్ వెళ్లినా మళ్లీ తిరిగి కింగ్ దగ్గరికి వచ్చేసింది.

Virat Kohli Records In IPL 2024: ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లీ రికార్డుల మోత కొనసాగుతూనే ఉంది. ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీ 600 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో ఒక సీజన్‌లో విరాట్ కోహ్లీ 600కు పైగా పరుగులు చేయడం ఇది నాలుగో సారి. ఐపీఎల్ 2013 సీజన్‌లో విరాట్ కోహ్లీ 634 పరుగులు చేశాడు. విరాట్ ఒక ఐపీఎల్ సీజన్‌లో 600కు పైగా పరుగులు చేయడం ఇదే మొదటిసారి. అనంతరం 2016 సీజన్‌లో విరాట్ ఏకంగా 973 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఒక సీజన్‌లో ఒక బ్యాటర్ చేసిన అత్యధిక పరుగులు ఇవే. ఎనిమిది సంవత్సరాలు అయినా ఆ రికార్డు ఇంతవరకు బ్రేక్ అవ్వలేదు. అనంతరం ఐపీఎల్ 2023 సీజన్‌లో 639 పరుగులు చేశాడు. ఇప్పుడు వరుసగా రెండో సీజన్‌లో కూడా 600కు పైగా పరుగులు సాధించాడు. ఓవరాల్‌గా చూసుకుంటే నాలుగో సారి.

సర్‌ప్రైజింగ్ విషయం ఏంటంటే ఈ రికార్డు సాధించిన మొదటి ఆటగాడు కింగ్ కోహ్లీ కాదు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో తన ఆటతీరుతో విమర్శలు ఎదుర్కొంటున్న కేఎల్ రాహుల్ కూడా ఒక సీజన్‌లో 600కు పైగా పరుగులను నాలుగు సార్లు సాధించాడు. కేఎల్ రాహుల్ 2018, 2020, 2021, 2022 సీజన్లలో 600కు పైగా పరుగులను సాధించాడు. క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్ చెరో మూడు సార్లు, ఫాఫ్ డుఫ్లెసిస్ రెండు సార్లు ఈ ఫీట్‌ను సాధించారు. ఈ సీజన్‌లో విరాట్ కోహ్లీ 12 మ్యాచ్‌ల్లో 634 పరుగులు సాధించాడు. బ్యాటింగ్ యావరేజ్ 70.44 కాగా, స్ట్రైక్ రేట్ 153.51గా ఉంది. ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు కొట్టారు.

ఐపీఎల్ 2024లో 30 సిక్సర్లు కొట్టిన విరాట్ 

2024 ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ మొదటి నుంచి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గానే ఉన్నాడు. మధ్యలో కొన్నాళ్లు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ దగ్గరికి ఆరెంజ్ క్యాప్ వెళ్లినా మళ్లీ తిరిగి కింగ్ దగ్గరికి వచ్చేసింది. అయితే ఇన్ని పరుగులు సాధిస్తున్నా విమర్శలు మాత్రం ఆగలేదు. స్ట్రైక్ రేట్ ఎక్కువ లేదు... జట్టు విజయం కోసం కాకుండా వ్యక్తిగత రికార్డుల కోసం ఆడుతున్నాడు. గేమ్‌లో ముందుకు వెళ్లే కొద్దీ స్ట్రైక్ రేట్ తగ్గిపోతుంది అని. కానీ కింగ్ కోహ్లీ ఒక్క ఇన్నింగ్స్‌తో ఆ విమర్శలు అన్నిటికీ చెక్ చెప్పేశాడు.

గురువారం రాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 47 బంతుల్లోనే ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 92 పరుగులు చేశారు. దాదాపు 200 స్ట్రైక్ రేట్‌తో కోహ్లీ ఈ ఇన్నింగ్స్ ఆడి విమర్శకుల అందరి నోళ్లు మూయించాడు. ఈ ఇన్నింగ్స్‌తో విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2024 సీజన్‌లో 30 సిక్సర్లు కొట్టాడు. సన్‌రైజర్స్ కాటేరమ్మ చిన్న కొడుకు అభిషేక్ శర్మ తర్వాత ఐపీఎల్ 2024 సీజన్‌లో 30 సిక్సర్లు పూర్తి చేసుకున్న రెండో బ్యాటర్‌గా కింగ్ కోహ్లీ నిలిచాడు. అభిషేక్ శర్మ 35 సిక్సర్లతో హయ్యస్ట్ సిక్సర్లలో టాప్‌గా ఉన్నాడు. విరాట్ కోహ్లీ 30 సిక్సర్లతో భారతీయ బ్యాటర్లలో సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. ఓవరాల్‌గా ఐదో స్థానంలో ఉన్నాడు. అభిషేక్ శర్మకి, విరాట్ కోహ్లీకి మధ్యలో సునీల్ నరైన్, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ వంటి విధ్వంసకర విదేశీ బ్యాటర్లు ఉన్నారు. నిజానికి మొదటి నుంచి విరాట్ కోహ్లీ సిక్స్ హిట్టింగ్ ఎబిలిటీపై ఎవరికీ పెద్దగా నమ్మకం లేదు. కానీ సైలెంట్‌గా, చాప కింద నీటిలా విరాట్ సిక్సర్లు కొట్టుకుంటూ వెళ్లిపోయాడు. స్ట్రైక్ రేట్ విమర్శకులకు సిక్సర్లతో రిప్లై ఇచ్చాడు. విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2024 ఓవరాల్ స్ట్రైక్ రేట్ కూడా ఏకంగా 153కి పైగా ఉంది.

ఐపీఎల్ సెకండాఫ్‌లో అదరగొడుతున్న ఆర్సీబీ 
ఐపీఎల్ 2024 సీజన్‌లో ఆర్సీబీ ఆటతీరు అంచనాలకు అందని విధంగా సాగుతోంది. 4 మ్యాచ్‌ల క్రితం ఆర్సీబీ ఐపీఎల్ 2024 సీజన్ నుంచి దాదాపు అవుట్ అయిపోయింది అనుకున్నారంతా. కానీ సడెన్‌గా ఆర్సీబీ ప్లేఆఫ్స్ రేసులోకి తిరిగి వచ్చింది. ఇప్పటికి ఆర్సీబీ ఆడిన 12 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు, ఏడు ఓటములతో 10 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. నెట్ రన్‌రేట్ చాలా బాగుంది కాబట్టి మిగతా రెండు మ్యాచ్‌లూ గెలిచి కాస్త అదృష్టం కలిసొస్తే ఫ్లేఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ అవుతుందని అనుకోవచ్చు. సెకండాఫ్‌లో అద్భుతంగా ఆడుతుంది కానీ ఫస్టాఫ్‌లో ఆర్సీబీ ఆటతీరు ఫ్యాన్స్‌ కూడా తిట్టుకునేలా ఉంది.

ఐపీఎల్ 2024 మొదటి 8 మ్యాచ్‌ల్లో ఆర్సీబీ ప్రదర్శన అట్టర్ డిజాస్టర్. కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో లాస్ట్ ప్లేస్‌లో నిలిచి ఎలిమినేషన్‌కు ఒక్క ఓటమి దూరంలో నిలిచింది. కానీ అక్కడి నుంచి ఆర్సీబీ ఇచ్చిన కమ్‌బ్యాక్ మాత్రం ఊరమాస్. తర్వాతి నాలుగు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించి సెకండాఫ్‌ను సూపర్ హిట్‌గా మార్చింది. నెట్‌రన్‌రేట్‌ను కూడా బాగా మెరుగుపరుచుకుంది. ఐదు నుంచి 10 స్థానాల వరకు ఉన్న అన్ని జట్లలో ఆర్సీబీ నెట్ రన్‌రేటే ఎక్కువగా ఉండటం విశేషం. గత నాలుగు మ్యాచ్‌ల్లో బలమైన సన్‌రైజర్స్‌పై 35 పరుగులతో, పంజాబ్ కింగ్స్‌పై 60 పరుగులతో విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్‌పై తొమ్మిది వికెట్లతో ఒకసారి, నాలుగు వికెట్లతో మరోసారి గెలిచింది. ఆర్సీబీ తన తర్వాతి మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌ల్లో విజయం సాధించి సమీకరణాలు అనుకూలిస్తే ఆర్సీబీని ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌లో చూడవచ్చు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Happy New Year 2025: అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
SCR: 'రత్నాచల్' ఎక్స్ ప్రెస్ టైమింగ్ మారింది తెలుసా! - జనవరి 1 నుంచి ఈ రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు, ద.మ రైల్వే కీలక ప్రకటన
'రత్నాచల్' ఎక్స్ ప్రెస్ టైమింగ్ మారింది తెలుసా! - జనవరి 1 నుంచి ఈ రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు, ద.మ రైల్వే కీలక ప్రకటన
Dil Raju Reply To KTR:   చిత్ర పరిశ్రమను రాజకీయాలకు వాడుకోవద్దు - కేటీఆర్‌కు దిల్ రాజు ఘాటు రిప్లై
చిత్ర పరిశ్రమను రాజకీయాలకు వాడుకోవద్దు - కేటీఆర్‌కు దిల్ రాజు ఘాటు రిప్లై
New Year 2025: న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ ఎంట్రీ - ఎలా స్వాగతం చెప్పారో మీరే చూడండి - వీడియో
న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ ఎంట్రీ - ఎలా స్వాగతం చెప్పారో మీరే చూడండి - వీడియో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KA Paul Interview on Allu Arjun | అంబేడ్కర్ ని తిట్టినోళ్లు యూజ్ లెస్ ఫెలోస్ | ABP DesamDeputy CM Pawan kalyan on Allu Arjun | సంధ్యా థియేటర్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ | ABP DesamISRO SpaDEX Docking Experiment | తొలిసారిగా డాకింగ్ ప్రయోగం చేస్తున్న ఇస్రో | ABP Desamఅమిత్ షాకి అదో ఫ్యాషన్, మాలల సత్తా చూపిస్తాం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Happy New Year 2025: అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
SCR: 'రత్నాచల్' ఎక్స్ ప్రెస్ టైమింగ్ మారింది తెలుసా! - జనవరి 1 నుంచి ఈ రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు, ద.మ రైల్వే కీలక ప్రకటన
'రత్నాచల్' ఎక్స్ ప్రెస్ టైమింగ్ మారింది తెలుసా! - జనవరి 1 నుంచి ఈ రైళ్ల ప్రయాణ వేళల్లో మార్పులు, ద.మ రైల్వే కీలక ప్రకటన
Dil Raju Reply To KTR:   చిత్ర పరిశ్రమను రాజకీయాలకు వాడుకోవద్దు - కేటీఆర్‌కు దిల్ రాజు ఘాటు రిప్లై
చిత్ర పరిశ్రమను రాజకీయాలకు వాడుకోవద్దు - కేటీఆర్‌కు దిల్ రాజు ఘాటు రిప్లై
New Year 2025: న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ ఎంట్రీ - ఎలా స్వాగతం చెప్పారో మీరే చూడండి - వీడియో
న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ ఎంట్రీ - ఎలా స్వాగతం చెప్పారో మీరే చూడండి - వీడియో
KTR Quash Petition: కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై  తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
5000 Note in New Year: 2025లో  రూ. 5వేల నోటు రిలీజ్ - ఆర్బీఐ వర్గాలు ఇస్తున్న క్లారిటీ ఇదే
2025లో రూ. 5వేల నోటు రిలీజ్ - ఆర్బీఐ వర్గాలు ఇస్తున్న క్లారిటీ ఇదే
Kodali Nani aide arrested: అస్సాం పారిపోయిన కొడాలి నాని రైట్ హ్యాండ్ - పట్టుకొచ్చిన పోలీసులు !
అస్సాం పారిపోయిన కొడాలి నాని రైట్ హ్యాండ్ - పట్టుకొచ్చిన పోలీసులు !
Perni Nani In Ration Rice Case: రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
Embed widget