అన్వేషించండి

IPL 2024: రికార్డుల పోరుకు, హైదరాబాద్‌ సిద్ధం

SRH vs RCB, IPL 2024: గత మ్యాచ్‌లోచుక్కలు చూపించిన హైదరాబాద్‌ మరోసారి పిడుగులా విరుచుకు పడాలని చూస్తోంది. ప్లే ఆఫ్‌ అవకాశాలు పూర్తిగా మూసుకుపోనుండడంతో ఆర్ సీబీ కూడా ఈ మ్యాచ్‌లో గెలవాలని చూస్తోంది.

SRH vs RCB IPL 2024 Preview and Prediction: ఐపీఎల్ 2024(IPL) సీజన్‌ 41వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)తో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) తలపడనుంది. గత మ్యాచ్‌లో బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించిన హైదరాబాద్‌ మరోసారి పిడుగులా విరుచుకు పడాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో ఓడితే ప్లే ఆఫ్‌ అవకాశాలు పూర్తిగా మూసుకుపోనుండడంతో బెంగళూరు కూడా ఈ మ్యాచ్‌లో గెలవాలని చూస్తోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా బెంగళూరు మిణుకుమిణుకుమంటున్న ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవచ్చు. 

రికార్డులు బద్దలు కావాల్సిందేనా...
బ్యాటర్ల స్వర్గధామంగా మారిన హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో SRH జట్టుతో RCB జట్టు తలపడనుంది. ఇది మరో రికార్డుల పోరుగా మారనుందని అభిమానులు భావిస్తున్నారు. ఇదే సీజన్‌లో జరిగిన గత మ్యాచ్‌లో బెంగళూరుపై 287 పరుగులు చేసి హైదరాబాద్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో  ఆర్సీబీ 262 పరుగులు మాత్రమే చేసింది. ఇప్పుడు రెండు జట్లు మళ్లీ తలపడేందుకు సిద్ధమయ్యాయి. గత మ్యాచ్‌లో ఇరు జట్లు మొత్తం 549 పరుగులు చేయడంతో ఈ మ్యాచ్‌లోనూ పరుగుల వర్షం కురిసే అవకాశం ఉంది. ఆర్సీబీతో జరిగిన గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 22 సిక్సర్లు కొట్టారు . ఆ మ్యాచ్‌లో మొత్తం 81 బౌండరీలు నమోదయ్యాయి. అందువల్ల ఈ మ్యాచ్‌లోనూ సిక్స్-ఫోర్ల వర్షం కురిసే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో హైదరాదాబ్‌ గెలిచినా బెంగళూరు గొప్ప పోటీని ఇచ్చింది. అందువల్ల ఈ మ్యాచ్‌లోనూ ఇరు జట్ల నుంచి ఉత్కంఠ పోరును ఆశించవచ్చు. ఈ ఐపీఎల్ ఎడిషన్‌లోనే మూడుసార్లు 250 పరుగుల మార్కును అధిగమించిన సన్‌రైజర్స్... మరోసారి బౌండరీల మోత మోగించాలని చూస్తోంది. ట్రావిస్ హెడ్ నేతృత్వంలోని హైదరాబాద్‌ బ్యాటింగ్ లైనప్... ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ హైదరాబాద్‌ పవర్‌ప్లేలో 125/0 స్కోర్ చేసి కొత్త చరిత్ర సృష్టించింది. హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ ఈ సీజన్‌లో విధ్వంసం సృష్టిస్తున్నారు. కెప్టెన్ పాట్ కమ్మిన్స్  జట్టును సమర్థంగా నడిపిస్తున్నాడు. ఐపీఎల్‌లో మొదటిసారిగా 300 పరుగుల మార్కును అందుకోవాలని హైదరాబాద్‌ ఉవ్విళ్లూరుతోంది. బలహీనమైన బెంగళూరు బౌలింగ్‌లో ఇది సాధమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.ఈ సీజన్‌లో ఆర్సీబీ అత్యుత్తమ బౌలర్‌ అయిన యష్‌ దయాల్‌..ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో టాప్‌20లో కూడా స్థానం సంపాదించలేదంటే బెంగళూరు బౌలింగ్ కష్టాలు అర్థం చేసుకోవచ్చు . 

అన్నీ కష్టాలే 
ఆర్సీబీ అన్ని విభాగాల్లో విఫలమవుతూ కష్టాలు ఎదుర్కొంటోంది. RCB వారి గత ఐదు మ్యాచ్‌లలో కనీసం 180 పరుగులు చేసింది. అయితే సమష్టిగా రాణించలేకపోవడంతో వారికి విజయం అందని ద్రాక్షగా మారిపోయింది. బౌలర్లు విఫలమవుతున్నా బ్యాటర్లు మాత్రం పోరాడుతూనే ఉన్నారు. 222 పరుగులు చేసినా కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో కేవలం ఒక పరుగు తేడాతో ఓడిపోవడం వారిని మరింత నిర్వేదంలో కూరుకుపోయేలా చేసింది. విరాట్ కోహ్లి ఇప్పటివరకు ఈ ఐపీఎల్‌లో అత్యుత్తమ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. 

జట్లు:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేసాయి, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్‌కుమార్ వైషాక్, ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కర్రాన్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ చౌహాన్.
సన్‌రైజర్స్ హైదరాబాద్: పాట్ కమిన్స్ (కెప్టెన్‌), అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్‌రామ్, మార్కో జాన్సెన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, టి. నటరాజన్, అన్మోల్‌ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, నితీష్ కుమార్ రెడ్డి, ఫజల్హాక్ ఫరూకీ, షాబాజ్ అహ్మద్, ట్రావిస్ హెడ్, జయదేవ్ ఉనద్కత్, ఆకాష్ సింగ్, ఝాతవేద్ సుబ్రమణ్యన్.

టాప్ హెడ్ లైన్స్

Rinku Singh Captaincy:  KKR కెప్టెన్సీ రేసులో ఊహించని ట్విస్ట్.. రహానే రిటైర్మెంట్‌తో రింకూకే పగ్గాలు ఇవ్వాలన్న మాజీ క్రికెట‌ర్
KKR కెప్టెన్సీ రేసులో ఊహించని ట్విస్ట్.. రహానే రిటైర్మెంట్‌తో రింకూకే పగ్గాలు ఇవ్వాలన్న మాజీ క్రికెట‌ర్
Mohammed Shami Trade: ఐపీఎల్ వేలానికి ముందు లక్నో- రాజస్థాన్ మధ్య మల్టీ ప్లేయర్ ట్రేడింగ్.. RR గూటికి స్టార్ పేస‌ర్.!
ఐపీఎల్ వేలానికి ముందు లక్నో- రాజస్థాన్ మధ్య మల్టీ ప్లేయర్ ట్రేడింగ్.. RR గూటికి స్టార్ పేస‌ర్.!
Axar Patel Captaincy: కెప్టెన్సీ వద్దంటూ DCకి అక్షర్ ఊహించని షాక్.. యాజమాన్యానికి కొత్త తలనొప్పి, పంత్ రీఎంట్రీతో మారనున్న సమీకరణాలు
కెప్టెన్సీ వద్దంటూ DCకి అక్షర్ ఊహించని షాక్.. యాజమాన్యానికి కొత్త తలనొప్పి, పంత్ రీఎంట్రీతో మారనున్న సమీకరణాలు
Mustafizur IPL Return: ఐపీఎల్ మినీ వేలంలోకి బంగ్లాదేశ్ ఆటగాళ్లకు గ్రీన్ సిగ్నల్, రేసులో ముస్తాఫిజుర్  సహా ఏడుగురు స్టార్లు
ఐపీఎల్ మినీ వేలంలోకి బంగ్లాదేశ్ ఆటగాళ్లకు గ్రీన్ సిగ్నల్, రేసులో ముస్తాఫిజుర్  సహా ఏడుగురు స్టార్లు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tanishq Gold Robbery: తనిష్క్ గోల్డ్ దోపీడీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
తనిష్క్ గోల్డ్ దోపీడీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
SpaceX Starship Flight 15: అంతరిక్ష చరిత్రలో స్పేస్ఎక్స్ మరో రికార్డు.. భూమికి తిరిగొచ్చిన స్టార్‌షిప్ రాకెట్‌ను చాప్‌స్టిక్స్‌తో క్యాచ్!
అంతరిక్ష చరిత్రలో స్పేస్ఎక్స్ మరో రికార్డు.. భూమికి తిరిగొచ్చిన స్టార్‌షిప్ రాకెట్‌ను చాప్‌స్టిక్స్‌తో క్యాచ్!
Tiger Tension: ఏలూరు జిల్లాలో జనావాసాల్లోకి పెద్దపులి.. ఇళ్ల మధ్యకి రావడంతో వణికిపోతున్న స్థానికులు
ఏలూరు జిల్లాలో జనావాసాల్లోకి పెద్దపులి.. ఇళ్ల మధ్యకి రావడంతో వణికిపోతున్న స్థానికులు
Tirupati Crime News: అప్పు తిరిగి చెల్లించలేదని తల్లితో పాటు 6 నెలల చిన్నారి కిడ్నాప్! తిరుపతి జిల్లాలో దారుణం
అప్పు తిరిగి చెల్లించలేదని తల్లితో పాటు 6 నెలల చిన్నారి కిడ్నాప్! తిరుపతి జిల్లాలో దారుణం
Andhra Pradesh Rains: ఏపీకి మరో తుపాను ముప్పు, వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 18 నుంచి భారీ వర్షాలు
ఏపీకి మరో తుపాను ముప్పు, వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 18 నుంచి భారీ వర్షాలు
Mohit Ulva Journey: టెన్నిస్ బాల్ క్రికెట్ నుంచి పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన రియల్ హీరో దాకా..  జడేజా కోచ్ శిక్షణలో రాటుదేలిన 18 ఏళ్ల మోహిత్ స్ఫూర్తిదాయక ప్రస్థానం
టెన్నిస్ బాల్ క్రికెట్ నుంచి పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన రియల్ హీరో దాకా..  జడేజా కోచ్ శిక్షణలో రాటుదేలిన 18 ఏళ్ల మోహిత్ స్ఫూర్తిదాయక ప్రస్థానం
AP Local Body Elections: అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు: ఏపీ ఎస్‌ఈసీ
అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు
Sarpanch Post Auction: వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
Embed widget