SRH Vs LSG: ఉప్పల్‌లో టాస్ రైజర్స్‌దే - మొదట బ్యాటింగ్‌కు దిగనున్న ఆరెంజ్ ఆర్మీ!
ఐపీఎల్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
Sunrisers Hyderabad vs Lucknow Super Giants: ఐపీఎల్ 2023 సీజన్ 56వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో మొదట లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మొదట బౌలింగ్ చేయనుంది.
ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక మార్పు చేసింది. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ సన్వీర్ సింగ్ తిరిగి జట్టులోకి రానున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ మాత్రం రెండు మార్పులు చేసింది. దీపక్ హుడా స్థానంలో ప్రేరక్ మన్కడ్, మొహ్‌సిన్ ఖాన్ స్థానంలో యుధ్‌వీర్ సింగ్ చారక్ తుది జట్టులోకి రానున్నారు.
పాయింట్ల పట్టికలో లక్నో సూపర్ జెయింట్స్ ఐదో స్థానంలోనూ, సన్‌రైజర్స్ హైదరాబాద్ తొమ్మిదో స్థానంలోనూ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధిస్తే నాలుగో స్థానంలోకి వెళ్లనుంది. సన్‌రైజర్స్ గెలిస్తే నెట్ రన్‌రేట్‌ను బట్టి ఆరో స్థానం వరకు చేరవచ్చు. అయితే ప్లే ఆఫ్స్ రేసులో ఉండాలంటే మాత్రం రెండు జట్లకూ ఈ విజయం చాలా కీలకం.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు
అభిషేక్ శర్మ, అన్మోల్‌ప్రీత్ సింగ్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, టి నటరాజన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, ఫజల్‌హాక్ ఫరూఖీ
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
వివ్రంత్ శర్మ, సన్వీర్ సింగ్, మయాంక్ డాగర్, నితీష్ కుమార్ రెడ్డి, మార్కో జాన్సెన్.
లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టు
క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), కైల్ మేయర్స్, కృనాల్ పాండ్యా (కెప్టెన్), ప్రేరక్ మన్కడ్, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, అమిత్ మిశ్రా, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, యుధ్వీర్ సింగ్ చారక్, అవేష్ ఖాన్
లక్నో సూపర్ జెయింట్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
స్వప్నిల్ సింగ్, డేనియల్ సామ్స్, ఆయుష్ బడోని, దీపక్ హుడా, అర్పిత్ గులేరియా.
ఐపీఎల్-16 సీజన్ లీగ్ దశ పోటీలు లాస్ట్ స్టేజ్‌కు చేరకున్న వేళ టాప్ -4 కోసం వివిధ జట్ల మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. ప్రస్తుతం ఉన్న పాయింట్ల పట్టిక మేరకు టాప్ -4 లేకున్నా లక్నో సూపర్ జెయింట్స్ (5వ స్థానం) కు ఇంకా ఆ ఛాన్స్ అయితే ఉంది. అయితే ఆ అవకాశాన్ని కోల్పోవద్దంటే నేడు హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగబోయే మ్యాచ్ ఆ జట్టుకు చాలా కీలకంగా మారింది.
ఈ సీజన్ లో 11 మ్యాచ్‌లు ఆడిన లక్నో ఐదు గెలిచి ఐదింట ఓడింది. ఏప్రిల్ 28న పంజాబ్ తో మ్యాచ్ గెలిచిన తర్వాత ఆ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడగా చెన్నైతో పోరు వర్షం కారణంగా అర్థాంతరంగా ముగియగా బెంగళూరు, గుజరాత్ లతో దారుణంగా ఓడింది. కెఎల్ రాహుల్‌కు గాయం కారణంగా ఆ జట్టు కూర్పు దెబ్బతింది. గుజరాత్ తో మ్యాచ్ లో వచ్చిన ఓపెనర్ క్వింటన్ డికాక్, మరో ఓపెనర్ కైల్ మేయర్స్ ఫర్వాలేదనిపిస్తున్నా దీపక్ హుడా విఫలమవుతున్నాడు. పంజాబ్ తో మ్యాచ్ తర్వాత స్టోయినిస్, పూరన్ ల నుంచి భారీ ఇన్నింగ్స్ రాలేదు. బదోని ఆడుతున్నా అతడికి ఇన్నింగ్స్ ముగుస్తందనగా బ్యాటింగ్ కు పంపుతుండటంతో అతడు పూర్తిస్థాయిలో రెచ్చిపోలేకపోతున్నాడు. గత మూడు మ్యాచ్ లలో కృనాల్ పాండ్యా సున్నాలకే పరిమితమయ్యాడు. బౌలింగ్ లో కూడా అవేశ్ ఖాన్ భారీగా పరుగులిచ్చుకుంటున్నాడు.