అన్వేషించండి

IPL 2026: ఆర్‌సిబి ట్రంప్ కార్డ్స్‌ ఈ ముగ్గురే! వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలబెడతారా?

IPL 2026: రజత్ పాటిదార్ కెప్టెన్సీలో బెంగళూరు వరుసగా రెండోసారి చరిత్ర సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వారి తొలి మ్యాచ్ మార్చి 28న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగనుంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డిఫెండింగ్ ఛాంపియన్లుగా ఒత్తిడిలో ఉన్నారు.
  • రజత్ పాటిదార్ సారథ్యంలో బెంగళూరు వరుసగా రెండోసారి చరిత్ర సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
  • విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, వెంకటేష్ అయ్యర్ కీలక ఆటగాళ్లుగా మారనున్నారు.
  • విరాట్ కోహ్లీ 2016 రికార్డును పునరావృతం చేయగల సత్తా కలిగి ఉన్నాడు.

IPL 2026: ఐపీఎల్ 2026 ప్రారంభమైనప్పుడు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపైనే అత్యధిక ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే వారు డిఫెండింగ్ ఛాంపియన్లు, ట్రోఫీని విజయవంతంగా కాపాడుకోవడం ఏ క్రీడలోనైనా అత్యంత సవాలుతో కూడుకున్న టాస్క్‌లలో ఒకటి. రజత్ పాటిదార్ కెప్టెన్సీలో, బెంగళూరు వరుసగా రెండోసారి చరిత్ర సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. వారి మొదటి మ్యాచ్ మార్చి 28న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగనుంది. ఈసారి ఆర్‌సిబికి ట్రంప్ కార్డ్‌లుగా నిరూపించుకోగల ముగ్గురు ఆటగాళ్లను ఇక్కడ చూద్దాం.

ముందుగా చెప్పుకోదగ్గ పేరు విరాట్ కోహ్లీ. ఈ తరం అత్యంత టాలెంటెడ్‌ బ్యాట్స్‌మన్‌ ఏం చేయబోతున్నాడనే అందరు ఆసక్తిగా చూస్తున్నారు.  ఓపెనింగ్‌లో వేగంగా ఆరంభించడం, మధ్య ఓవర్లలో స్కోరును వేగంగా ముందుకు తీసుకెళ్లడం, లేదా డెత్ ఓవర్లలో మ్యాచ్‌ను ముగించడం వంటి ఏ పరిస్థితి నుంచైనా మ్యాచ్‌ను ఎలా గెలిపించాలో అతనికి బాగా తెలుసు. అందుకే ఈ సీజన్‌లో విరాట్ ఆటతీరుప ఎలా ఉంటుందనే లెక్కలు వెసుకుంటున్నారు అభిమానులు. 

ఐపీఎల్ 2025లో, అతను ఎనిమిది అర్ధ సెంచరీలతో సహా 657 పరుగులు చేశాడు. తన కెరీర్ మొత్తంలో 8,661 పరుగులు సాధించిన అతను, 2016లో 973 పరుగులు చేసిన తన ప్రదర్శనను పునరావృతం చేయగల సత్తా కలిగి ఉన్నాడు. ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పటికీ అదే పేరిట ఉంది.

ఇంగ్లండ్ విధ్వంసకర ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ఫిల్ సాల్ట్

ఐపీఎల్ 2025లో ఓపెనర్‌గా అద్భుతంగా రాణించాడు. అతను ఆ సీజన్ మొత్తంలో 13 మ్యాచ్‌లలో 403 పరుగులు చేశాడు. 2026 టీ20 ప్రపంచకప్‌లో అతనికి అంతగా కలిసి రాలేదు, కానీ ఇప్పుడు ఐపీఎల్‌లో తిరిగి బరిలోకి దిగుతున్నాడు. సాల్ట్ బ్యాట్ ఒకసారి ఫామ్‌లోకి వచ్చింది అంటే మాత్రం ప్రత్యర్థులకు చుక్కలే. అంపైర్లు ఎక్స్‌ర్‌సైజ్‌లు చేయాల్సిందే. ఇదే సాల్ట్, ఐపీఎల్ 2025 మొదటి క్వాలిఫయర్‌లో పంజాబ్ కింగ్స్‌పై 27 బంతుల్లో అజేయంగా 56 పరుగులు చేసి, బెంగళూరును నేరుగా ఫైనల్‌కు చేర్చాడు.

తన ఐపీఎల్ కెరీర్‌లో తొలిసారిగా కేకేఆర్ కాకుండా వేరే జట్టు తరఫున ఆడనున్న వెంకటేష్

అయ్యర్‌పై అందరి దృష్టి ఉంటుంది. మినీ-వేలంలో బెంగళూరు జట్టు అయ్యర్‌ను ₹7 కోట్లకు దక్కించుకుంది. ఆర్‌సీబీ జట్టు కూర్పును బట్టి చూస్తే, అయ్యర్‌కు మిడిల్ ఆర్డర్‌లో స్థానం ఇచ్చే అవకాశం ఉంది. తన 62 మ్యాచ్‌ల ఐపీఎల్ కెరీర్‌లో 1,468 పరుగులు చేసిన అయ్యర్, ఈ సీజన్‌లో ఆర్‌సీబీకి ఒక ప్రధాన ఎక్స్-ఫ్యాక్టర్‌గా నిరూపించుకోగలడు.

Frequently Asked Questions

ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఎలాంటి ఒత్తిడి ఉంటుంది?

ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై అత్యధిక ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే వారు డిఫెండింగ్ ఛాంపియన్లు, ట్రోఫీని విజయవంతంగా కాపాడుకోవడం సవాలుతో కూడుకున్న పని.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటి మ్యాచ్ ఎవరితో జరుగుతుంది?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మొదటి మ్యాచ్ మార్చి 28న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగనుంది.

ఐపీఎల్ 2026లో ఆర్‌సిబికి ట్రంప్ కార్డ్‌లుగా నిరూపించుకోగల ముగ్గురు ఆటగాళ్లు ఎవరు?

విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, మరియు వెంకటేష్ అయ్యర్‌లు ఐపీఎల్ 2026లో ఆర్‌సిబికి ట్రంప్ కార్డ్‌లుగా నిరూపించుకోగలరు.

విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2025లో ఎన్ని పరుగులు చేశాడు?

ఐపీఎల్ 2025లో విరాట్ కోహ్లీ ఎనిమిది అర్ధ సెంచరీలతో సహా 657 పరుగులు చేశాడు.

ఫిల్ సాల్ట్ ఐపీఎల్ 2025లో ఎన్ని పరుగులు చేశాడు?

ఫిల్ సాల్ట్ ఐపీఎల్ 2025లో 13 మ్యాచ్‌లలో 403 పరుగులు చేశాడు.

టాప్ హెడ్ లైన్స్

Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Ritika Nayak: కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
AP JAC Demands: ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
ఆగస్టు 15లోగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే: ఏపీ జేఏసీ డెడ్‌లైన్
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
Embed widget