అన్వేషించండి

SunRisers Hyderabad In IPL 2025: రెండో టైటిల్ పై గురి.. గతేడాది కంటే ఈసారి మ‌రింత బ‌లంగా టీమ్.. తగ్గేదేలే అంటున్న ఆరెంజ్ ఆర్మీ..

ఎస్ఆర్ హెచ్ ఈ ఏడాది త‌న టీమ్ ను మ‌రింత ప‌టిష్టం ప‌రుచుకుంది. ముఖ్యంగా ఇషాన్ కిష‌న్, అభిన‌వ్ రాక‌తో మిడిలార్డ‌ర్ మ‌రింత ప‌టిష్టంగా మారింది. అలాగే బౌలింగ్ లో ష‌మీ, జంపా, హ‌ర్ష‌ల్ తో బలంగా మారింది.

SRH Team Analysis In IPL 2025: సన్ రైజర్స్.. గతేడాది టోర్నీ అంత‌టా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన పేరింది. విధ్వంస‌క‌ర బ్యాటింగ్ తో ప్ర‌త్య‌ర్థుల వెన్నులో వ‌ణుకు పుట్టించిన ఎస్ఆర్ హెచ్ ఈ ఏడాది త‌న టీమ్ ను మ‌రింత ప‌టిష్టం ప‌రుచుకుంది. ముఖ్యంగా ఇషాన్ కిష‌న్, అభిన‌వ్ మ‌నోహ‌ర్ రాక‌తో మిడిలార్డ‌ర్ మ‌రింత ప‌టిష్టంగా మారింది. అలాగే బౌలింగ్ కూడా రాటుదేలింది. వెట‌ర‌న్ మ‌హ్మ‌ద్ ష‌మీ, ఆడ‌మ్ జంపా, హ‌ర్ష‌ల్ ప‌టేల్, రాహుల్ చ‌హ‌ర్‌, జ‌య‌దేవ్ ఉనాద్క‌ట్ త‌దిత‌ర బౌల‌ర్ల‌ను తీసుకుని మ‌రింత ప‌టిష్టంగా మారింది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ప‌రుగుల సునామీ కురిపించాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఓపెన‌ర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శ‌ర్మ జంట ఫియ‌ర్లెస్ బ్యాటింగ్ తో ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్కలు చూపించాల‌ని కోరుకుంటున్నారు. గ‌తేడాది వీళ్లిద్ద‌రి బ్యాటింగ్ తో చాలాసార్లు జ‌ట్టు 250 ప‌రుగుల‌ను అల‌వోక‌గా సాధించింది. ఈసారి వీరి జోరు కొన‌సాగించాల‌ని ఆశిస్తున్నారు. వ‌న్ డౌన్ లో ఇషాన్ కిషాన్ రాక‌తో బ్యాటింగ్ బ‌లం మ‌రింత‌గా పెరిగింది. విధ్వంస‌క‌ర ఆట‌కు పెట్టింది పేరైనా, చోటా డైనమెట్ ఇషాన్.. విజృంభించాల‌ని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. ఆల్రెడీ ఇంట్రా స్క్వాడ్ పోటీల్లో త‌న త‌డాఖా చూపించాడు. 

ప‌టిష్ట‌మైన మిడిలార్డ‌ర్..
నెం.4లో తెలుగు ప్లేయ‌ర్ నితీశ్ రెడ్డి ఆడ‌తాడు. ఆల్ రౌండ‌ర్ గా త‌ను ఎంత ప్ర‌భావం చూప‌గ‌ల‌డో గ‌తేడాది నిరూపించాడు. ఇక టీ20ఐ, టెస్టుల్లో స‌త్తా చాట‌డంతో త‌న ఆత్మ విశ్వాసం హైలో ఉంది. అయితే గాయంతో నెల‌పాటు క్రికెట్ కు దూరంగా ఉండ‌టం మైన‌స్ పాయింట్ అయినా, ప్రాక్టీస్ తో దాన్ని అధిగ‌మించ‌గ‌ల‌డు. నె0.5లో హెన్రిచ్ క్లాసెన్ ఆడ‌తాడు. అత‌ని గురించి కొత్త‌గా చెప్పాల్సిందేమీ లేదు. నిలుచున్న చోటునుంచే అల‌వోక‌గా సిక్సులు కొట్ట‌డంలో దిట్ట‌.. అభిన‌వ్ మ‌నోహ‌ర్ కు హిట్ట‌ర్ గా మంచి పేరుంది. ఇక అధ‌ర్వ తైడే, స‌చిన్ బేబీ త‌దిత‌రుల‌ను కూడా ప్రయోగించి చూడొచ్చు. 

ష‌మీ నిల‌క‌డ‌గా ఆడాలి..
కాస్త ఫిట్ నెస్ స‌మస్య‌లు ఎదుర్కొంటున్న ష‌మీ.. ఈ టోర్నీలో స‌త్తా చాటాలి. అయితే టోర్నీ ముగిశాక‌, కీల‌క‌మైన ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న ఉండటంతో మ‌ళ్లీ ఫిట్నెస్ స‌మస్య‌లు రాకుండా చూసుకోవాల్సిన బాధ్య‌త టీమ్ మేనేజ్మెంట‌ప్ పై ఉంది. కెప్టెన్ పాట్ క‌మిన్స్, హ‌ర్ష‌ల్ ప‌టేల్, ఉనాద్క‌ట్, రాహుల్ చ‌హ‌ర్, జంపాల‌తో బౌలింగ్ ప‌టిష్టంగా ఉంది. వీలును బ‌ట్టి, జ‌ట్టు కూర్పు ఉండ‌వ‌చ్చు. ఇక గ‌తేడాది ధ‌నాధ‌న్ ఆట‌తీరుతో ఫైన‌ల్ కు వ‌చ్చి, తుస్సుమ‌నిపించిన ఆరెంజ్ ఆర్మీ.. ఈసారి మాత్రం ఎలాగైనా క‌ప్పు కొట్టాల‌ని అంద‌రూ భావిస్తున్నారు.గ‌తంతో పోలిస్తే ఈసారి మ‌రింత స‌మ‌తూకంగా క‌నిపిస్తున్న జ‌ట్టు ఐపీఎల్లో త‌మ రెండో టైటిల్ ను ఒడిసి ప‌ట్టాల‌ని పులువురు కోరుకుంటున్నారు. 
 
స‌న్ రైజర్స్ హైద‌రాబాద్ స్క్వాడ్:  పాట్ కమిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, అథర్వ తైడే, అభినవ్ మనోహర్, సిమర్జీత్ సింగ్, జీషాన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కట్, బ్రైడన్ కార్స్, కమిందు మెండిస్, అనికేత్ వర్మ, ఈషన్ మలింగ, సచిన్ బేబీ.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rohit Sharma Record: విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన హిట్ మ్యాన్.. త్వరలో ధోనీని వెనక్కి నెట్టే చాన్స్ 
విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన హిట్ మ్యాన్.. త్వరలో ధోనీని వెనక్కి నెట్టే చాన్స్ 
IPL 2026 Playoff Venues: ఐపీఎల్ 2026 ఫైనల్ వేదికపై వీడని ఉత్కంఠ.. బెంగళూరులో టికెట్ల లొల్లితో బీసీసీఐ కొత్త ప్లాన్! పంజాబ్ వర్సెస్ కర్ణాటక వేదికగా ప్లేఆఫ్స్ పోరు
ఐపీఎల్ 2026 ఫైనల్ వేదికపై వీడని ఉత్కంఠ.. బెంగళూరులో టికెట్ల లొల్లితో బీసీసీఐ కొత్త ప్లాన్!
IPL 2026 CSK VS DC Result Update: సీఎస్కే గ్రాండ్ విక్ట‌రీ.. సంజూ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ.. రాణించి కార్తీక్, చిత్తుగా ఓడిన డీసీ
సీఎస్కే గ్రాండ్ విక్ట‌రీ.. సంజూ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ.. రాణించి కార్తీక్, చిత్తుగా ఓడిన డీసీ
IPL 2026 MI VS LSG Result Updates: ముంబై రికార్డు ఛేజింగ్.. LSGపై ఘ‌న‌విజ‌యం, స‌త్తా చాటిన రోహిత్, రికెల్ట‌న్
ముంబై రికార్డు ఛేజింగ్.. LSGపై ఘ‌న‌విజ‌యం, స‌త్తా చాటిన రోహిత్, రికెల్ట‌న్

వీడియోలు

Mobile danger while driving | పంజాబ్ యువతి ప్రాణాల మీదకు తెచ్చుకుంది.
RR vs DC IPL 2026 Highlights | ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ రికార్డ్ ఛేజ్
Kyle Jamieson vs Vaibhav IPL 2026 RR vd DC | జేమిసన్‌పై నెటిజన్ల ఫైర్.. అసలేం జరిగిందంటే ?
RS Ambarish in Sunrisers Hyderabad Team | SRH టీమ్ లోకి అండర్-19 వరల్డ్ కప్ హీరో
Riyan Parag talks about Smoking Controversy | విమర్శకులకు రియాన్ పరాగ్ ఘాటు వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RB Choudary : సినీ ఇండస్ట్రీలో విషాదం - రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి దుర్మరణం
సినీ ఇండస్ట్రీలో విషాదం - రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నిర్మాత ఆర్‌బీ చౌదరి దుర్మరణం
South Coastal Railway Zone:ఆంధ్రప్రదేశ్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం! రైల్వే జోన్‌పై కీలక నిర్ణయం వచ్చేసింది!
ఆంధ్రప్రదేశ్‌కు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం! రైల్వే జోన్‌పై కీలక నిర్ణయం వచ్చేసింది!
Bengal Politics: మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే ఏమవుతుంది? - రాజ్యాంగం ఏం చెబుతోందంటే?
మమతా బెనర్జీ రాజీనామా చేయకపోతే ఏమవుతుంది? - రాజ్యాంగం ఏం చెబుతోందంటే?
Tiruppattur Result: తమిళనాడు ఎన్నికల్లో సంచలనం... ఒక్క ఓటు మెజార్టీతో గెలిచిన TVK అభ్యర్థి
తమిళనాడు ఎన్నికల్లో సంచలనం... ఒక్క ఓటు మెజార్టీతో గెలిచిన TVK అభ్యర్థి
Telangana Rains Update: తెలంగాణ వాసులకు చల్లటి వార్త.. 2, 3 రోజులపాటు దిగిరానున్న పగటి ఉష్ణోగ్రతలు
తెలంగాణ వాసులకు చల్లటి వార్త.. 2, 3 రోజులపాటు దిగిరానున్న పగటి ఉష్ణోగ్రతలు
తమిళనాడులో TVK ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుంది? విజయ్ ముందు ఉన్న ఆ 3 ఆప్షన్లు ఇవే
తమిళనాడులో TVK ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తుంది? విజయ్ ముందు ఉన్న ఆ 3 ఆప్షన్లు ఇవే
BJP’s CM face in West Bengal: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి ఎవరు? ఫలితాలపై భద్ర నీడ ప్రభావం, ఆశ్చర్యకరమైన పేరు తెరపైకి వస్తుందా?
పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి ఎవరు? ఫలితాలపై భద్ర నీడ ప్రభావం, ఆశ్చర్యకరమైన పేరు తెరపైకి వస్తుందా?
AP POLYCET Results 2026: ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల, వాట్సాప్‌లోనూ రిజల్ట్స్ చెక్ చేసుకోండి
AP POLYCET Results 2026: ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల, వాట్సాప్‌లోనూ రిజల్ట్స్ చెక్ చేసుకోండి
Embed widget